ఒక్క‌రోజులో ఇంత ఫాలోయింగా: 'బొద్దింక‌ల పార్టీ' పై ఉప‌రాష్ట్రప‌తి కామెంట్స్‌

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) వ్య‌వ‌హారం.. రాజ‌కీయ పార్టీల‌నే కాదు.. ఆయా పార్టీలతో అనుబంధం ఉన్న‌వారిని కూడా క‌ల‌వ‌ర ప‌రుస్తోంది.

Update: 2026-06-01 04:19 GMT

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) వ్య‌వ‌హారం.. రాజ‌కీయ పార్టీల‌నే కాదు.. ఆయా పార్టీలతో అనుబంధం ఉన్న‌వారిని కూడా క‌ల‌వ‌ర ప‌రుస్తోంది. రాజ్యాంగ ప‌ర‌మైన స్థానాల‌లో ఉన్న వారు కూడా.. కాక్రోచ్ జ‌న‌తా పార్టీపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో మీడియాకు.. యువ‌తకు కూడా కొన్ని సూచ‌న‌లు చేస్తున్నారు. దీనిని బ‌ట్టి.. అధికారంలో ఉన్న వారిలో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ వ్య‌వ‌హారం ఏ విధ‌మైన గుబులు పుట్టిస్తోందో.. అర్థ‌మ‌వుతుంది. తాజాగా దేశ ఉప‌రాష్ట్ర‌ప‌తి సీపీ రాధాకృష్ణ‌న్ కూడా కాక్రోచ్ జ‌న‌తా పార్టీపై ప‌రోక్షంగా వ్యాఖ్య‌లు చేశారు. వాస్త‌వానికి ఆయ‌న‌కు.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు సంబంధం ఉండ‌దు. అయినా.. సీజేపీపై విమర్శ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగింది?

కేర‌ళ‌కు చెందిన మ‌ల‌యాళం దిన‌ప‌త్రిక‌.. దీపిక 140వ వార్షికోత్స‌వం ఆదివారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఉప రాష్ట్ర‌ప‌తి సీపీ రాధాకృష్ణ‌న్ హాజ‌ర‌య్యారు. ఆయ‌న మాట్లాడుతూ.. మీడియా విధానాల‌ను ప్ర‌శ్నించారు. సానుకూల వార్త‌ల‌ను ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు తీసుకువెళ్ల‌క‌పోతే.. యువ‌త `బొద్దింక‌`లుగా మారుతార‌ని అన్నారు. అంతేకాదు.. స‌మాజాన్ని ముందుకు న‌డిపించే క్ర‌తువులో మీడియాకు కీల‌క పాత్ర ఉంద‌న్నారు. అభివృద్ధి, విజ‌యాలు, విధానాల‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లాల‌ని ఆయ‌న సూచించారు. అలా కాక‌పోతే.. యువ‌త బొద్దింక‌లను అనుస‌రించే అవ‌కాశం ఇచ్చిన‌ట్టే అవుతుంద‌న్నారు.

అంతేకాదు.. కాక్రోచ్ జ‌న‌తాపా ర్టీని ఉద్దేశించి ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఒక్క రోజులో.. ఒక్క గంట‌లో ఇంత ఫాలోయిం గా? అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన ఉప‌రాష్ట్ర‌ప‌తి.. ఇది కాల పరీక్ష‌కు నిల‌బ‌డే వ్య‌వ‌హారం కాద‌న్నారు. నిజానికి ప్ర‌జ‌ల కోస‌మే అయితే.. వారం, ప‌దిరోజులు.. నెల రోజుల త‌ర్వాత కూడా అదే త‌ర‌హా ప‌రిస్థితి ఉండాల‌న్నారు. ఒక్క రోజులో ఒక్క విష‌యానికి ఇంత‌ప్రాధాన్యం ఎందుక‌ని ఆయ‌న మీడియాను ప్ర‌శ్నించారు. పుంఖాను పుంఖాలుగా మీడియా ఒక వైపే(కాక్రోచ్ పార్టీ) చూస్తోంద‌ని.. ఇది స‌రికాద‌ని అన్నారు. అయితే.. తాను భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు వ్య‌తిరేకం కాద‌ని.. కానీ, కాల ప‌రీక్ష‌కు నిల‌బ‌డ‌ని విష‌యాల‌నే తాను ప్ర‌శ్నిస్తున్నాన‌న్నారు.

సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న స‌మాచారాన్ని విశ్వ‌సించే ప‌రిస్థితి ఎందుక‌ని ప్ర‌శ్నించారు. ఒక విష‌యంపై నిర్ధార‌ణ చేసుకునేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని, కానీ, అనూహ్య‌మైన స్పంద‌న ఎంద‌క‌ని కాక్రోచ్ జ‌న‌తా పార్టీకి ఉన్న ఫాలో వ‌ర్ల విష‌యా న్ని రాధాకృష్ణ‌న్ నిల‌దీశారు. జాతి నిర్మాణంలో మీడియా కీల‌క పాత్ర పోషించాల‌ని సూచించారు. సానుకూల వార్త‌లు, అభివృద్ధి, వ్య‌క్తుల విజ‌యాల‌కు పెద్ద‌పీట వేయ‌డం ద్వారా యువ‌త‌ను బొద్దింక‌ల నుంచికాపాడే బాధ్య‌త మీడియాకే ఉంద‌ని తెలిపారు. కాగా.. ఈ నెల ప్రారంభంలో దీప్కే అనే యువ‌కుడు కాక్రోచ్ జ‌న‌తాపార్టీని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. దీనికి గంట‌లు, రోజుల్లోనే కోట్ల మంది ఫాలోవ‌ర్లు పెరిగిపోయారు. ఈ నేప‌థ్యంలోనే దేశ‌వ్యాప్తంగా ఈ వ్య‌వ‌హారంపై చ‌ర్చ‌కు దారితీసింది.

Tags:    

Similar News