ట్రంప్‌ను కాదని మరీ మరియా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి ఎందుకంటే?
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి ఈ ఏడాది వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడోకు లభించింది.;
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి ఈ ఏడాది వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడోకు లభించింది. బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, నార్వే నోబెల్ కమిటీ మాత్రం తన స్వతంత్ర నిర్ణయానికి కట్టుబడి, లాబీయింగ్‌లకు లొంగకుండా ప్రజాతంత్ర పోరాటాన్ని గౌరవించింది.
*ప్రజాస్వామ్య పోరాట సింహస్వాసికి గౌరవం
మరియా కొరీనా మచాడోకు ఈ గౌరవం దక్కడానికి ప్రధాన కారణం.. ఆమె వెనెజువెలాలో ప్రజాస్వామ్య హక్కుల సాధన కోసం.. నియంతృత్వానికి వ్యతిరేకంగా నడిపిన శాంతియుత పోరాటం.
* కమిటీ ప్రకటన ప్రకారం:
ప్రజాస్వామ్య హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసింది మచాడో.. పార్లమెంట్ సభ్యురాలిగా, విపక్ష నేతగా పనిచేసిన మచాడో, వెనెజువెలాలో సైనిక పాలన, నియంతృత్వ విధానాలపై గట్టిగా గళమెత్తారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఆమె చేపట్టిన ఉద్యమాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఈ క్రమంలో ఆమె బెదిరింపులు ఎదుర్కొని, గత ఏడాది కాలంగా అజ్ఞాతంలో కూడా జీవించాల్సి వచ్చింది. "వెనెజువెలాలో శాంతియుత ప్రజాస్వామ్య సాధన కోసం అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించిన" ఆమె పోరాటం ప్రపంచ ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి అని నోబెల్ కమిటీ కొనియాడింది.
* ట్రంప్ ఆశలు వృథా: కమిటీ స్వతంత్ర నిర్ణయం
నోబెల్ శాంతి బహుమతి కోసం డొనాల్డ్ ట్రంప్ గట్టిగా ప్రయత్నించారు. తాను ప్రపంచ యుద్ధాల మధ్య శాంతిని సాధించడంలో కీలకపాత్ర పోషించానని తరచూ చెప్పుకున్నారు. బహుమతి ప్రకటనకు కొద్ది గంటల ముందు రష్యా ప్రతినిధి కూడా ఆయన నామినేషన్‌కు మద్దతు తెలిపారు. అయినప్పటికీ నార్వే నోబెల్ కమిటీ ప్రచారాల ప్రభావానికి లొంగలేదు.
కమిటీ కార్యదర్శి క్రిస్టియన్ బెర్గ్ హర్ప్వికెన్ స్పష్టం చేసినట్లుగా.. "మా నిర్ణయాలు పూర్తిగా స్వతంత్రం. మీడియా ప్రచారం మాపై ప్రభావం చూపదు." అని కుండబద్దలు కొట్టారు. లాబీయింగ్‌కు, ప్రచారాలకు కమిటీ ఏ మాత్రం లొంగదని ఈ నిర్ణయం ద్వారా తేలిపోయింది.
మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం అనేది, ఒక దేశంలో పౌరుల హక్కుల కోసం పోరాడే ధైర్యానికి.. నిబద్ధతకు అంతర్జాతీయ గుర్తింపు లభించినట్టుగా నోబెల్ కమిటీ అభిప్రాయపడింది. ఇది కేవలం ఒక వ్యక్తికి దక్కిన గౌరవం కాదు, ప్రపంచ ప్రజాస్వామ్య శక్తులకు ఒక స్ఫూర్తిదాయక సందేశం.
*మరియా కొరీనా మచాడో ప్రస్థానం ఇదీ
-1967 అక్టోబర్ 7న జన్మించిన మరియా కొరీనా మచాడో, 2002లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆరంభం నుంచే ఆమె ప్రజాస్వామ్య సూత్రాలు, విలువలను కాపాడటంపై కట్టుబడి పనిచేశారు. తన అచంచల నిబద్ధత, ధైర్యసాహసాలకు ప్రతీకగా ఆమెను ప్రజలు ప్రేమగా “వెనిజులా ఐరన్ లేడీ”గా సంబోధించారు.2025లో టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన “ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది” జాబితాలో చోటు సంపాదించడం, మచాడో యొక్క అంతర్జాతీయ స్థాయిలోని ప్రభావం, నాయకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.
నోబెల్ శాంతి బహుమతి: కొన్ని ఆసక్తికర అంశాలు
1901లో నోబెల్ శాంతి బహుమతి ప్రారంభమైంది. ఇప్పటి వరకు 105 సార్లు ప్రదానం చేయబడింది.111 మంది వ్యక్తులు, 31 సంస్థలు ఈ బహుమతిని అందుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన మలాలా యూసఫ్‌జాయ్ గా పేరొందింది.