పవన్ ను ఈసారి జీరోతో ఏసుకున్న ఆర్జీవీ!

సినిమాల్లో కొన్ని హిట్ కాంబినేషన్లు ఉన్నట్లు.. రాజకీయాల్లోనూ కొందరు నేతల్ని.. కొందరు ఎటకారం ఆడేసినట్లుగా ఇంకెవరూ ఆడేయరు.

Update: 2023-12-06 04:08 GMT

సినిమాల్లో కొన్ని హిట్ కాంబినేషన్లు ఉన్నట్లు.. రాజకీయాల్లోనూ కొందరు నేతల్ని.. కొందరు ఎటకారం ఆడేసినట్లుగా ఇంకెవరూ ఆడేయరు. వారిది తప్పు ఉన్నా లేకున్నా.. అవసరం ఉన్నా.. లేకున్నా.. ఆ విషయాల్ని పట్టించుకోకుండా తమకు తోచిన రీతిలో ఎటకారం ఆడేయటం.. మాటలతో పోట్లు పొడిచే ధోరణి కనిపిస్తూ ఉంటుంది. ఆ కోవలోకే వస్తుంది జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై.. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలు.

పవన్ కు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని వదలని వర్మ.. ఆయన్ను విమర్శించే చిన్న అవకాశాన్ని కూడా మిస్ కారు. తాజాగా అలాంటి తీరునే మరోసారి ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జతకట్టిన పవన్ పార్టీ మొత్తం 8స్థానాల్లో పోటీ చేయగా.. అన్నింట్లోనూ దారుణ పరాజయం పాలయ్యారు. అన్నిచోట్ల డిపాజిట్లు కూడా దక్కించుకోని పరిస్థితి. ఈ పొత్తుకు బీజేపీ నేతలు పెద్దగా ప్రయత్నాలు పెట్టలేదని.. జనసేన అభ్యర్థుల్ని తమ మిత్రపక్షంగా వారు గుర్తించలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా జనసేన ప్లాప్ షోపై వర్మ స్పందించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్క సాధించిన ఓట్లు కూడా జనసేన తరఫున పోటీ చేసిన ఎనిమిది మంది అభ్యర్థుల్లో ఒకరు కూడా సాధించలేదన్న వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే.. కూకట్ పల్లిలో జనసేన అభ్యర్థికి 39వేలకు పైగా ఓట్లు వచ్చినా.. ఇలాంటి మాటలు అనేయటం మరో అంశంగా చెప్పాలి.

ఇక.. రాంగోపాల్ వర్మ విషయానికి వస్తే.. తాజాగాఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ పాలిటిక్స్ లో సున్నాను కనిపెట్టారంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘మ్యాథ్స్ లో ఆర్యభట్ట సున్నాను కనిపెట్టారు. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ సున్నాను కనిపెట్టారు’’ అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. తెలంగాణలో బలం లేకున్నా అనవసరంగా పోటీ చేశారన్న సానుభూతి పలువురు వ్యక్తం చేస్తున్న వేళ.. వర్మ ఎటకారం ఇప్పుడు పవన్ అభిమానులకు మంట పుట్టేలా మారిందన్నమాట వినిపిస్తోంది.

Tags:    

Similar News