• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  షేక్ హ్యాండ్ తో మొదలు...

షేక్ హ్యాండ్ తో మొదలు పెట్టి.. చిరునవ్వుతో ట్రంప్ ను ఉతికేసింది

| ముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెతకు కొత్త అర్థాన్ని ఇచ్చారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా బరిలో ఉన్న కమలా హారిస్.

By - Tupaki Desk
Update: 2024-09-12 04:23 GMT

ముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెతకు కొత్త అర్థాన్ని ఇచ్చారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా బరిలో ఉన్న కమలా హారిస్. తిట్లు.. విమర్శలు.. ఆగ్రహావేశాలు మాత్రమే రాజకీయం కాదని.. అంతకు మించినవి చాలానే ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. ఎదిగే కొద్దీ ఎలా వ్యవహరించాలన్న అంశాల్ని తన చేతలతో చూపించారు ఆమె. ఎంతటోడైనా సరే.. ప్రేమాభిమానాల్ని ప్రదర్శిస్తూ.. వ్యక్తిగత నిందలకు పోకుండా.. విధానపరమైన అంశాల్ని లెవనెత్తటం ద్వారా అధిక్యతను ప్రదర్శించొచ్చన్న విషయాన్ని ఆమె తన తీరుతో స్పష్టం చేశారు.

ట్రంప్ -కమలా హారిస్ మధ్య జరిగిన మొదటి డిబేట్ లో కమలా హారిస్ ఎంట్రీ నుంచి ఎండింగ్ వరకు ఆసక్తికర తీరును ప్రదర్శించారు. ప్రత్యర్థిని శత్రువుగా చూసే ధోరణి ట్రంప్ కు ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆ వ్యవహారశైలికి భిన్నంగా కమలా హారిస్ మాత్రం రాజకీయ ప్రత్యర్థిని.. ప్రత్యర్థిగా మాత్రమే చూస్తూ.. శత్రువుగా భావించన్న సందేశాన్ని తాజా డిబేట్ లో చెప్పకనే చెప్పేశారు. డిబేట్ ఆరంభంలో ట్రంప్ నకు షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆమె.. డిబేట్ జరిగిన 90 నిమిషాలు చిరునవ్వుతో బదులు ఇవ్వటం.. ఆవేశానికి గురి కాకుండా వ్యవహరించటం ద్వారా అందరిని ఆకర్షించారు.

2021లో అధ్యక్ష ప్రమాణస్వీకారోత్సవానికి ట్రంప్ హాజరు కాలేదు. ఈ కారణంగా ట్రంప్ - కమలా హారిస్ ముఖాముఖిన ఎదురుపడటం ఇదే తొలిసారి. చర్చా వేదికపై ట్రంప్ దగ్గరకు వెళ్లి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆమె.. డిబేట్ ఆరంభంలోనే ట్రంప్ పై ఊహించని విధంగా ఎదురుదాడికి దిగారు. ‘‘మనం రెండు విభిన్నమైన విజన్ లను వినబోతున్నాం. ఒకటి భవిష్యత్తుకు భరోసా కల్పించేది. మరొకటి దేశాన్ని వెనక్కి తీసుకెళ్లేది’’ అంటూ చర్చను ప్రారంభించటం ద్వారా తన అధిక్యతను ప్రదర్శించారు.

రాజకీయాలు అంటే ఆవేశాలు.. ఆగ్రహాల్ని వ్యక్తీకరించటం కాదు.. ప్రజల సమస్యల మీదా.. పాలన మీదా ఫోకస్ చేయటం అన్న విషయాన్ని తన తీరుతో చెప్పేశారు కమలా హారిస్. ట్రంప్ మాత్రం ఎప్పటిలానే తన ప్రధాన అస్త్రమైన ద్వేషాన్ని.. ఆగ్రహాన్ని ప్రదర్శించారు. వ్యక్తిగత నిందలతో విరుచుకుపడ్డారు. డిబేట్ ముగిసే సమయానికి అందరికి తెలిసిన తీరును ట్రంప్ ను ప్రదర్శించి పాత చింతకాయ మాదిరి కనిపిస్తే.. రాజకీయం ద్వేషానికి చిరునామా కాదన్న రీతిలో వ్యవహరించిన కమలా హారిస్ తన అధిక్యతను ప్రదర్శించారు. కమల వ్యూహాన్ని గుర్తించిన ట్రంప్ టీం.. ఆయన్ను అలెర్టు చేసే ప్రయత్నం చేసే ప్రయత్నం చేసినా.. ఆయన మాత్రంవాటిని పట్టించుకోకుండా విరుచుకుపడటం చూస్తే.. కమల విషయంలో ఆయన ఎంత ఆగ్రహంగా ఉన్నారన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    
  • Donaldtrump 
  • Kamalaharris 
  • Trumpkamaladebate 
  • USElections2024 
  • Republicanparty 
  • Democreticparty 
  • Americaelections 

Similar News

జైలు - బెయిల్ రాజకీయాల కోసం పొత్తు పెట్టుకోలేదు: వైసీపీపై నిప్పులు చెరిగిన చంద్రబాబు

2026-11-22 12:30 GMT

బండి సంజయ్ టార్గెట్ నెరవేరుతుందా? అసలు గురి 2028 ఎన్నికలేనా?

2026-11-22 11:36 GMT

టెన్షన్ ఎందుకు...లైట్ తీస్కో బ్రో !

2026-11-22 11:35 GMT

ఇమ్మిగ్రేషన్ అధికారుల దుర్మార్గం.. ఫ్లైట్ ఎక్కుతుండగా లాక్కేళ్లారు.. కూతురి ఆర్తనాదాలు వైరల్

2026-11-22 11:34 GMT

టీమిండియాలో సిరాజ్ కు దక్కని చోటు.. సెలెక్షన్ చుట్టూ రాజకీయ దుమారం..

2026-11-22 11:28 GMT

జగన్ లాంటి మనస్తత్వం ఎవరికి లేదు.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

2026-11-22 11:24 GMT

బాండ్ పేపర్లు.. రూ.కోట్ల ఆఫర్లు : పంచాయతీ ఎన్నికల్లో హామీల జాతర

2026-11-22 11:20 GMT

వరుణుడా.. మజాకా.. చలికాలంలోనూ తుఫాన్ల వెబ్ సిరీస్.. క్లైమాక్స్ ఎప్పుడో?

2026-11-22 10:55 GMT

అవెంజర్స్: ఎండ్‌గేమ్ రికార్డును బద్దలు కొట్టిన GTA 6.. ఒక్క రోజులోనే రూ. వేల కోట్ల వసూళ్లు!

2026-11-22 10:33 GMT

రూ.800 కోట్ల కలల సాకారం.. ఐఐటీ క్లాస్‌రూమ్ నుంచి మెటా సూపర్ ఇంటెలిజెన్స్ వరకు ఓ భారతీయుడి అద్భుత ప్రస్థానం

2026-11-22 04:34 GMT

పుష్క‌రాల‌కు మోడీ వ‌స్తున్నారు.. ఏర్పాట్లు అద‌రాలి: చంద్ర‌బాబు

2026-11-22 04:32 GMT

టెస్టు క్రికెట్‌లో టీమ్‌ఇండియా విధ్వంసం.. రికార్డులన్నీ బద్దలు.. పంత్‌ ఖాతాలో అరుదైన ఘనత

2026-11-22 04:32 GMT

Copyright @2026

Powered by Blink CMS