ఇండియాది ‘డెడ్ ఎకానమీ’.. ట్రంప్ ను ఛాలెంజ్ చేసిన అమెరికా ‘ఏఐ’లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ ఆర్థిక వ్యవస్థపై చేసిన "డెడ్ ఎకానమీ" వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర చర్చకు దారితీశాయి.;

Update: 2025-08-02 07:36 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ ఆర్థిక వ్యవస్థపై చేసిన "డెడ్ ఎకానమీ" వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర చర్చకు దారితీశాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అసహనం వ్యక్తం చేస్తూ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు గురయ్యాయి. ఈ వ్యాఖ్యలపై భారతీయలు, రాజకీయ నాయకులు తీవ్రంగా స్పందించారు. అయితే, దీనిపై ఒక విచిత్రమైన మలుపు చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంస్థలు ట్రంప్ వ్యాఖ్యలను ఖండించాయి.

భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన ఈ తరుణంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. ఈ నేపథ్యంలో 'భారత ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీనా?' అనే ప్రశ్నపై అంతర్జాతీయంగా చర్చ మొదలైంది.

-ట్రంప్ వ్యాఖ్యలను ఛాలెంజ్ చేసిన ఏఐలు

ఈ చర్చ వైరల్ అవుతుండగా.. అమెరికాలోని ప్రముఖ ఏఐలు ఛాట్ జీపీటీ, గ్రోక్, జెమినీ, మెటా ఏఐ, కోపైలట్ లాంటి అమెరికా ఏఐలు ఈ విషయంపై తమ విశ్లేషణను పంచుకున్నాయి. ఈ ఏఐలన్నీ కూడా ట్రంప్ వాదనను తోసిపుచ్చాయి. వాటి స్పందనలు ఏంటంటే..

ఛాట్ జీపీటీ: "భారతదేశ ఆర్థిక వ్యవస్థ మృతస్థితిలో లేదు. ఇది డైనమిక్ (క్రియాశీలక).. వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. గణాంకాలు కూడా దీన్నే సూచిస్తున్నాయి."

గ్రోక్: "భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. కాబట్టి అది డెడ్ ఎకానమీ వ్యాఖ్యలు నిరాధారమైనవి."

జెమినీ: "భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధి రేటును కనబరుస్తోంది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆదర్శంగా మారుతోంది."

మెటా ఏఐ: "భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. ట్రంప్ వ్యాఖ్యలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయి."

కోపైలట్: "ట్రంప్ వ్యాఖ్యలు వాస్తవానికి పూర్తిగా విరుద్ధమైనవి. అవి రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన వ్యాఖ్యలుగా కనిపిస్తున్నాయి."

-రాజకీయ వర్గాలకు షాక్ ఇచ్చిన ఏఐల సమాధానాలు

అమెరికాలో తమ సొంత టెక్నాలజీ సంస్థలే ట్రంప్ వ్యాఖ్యలను తప్పుపట్టడం అక్కడి రాజకీయ వర్గాలకు షాకిచ్చింది. భారత ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ చేసిన విమర్శలు రాజకీయ రణనీతిలో భాగమని, వాస్తవాలను అవి ప్రతిబింబించవని ఈ ఏఐల సమాధానాలు స్పష్టం చేశాయి.

నేడు అంతర్జాతీయ వేదికపై భారతదేశం ఒక బలమైన ఆర్థిక శక్తిగా నిలిచింది. డేటా ఆధారంగా విశ్లేషణలు చేసే ఏఐలు సైతం ఈ వాస్తవాన్ని గుర్తించాయి. ట్రంప్ చేసిన "డెడ్ ఎకానమీ" వ్యాఖ్యలు నిజానికి ఒక రాజకీయ కదలికలో భాగమని ఈ సంఘటన రుజువు చేసింది.

Tags:    

Similar News