ఫేక్ న్యూస్ కాదు.. ఎయిర్ పోర్టులో రూ.10కే కాఫీ

ఎయిర్ పోర్టు అన్నంతనే.. అక్కడ అమ్మే వస్తువులు.. వస్తుసేవల ధరలు ఆకాశాన్ని అంటి ఉంటాయి.;

Update: 2025-09-30 09:30 GMT

నిజంగానే నిజం. శీర్షిక చూసిన తర్వాత ఇదేదో గాలి మూట కట్టేసిన సమాచారంగా భావించేటోళ్లు కొందరు ఉండొచ్చు. కానీ.. ఆ భావన తప్పు. కమ్మటి కాఫీని రూ.10లకే అందేలా చేయటం ఒక ఎత్తు అయితే.. అది కూడా ఎయిర్ పోర్టులలో అందుబాటులోకి రావటానికి మించిన సంతోషకరమైన వార్త ఇంకేం ఉంటుంది. కాఫీ లవర్స్ పండుగ చేసుకునే ఈ ఉదంతంలోకి వెళితే..

ఎయిర్ పోర్టు అన్నంతనే.. అక్కడ అమ్మే వస్తువులు.. వస్తుసేవల ధరలు ఆకాశాన్ని అంటి ఉంటాయి. అయితే.. అందరికి అందుబాటులో ఉండేలా ధరల్ని సెట్ చేయటం.. అందుకు తగ్గట్లుగా ఆహారపదార్థాలు అందుబాటులో ఉండటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవ పుణ్యమా అని.. దేశీయ విమానాశ్రయాల్లో ‘‘ఉడాన్ యాత్రి కెఫే’’లను ఏర్పాటు చేయనున్న విషయాన్ని వెల్లడించారు.

తాజాగా విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఈ కేఫ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు విమానాశ్రయాల్లో ఈ తరహా కేఫ్ లను స్టార్ట్ చేసినట్లు చెప్పారు. ఈ కేఫ్ ల ప్రత్యేకత ఏమంటే రూ.10కే కాఫీ.. రూ.10కే వాటర్ బాటిల్తో పాటు రూ.20కు సమోసా.. రూ.20కే స్వీటును కూడా సర్వ్ చేస్తారు. దేశీయంగా అన్ని ఎయిర్ పోర్టుల్లోనూ ఈ తరహా కేఫ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అందరికి అందుబాటులో ఉండేందుకు వీలుగా ఈ ఉడాన్ కేఫ్ లను ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇంతకు మించిన గుడ్ న్యూస్ ఇంకేం ఉంటుంది?

Tags:    

Similar News