విజయ్ సాయి రెడ్డి చేరే పార్టీ అదేనా ?

అయితే దానికి విజయసాయిరెడ్డి సమాధానం చెప్పారు. తొందర ఎందుకు వేచి చూద్దామని ఆయన అనడం విశేషం.;

Update: 2026-01-22 17:19 GMT

వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ వి విజయసాయిరెడ్డి ఏ పార్టీలో చేరనున్నారు అన్నది ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే దశాబ్దన్నర రాజకీయ జీవితం ఆయనది. వైసీపీలో జగన్ తరువాత నంబర్ టూ గా ఒక వెలుగు వెలిగిన వారు, అలాంటి విజయసాయిరెడ్డి వైసీపీని వీడిపోతారు అని ఎవరూ అనుకోలేదు, కానీ అది జరిగిపోయింది. ఇక ఆయన తాజాగా ఈడీ విచారణకు హాజరై మీడియాతో మాట్లాడుతూ తాను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా చెప్పారు. దాంతో ఆయన చేరేది ఏ పార్టీ అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.

తొందరెందుకు అంటూ :

అయితే దానికి విజయసాయిరెడ్డి సమాధానం చెప్పారు. తొందర ఎందుకు వేచి చూద్దామని ఆయన అనడం విశేషం. తనను జగన్ ఆహ్వానిస్తారా లేక చంద్రబాబు పిలుస్తారా పవన్ పార్టీలోకి తీసుకుంటారా, బీజేపీ పెద్దలే కండువా కప్పుతారా లేక కాంగ్రెస్ కమ్యూనిస్టులు పిలుస్తారా అన్నది తొందర ఎందుకు వేచి చూద్దామని నర్మగర్భంగా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే చర్చకు ఆస్కారం ఇస్తున్నాయి. విజయసాయిరెడ్డి అయితే కచ్చితంగా రాజకీయాల్లో తాను కంటిన్యూ అవుతాను అని చెప్పేశారు.

చేరేది అందులోనేనా :

అయితే ఆయన తాజా ప్రెస్ మీట్ చూస్తే కనుక జగన్ ని గట్టిగా విమర్శించారు, కోటరీ అంటూ నిందించారు, దాంతో ఆయనకు వైసీపీలో రీ ఎంట్రీ అన్నది దాదాపుగా అసాధ్యం అని తేలిపోతోంది. అదే సమయంలో చంద్రబాబు తనను టార్గెట్ చేస్తున్నారు అన్నట్లుగా మాట్లాడారు, దాంతో ఆయన చేరే పార్టీ టీడీపీ కూడా కాదు అని స్పష్టం అవుతోంది అంటున్నారు. జనసేనలో చేరాలనుకున్నా టీడీపీని వ్యతిరేకించే వారిని తీసుకునే చాన్స్ ఉండదని అంటున్నారు. దాంతో బీజేపీలోనే విజయసాయిరెడ్డి చేరుతారు అన్న టాక్ అయితే నడుస్తోంది.

అక్కడే సుఖమా :

బీజేపీ కూడా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నా అది జాతీయ పార్టీ. పైగా విజయసాయిరెడ్డి కూడా ఢిల్లీ వేదికగా జాతీయ రాజకీయాల్లోనే కొనసాగాలని చూస్తున్నారు. దాంతో ఏపీకి సంబంధం లేకుండా ఆయన సేవలను బీజేపీ వినియోగించుకోవాలని అనుకుంటే మాత్రం ఆయనను బీజేపీ తీసుకోవచ్చు అని చెబుతున్నారు. విజయసాయిరెడ్డి సైతం బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నారని అంటున్నారు. ఆయనకు కేంద్ర స్థాయిలో పెద్దలతో మంచి రిలేషన్స్ ఉన్నాయని అంటున్నారు. ఇక విజయసాయిరెడ్డి వదిలేసిన సీటు బీజేపీ నేతకే వెళ్ళడం బట్టి చూస్తే ఆయన కాషాయం కండువాను కప్పుకునే చక్రం తిప్పే రోజులు ఉన్నాయని అంటున్నారు. సో అదన్న మాట మ్యాటర్.

Tags:    

Similar News