విజయవాడ మేయర్‌ రేసు లో ఆశాల‌త‌.. !

విజ‌య‌వాడ రాజ‌కీయాల‌పై త‌న‌దైన ముద్ర వేసిన కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రంగా కుమార్తె ఆశాలత రాజ‌కీయాలు మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

Update: 2026-08-26 12:30 GMT

విజ‌య‌వాడ రాజ‌కీయాల‌పై త‌న‌దైన ముద్ర వేసిన కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రంగా కుమార్తె ఆశాలత రాజ‌కీయాలు మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చాయి. గ‌త ఏడాది త‌న తండ్రి వ‌ర్ధంతికి రెండు మాసాల ముందు.. రాజ‌కీయంగా యాక్టివ్ అయినట్టు ప్ర‌క‌టించిన ఆశాల‌త‌.. తొలుత‌ సేవా కార్య‌క్ర‌మాలు.. త‌ర్వాతే రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించారు. అయితే.. ఆ త‌ర్వాత‌.. ఆమె సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆశాలత వైసీపీ బాట ప‌డుతు న్నారన్న చ‌ర్చ కూడా జ‌రిగింది. కానీ, ఈ వ్య‌వ‌హారంపైనా మౌనంగానే ఉన్నారు.

ఇక‌, ఇప్పుడు స్థానిక ఎన్నిక‌లకు ముహూర్తం ఫిక్స్ అవుతున్న నేప‌థ్యంలో అనూహ్యంగా ఆశాల‌త పేరు రాజ‌కీయ వ‌ర్గాల్లో ముఖ్యంగా టీడీపీ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతుండ‌డం గ‌మ‌నార్హం. ..టీడీపీలోకి వంగవీటి వారసురాలు వ‌స్తున్న‌ట్టు కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులు గుస‌గుస‌లాడుతున్నారు. ఇప్పటికే రాజకీయంగా యాక్టివ్‌గా ఉన్నార‌ని.. టీడీపీతో టచ్‌లో ఉన్నారని వారు ప్రచారం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌లో కాపు సామాజిక వ‌ర్గానికి ప్ర‌త్యేక ప్ర‌తినిధి అంటూ ఎవ‌రూ లేరు.

సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు.. కాపునాయ‌కుడిన‌ని చెప్పుకొన్నా.. ఆయ‌న ప‌రిధి పెద్ద‌గా విస్త‌రించ లేదు. దీంతో నాటి రంగా సృష్టించిన గ్యాప్ అలానే ఉండిపోయింది. దీనిని భ‌ర్తీ చేయ‌డం అనేది పార్టీల‌కు ఇబ్బంది గానే మారింది. గ‌తంలో రంగా వార‌సుడు రాధాను అనుకున్నా.. ఆయ‌న పరిస్తితి డోలాయ‌మానంలో ప‌డింద‌న్న టాక్ ఉంది.దీంతో ఇప్పుడు ఆశాల‌త‌పైనే కాపులు, రంగా అభిమానులు.. రాధారంగా మిత్ర‌మండ‌లి భారీ ఆశ‌లు పెట్టుకు న్నాయి. ఈ క్ర‌మంలో ఆశాల‌త టీడీపీ వైపు చూస్తున్నార‌న్న‌ది ఆ పార్టీ నేత‌లు చెబుతున్న మాట‌.

విజయవాడ మేయర్‌ పీఠంపై ఆశా కన్ను..?

ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున మేయ‌ర్ అభ్య‌ర్థిగా ఆశాల‌త‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ ఊపందుకుంది. కాపు సమీకరణాలకు వంగవీటి వారసురాలి పేరును ప‌రిశీలిస్తున్న‌ట్టుగా టీడీపీ వ‌ర్గాల్లో ఈమె పేరు ప్ర‌స్తావ‌న‌ కు వ‌స్తోంది. అయితే.. దీని పై అటు పార్టీ అధిష్టానం కానీ.. ఇటు ఆశాల‌త కానీ.. ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. మ‌రి ఆమె టీడీపీ కండువా కప్పుకుంటారా?.. మేయర్‌ రేసులో నిలుస్తారా? అనేది వేచి చూడాలి. ఒక‌వేళ మేయ‌ర్‌గా ఆశ పోటీ ప‌డితే.. గెలుపు ఖాయ‌మ‌నేది ఆ వ‌ర్గం నేత‌లు చెబుతున్న మాట‌.

Tags:    

Similar News