మెగా మేనల్లుడికి ఆయన సెట్ అవుతున్నాడా?
మెగామేనల్లుడు వైష్ణవ్ తేజ్ సినిమా రిలీజ్ అయిన రెండు సంవ్సతరాలు సమీపిస్తుంది. `ఆదికేశవ` ప్లాప్ తర్వాత వైష్ణవ్ మళ్లీ అడ్రస్ లేడు.;
మెగామేనల్లుడు వైష్ణవ్ తేజ్ సినిమా రిలీజ్ అయిన రెండు సంవ్సతరాలు సమీపిస్తుంది. 'ఆదికేశవ' ప్లాప్ తర్వాత వైష్ణవ్ మళ్లీ అడ్రస్ లేడు. 'కొండపొలం', 'రంగ రంగ వైభవం'గా కూడా ప్లాప్ అవ్వడంతో మార్కె ట్ పై ప్రభావం పడింది. దీంతో కొత్త సినిమా విషయంలో డైలమాలో పడ్డాడు. ఆ డైలమా ఏ రేంజ్ లో సాగించా డంటే ఏకంగా రెండేళ్లు కాలం వెళ్లదీసాడు. వింటోన్న కథలు ఏవీ నచ్చకపోవడం...నచ్చిన కథల్లో తాను సెట్ అవ్వకపోవడంతో రెండేళ్లు వృద్ధాగా పోయింది.
కొడితే హింట్ కంటెంట్ తోనే రావాలని వైష్ణవ్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడు? అన్నది ఈ డిలే చూస్తేనే అర్దమ వుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా పరశురాం వైష్ణవ్ ని అప్రోచ్ అయినట్లు తెలిసింది. ఇటీవలే యంగ్ హీరోకి ఓ స్టోరీ వినిపించాడుట. లైన్ నచ్చడంతో చేద్దామని చెప్పాడుట. దీంతో పరశురాం స్టోరీ డెవలప్ చేసే పనిలో ఉన్నాడని ఆయన సన్నిహిత వర్గాల నుంచి లీకైంది. పరశురాం కూడా ఏడాది కాలంగా ఖాళీగానే ఉంటున్నాడు. చివరిగా విజయ్ దేవరకొండ హీరోగా ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని తెరకెక్కించాడు.
కానీ ఆ సినిమా అంచనాలు అందుకోలేదు. రోటీన్ సినిమా కావడంతో ప్రేక్షకుల్ని అలరించలేదు. కాస్త 'గీతా గోవిందం 'కాన్సెప్ట్ లో సినిమా ఉండటంతో విమర్శలకు గురయ్యాడు. ఈ సినిమా తర్వాత తీసిన `సర్కారు వారి పాట` మాత్రం యావరేజ్ గా ఆడింది. అందులో సూపర్ స్టార్ మహేష్ నటించాడు. ఈ సినిమాతో పరశురాం స్టార్ లీగ్ లోకి చేరాలి. కానీ అది జరగలేదు. పరశురాం తాజామూవ్ ని బట్టి అతడు వెనుకబడినట్లే కనిపిస్తుంది.
రెండేళ్లగా ఖాళీగా ఉన్న హీరోతో పరశురాం ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. గీతాగోవిందం సినిమాతో పరశురాం 100 కోట్ల క్లబ్ లో చేరిన సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా అనూహ్యంగా పెద్ద విజయం సాధించింది. దీంతో ఇండస్ట్రీ సహా జనాల్లో పరశురాం పేరు మారు మ్రోగిపోయింది. ఈ నేపథ్యంలో మహేష్ ఛాన్స్ ఇచ్చారు. కానీ `సర్కారు వారి పాట` మాత్రం ఆ రేంజ్ హిట్ అవ్వలేదు.