ట్రంప్ కి ఈమాత్రం తెలియదా.. పెంగ్విన్ల విషయంలో నెటిజన్స్ ట్రోల్స్!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికాకి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనలో వస్తున్న మార్పులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.;

Update: 2026-01-24 08:10 GMT

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికాకి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనలో వస్తున్న మార్పులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అంతేకాదు ఒక్కోసారి ఆయన చేస్తున్న పనులు వివిధ దేశాల ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పిస్తే.. మరోవైపు ఆయన చేస్తున్న తప్పిదాల కారణంగా విమర్శలతో పాటు భారీగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటున్నారు. అలాంటిది ఈయన తాజాగా తన పరువును తానే తీసుకోవడం చూసి ప్రతి ఒక్కరూ ట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాదు ట్రంప్ కి ఈ మాత్రం తెలియదా? అంటూ నవ్వుకుంటున్నారు. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

తాజాగా వైట్ హౌస్ అధికారిక ఖాతా నుండి డోనాల్డ్ ట్రంప్ షేర్ చేసిన ఒక ఏఐ జనరేటర్ ఫోటో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఒక పెంగ్విన్ తో కలిసి గ్రీన్ ల్యాండ్ నుంచీ పర్వతాల వైపు డోనాల్డ్ ట్రంప్ నడుస్తున్నట్లు ఉంది. పైగా ఆ ఫోటోకి క్యాప్షన్ గా "పెంగ్విన్లను హత్తుకోండి" అని పెట్టారు .ఈ ఫోటో వైరల్ అయిన కొద్దిసేపటికి నెటిజన్లు ట్రంప్ జియోగ్రాఫికల్ నాలెడ్జ్ ను ప్రశ్నిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. గ్రీన్ ల్యాండ్ ఉత్తరార్ధగోళంలో ఉందని.. అక్కడ అసలు పెంగ్విన్లు ఉండవని.. పెంగ్విన్ లు కేవలం దక్షిణార్థగోళంలో అంటే అంటార్కిటికా ప్రాంతంలో మాత్రమే జీవిస్తాయి అంటూ ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.

అంతేకాదు పెంగ్విన్లు ఎక్కడ ఉంటాయో కూడా తెలియని ట్రంప్.. ఏకంగా గ్రీన్ ల్యాండ్ ని కొనేస్తానని చెప్పడం ఏంటి? విడ్డూరంగా ఉందే అంటూ ఎద్దేవా చేస్తున్నారు. గ్రీన్ ల్యాండ్ లో అసలే లేని జీవులను ఆ దేశ చిహ్నంగా చూపడంపై నెటిజెన్స్ మాత్రమే కాదు శాస్త్రవేత్తలు కూడా సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు. పెంగ్విన్లు అసలు ఎక్కడ జీవిస్తాయో కూడా తెలియని ట్రంప్ ఇలాంటి పోస్ట్ పెట్టడం కరెక్ట్ గా లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు భారీగా విమర్శలు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు.

ఇకపోతే డోనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్ ల్యాండ్ ను డెన్మార్క్ నుంచి కొనుగోలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. రష్యా - చైనాల నుంచి ముప్పు పొంచి ఉండడంతో గ్రీన్ ల్యాండ్ అమెరికాకు రక్షణ కవచంలా ఉంటుందని.. గ్రీన్ ల్యాండ్ విషయంలో తనకు సహకరించని ఐరోపా దేశాలపై 25% సుంకాలు విధిస్తానని ఇటీవలే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక ఇన్ని చేస్తున్న ట్రంప్ కి అసలు గ్రీన్ ల్యాండ్ లో పెంగ్విన్లు ఉంటాయా? లేదా? అన్న విషయం కూడా తెలియకుండా షేర్ చేసిన ఏఐ జనరేటర్ ఫోటో ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. పైగా ప్రస్తుతం వైట్ హౌస్ నుంచి షేర్ చేయబడిన ఈ ఏఐ ఫోటో వైరల్ గా మారుతోంది.

Tags:    

Similar News