పవన్ యాక్షన్ వర్మ డైరెక్షన్.. పిఠాపురం ఓకేనా...!?

పిఠాపురం అంటేనే చాలా లెక్కలు తేలాల్సి ఉంటుందని అంటున్నారు. అక్కడ దాదాపుగా మూడు లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు.

Update: 2024-03-19 03:46 GMT

పిఠాపురం అంటేనే చాలా లెక్కలు తేలాల్సి ఉంటుందని అంటున్నారు. అక్కడ దాదాపుగా మూడు లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. కుల భావన కంటే లోకల్ భావన ఎక్కువ. లోకల్ అయితే చాలు తమకు అందుబాటులో ఉంటే చాలు. ఇది మెజారిటీ జనం ఫీలింగ్. పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉన్నా అది ఓట్ల దాకా ఎంతవరకూ వస్తుంది అన్నది కూడా విశ్లేషిస్తున్నారు.

పవన్ రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఈసారి ఆయన్ని గెలిపించుకోవాలని కాపులలో ఉంది. అదే సమయంలో అక్కడ బీసీలు ఎస్సీలు ఇతర సామాజిక వర్గాలు కూడా ఉన్నారు. క్యాస్ట్ పోలరైజేషన్ ఒక వైపు జరిగితే మిగిలిన కులాల నుంచి కూడా అంతే స్థాయిలో రియాక్షన్ ఉంటుంది అని అంటున్నారు.

ఎక్కువ సార్లు కాపులు గెలిచారు. అదే టైం లో క్యాస్ట్ పెద్దగా లేని వర్మ కూడా 2014లో ఇండిపెండెంట్ గా గెలిచారు. ఇలా చూస్తే ఎవరు గెలిచినా లోకల్స్ నే జనాలు ఎన్నుకున్నారు. పిఠాపురం ఎపుడూ సెలిబ్రిటీలను చూడలేదు. ఆ కొరతను పవన్ తీరుస్తున్నారు.

వర్మ విషయంలో చూస్తే ఆయన చంద్రబాబు పిలుపుతో వెళ్లి ఆయన బుజ్జగింపుతో తగ్గి కూల్ అయిపోయారు ఆ తరువాత పవన్ ని కలసి తాను తప్పక గెలిపించుకుంటాను అని హామీ ఇచ్చారు. అంతవరకూ ఒకే అయినా ఆయన అనుచరులు మాత్రం వర్మ తప్పుకోవడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది

Read more!

ఎందుకు తగ్గాలి, ఎందుకు పోటీ చేయరాదు అన్నది వారి ప్రశ్నగా ఉంది. వారిని బుజ్జగించే విషయంలో వర్మ ఇపుడు అసలైన కసరత్తు చేస్తున్నారు అని అంటున్నారు. అది ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలని అంటున్నారు. పిఠాపురం టికెట్ జనసేనకు ఇస్తున్నారు అని తెలియగానే వర్మ ప్రమేయం లేకుండానే అగ్ని జ్వాలలా ఆయన క్యాడర్ రెచ్చిపోయారు.

చంద్రబాబు లోకేష్ నుంచి పవన్ కళ్యాణ్ వరకూ అందరి మీద నిప్పులే చెరిగారు. ఇపుడు వర్మ అంతా ఒకే జై పవన్ అంటూంటే క్యాడర్ మాత్రం మీరు పోటీ చేయాల్సిందే అని అంటోందిట. ఇది పార్టీ నిర్ణయం అని వర్మ చెబుతున్నారు.

జనసేన క్యాడర్ కాకినాడ నుంచి వచ్చి తమతో దురుసుగా ప్రవరిస్తోందని వారితో కలసి పంచేయలేమని కూడా వర్మకు ఆయన వర్గం తేల్చి చెప్పేసిందట. ఇక బాబుని పవన్ ని కలసి వచ్చిన తరువాత వర్మ క్యాడర్ తో సమావేశమై వారి మనోభావాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన టోన్ మార్చారు.

తనకు క్యాడర్ అతి ముఖ్యమని అన్నారు. పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని చెబుతూనే జనసేన క్యాడర్ తమతో పనిచేసేందుకు కలసి రావాలని అన్నారు. అది వారి నిర్ణయం మీదనే ఉంటుందని కూడా వర్మ అన్నట్లుగా చెబుతున్నారు.

4

ఈ మొత్తం వ్యవహారం చూస్తూంటే జనసేన కూడా ఏమీ తగ్గడంలేదు అని అంటున్నారు. పవన్ కేవలం టీడీపీ మీద వర్మ మీద ఆధారపడకుండా కాకినాడ నుంచి జనసేన క్యాడర్ ని రప్పించుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

వర్మ విషయం తీసుకుంటే పవన్ ని గెలిపించే బాధ్యత తన భుజస్కందాల మీద పెడితే పూర్తిగా చేస్తాను అని అంటున్నారు. అదే విధంగా జనసేన తమతో కలసి రావాలని కోరుతున్నారు. మొత్తానికి ఇవన్నీ ఇలా ఉంటే టీడీపీ జనసేన క్యాడర్ పూర్తిగా సహకరించుకోకపోతే ఇబ్బందే అని అంటున్నారు.

Tags:    

Similar News