పిఠాపురం వర్మ మీద మళ్ళీ....ముద్రగడతో భేటీతో !

ఇక ఏపీలో చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అయింది. అయినా వర్మకు పదవి దక్కలేదు.;

Update: 2025-09-10 10:42 GMT

ఈ మధ్యనే పిఠాపురం వర్మకు హోదా పెరిగింది అంటే పదవి వచ్చిందని కాదు, ఆయనకు ఇద్దరు గన్ మెన్లను ప్రభుత్వం కేటాయించింది. అది అధికార హోదా కిందనే లెక్క అని అంటున్నారు. ఎందుకంటే పవర్ లో ఉన్న వారికి ఇదే తీరున రాచ మర్యాద లభిస్తుంది. దాంతో రాజు గారికి మంచి పదవే రెడీ చేసి ఉంచారు అని కూడా అంతా అనుకుంటున్న నేపధ్యం ఉంది. ఈ నేపధ్యంలో వర్మ సైతం గొంతు సవరించుకుని వైసీపీని గట్టిగా వినిపిస్తున్నారు. అయితే వర్మ మీద మళ్ళీ అవే పుకార్లు షికారు చేస్తున్నారు ఇంతకీ ఆ పుకార్లు ఏమిటి అంటే కనుక రాజకీయాల్లో కాస్తా ఆసక్తికరమే అని చెప్పాల్సి ఉంది.

ముద్రగడతో భేటీ :

పిఠాపురం వర్మ తాజాగా కిర్లంపూడి వెళ్ళి ముద్రగడ పద్మనాభంని కలిశారు అని ప్రచారం సాగుతోంది. ముద్రగడ గతంలో ఏమో కానీ ఇపుడు కరడు కట్టిన వైసీపీ నాయకుడిగా ఉన్నారు. అంతే కాదు ఆయన ఆ మధ్య రెండోసారి జగన్ ని సీఎం చేసేంతవరకూ విశ్రమించను అని ఒక భారీ శపధం చేశారు. అయితే ఇటీవల ముద్రగడకు ఆరోగ్యం సరిగ్గా లేదు. దాంతో ఎయిర్ లిఫ్ట్ చేసి మరీ హైదరాబాద్ లోకి ఆసుపత్రికి తరలించారు. దాంతో ఆయన కోలుకున్నారు. ఇటీవలే ఆయన తన సొంత ఇంటికి వచ్చారు. దాంతో ఆయనను పిఠాపురం వర్మ కలవడంపైనే అంతా చర్చిస్తున్నారు.

పరామర్శ మాత్రమేనా :

పెద్దాయన గోదావరి జిల్లాలలో సీనియర్ నాయకుడు కూడా అయిన ముద్రగడ అనారోగ్యం బారిన పడి కోలుకున్నారు కాబట్టే పరామర్శించారని వర్మ వర్గం అంటోంది. ఇది ఒక మర్యాదపూర్వకమైన భేటీగా చెబుతోంది. ఇందులో తప్పు ఏమీ లేదని ఊహాగానాలు కూడా అంతకంటే అవసరం లేదని అంటోంది. అయితే ఈ మధ్యనే సోషల్ మీడియాలో వైసీపీ యాక్టివిస్టులు ఒక ప్రచారాన్ని తెర మీదకు తీసుకుని వచ్చారు. తొందరలో ఒక టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరుతారు అన్నదే ఆ ప్రచారం. ఆ ప్రచారం అలా సాగుతూండగానే వర్మ వెళ్ళి ముద్రగడను కలవడంతో అది మరింతగా ఊపు అందుకుంది అని అంటున్నారు.

అసంతృప్తి అలాగే ఉందా :

ఇక ఏపీలో చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అయింది. అయినా వర్మకు పదవి దక్కలేదు. తమ నాయకుడు సీటు కనుక త్యాగం చేయకపోయినా లేక ఒంటరిగా పోటీ చేసినా ఈ పాటికి ఎమ్మెల్యే అయి ఉండేవారు అని వర్మ అనుచరులు చెబుతూ ఉంటారు. అతి పెద్ద త్యాగం చేసిన దానికి దక్కిన ప్రతిఫలం ఇదా అని వర్మ అనుచర వర్గంలో ఆవేదన అయితే నిండుగా మెండుగా ఉందని అంటున్నారు. అంతే కాదు వర్మలో సైతం అసంతృప్తి బాగా పేరుకుపోయిందని అని అంటున్నారు. అందుకేనా ఆయన ముద్రగడతో మీట్ అయ్యారు అన్న చర్చ కూడా ఉందిట.

పవన్ వర్సెస్ ముద్రగడ :

ఇక ముద్రగడ పద్మనాభం విషయం తీసుకుంటే ఆయన 2024 ఎన్నికల్లో పవన్ పిఠాపురంలో ఎలా గెలుస్తారో చూస్తామని భారీ సవాల్ చేశారు. ఆయన మీద తీవ్ర విమర్శలు సైతం చేశారు. సినిమా నటులకు ఓటు వేయవద్దు అని జనాలను కోరారు. పవన్ కనుక గెలిస్తే తాను తన పేరు పద్మనాభరెడ్డి గా మార్చుకుంటాను అని శపధం పట్టి మరీ ఆ విధంగానే చేశారు. అలాంటి ముద్రగడను వర్మ కలవడం మీద జనసేనలో కూడా చర్చ సాగుతోంది అని అంటున్నారు. ఇప్పటికే వర్మ అనుచరులకు జనసేనకు మధ్య కోల్డ్ వార్ గా సీన్ ఉంది.

2029లో కూడా జరగని పని :

తమ నేతకు పదవి దక్కక పోవడానికి జనసేన కారణం అని వారు గట్టిగా భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ముద్రగడని వర్మ కలవడం మీద కూడా ఏ విధంగా పరిణామాలు ఉంటాయో అని అంటున్నారు. అయితే వర్మ కలవడం కేవలం మర్యాదపూర్వకమే అని ఆయన అనుచర వర్గం చెబుతోంది. కానీ ఎమ్మెల్యేగా వర్మను చూడాలంటే కూటమిలో 2029లో కూడా జరగని పని అని అంటున్నారు. దాంతో పాటు వర్మకు కూటమిలో ఫ్యూచర్ ఏ మేరకు అన్న చర్చలు కూడా చాలా కాలంగా సాగుతున్నాయని అంటున్నారు. మరి ఈ నేపధ్యంలోనే వర్మ ముద్రగడను కలిశారా లేక పెద్దాయనే ఆయనను పిలిపించుకున్నారా అన్నదే ఇపుడు హాట్ టాపిక్ గా ఉందిట. మరి చూడాలి ఈ ప్రచారంలో నిజమెంత అన్నది.

Tags:    

Similar News