ఉద్యోగులకు వాతలు తేలుతున్న ట్రంప్ దెబ్బలు.. హిస్టరీలో ఫస్ట్ టైమ్!

ఈ నేపథ్యంలో "డిఫర్డ్ రెసిగ్నేషన్ ప్రోగ్రామ్" (డీఆర్పీ) కారణంగా సెప్టెంబర్ 30న 1,00,000 మందికి పైగా ఫెడరల్ ఉద్యోగులకు విధుల్లో ఆఖరి రోజుగా మారింది.!;

Update: 2025-10-01 06:26 GMT

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరిచిన తర్వాత డొనాల్డ్ ట్రంప్.. ఫెడరల్ ప్రభుత్వాన్ని "స్లిమ్‌ డౌన్" చేయడానికి ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డీఓజీఈ) ప్రణాళికలు అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో "డిఫర్డ్ రెసిగ్నేషన్ ప్రోగ్రామ్" (డీఆర్పీ) కారణంగా సెప్టెంబర్ 30న 1,00,000 మందికి పైగా ఫెడరల్ ఉద్యోగులకు విధుల్లో ఆఖరి రోజుగా మారింది.!

అవును... రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యలో అతి వేగంగా తగ్గుదల నమోదు అవుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులు సామూహిక రాజీనామాలు చేస్తున్నారు. ట్రంప్ పరిపాలనలో భాగంగా ప్రవేశపెట్టిన ఈ డీఆర్పీ ప్రోగ్రామ్‌ లో ఉద్యోగులు ఫిబ్రవరి 6, 2025 నాటికి రాజీనామా చేస్తే.. సెప్టెంబర్ 30 వరకు పూర్తి జీతం, ప్రయోజనాలతో అడ్మినిస్ట్రేటివ్ లీవ్‌ పై ఉండవచ్చు.

ఈ క్రమంలో నిన్నటి (సెప్టెంబర్ 30)తో ప్రభుత్వ ఉద్యోగులకు విధించిన గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో వెంటనే రాజీనామాలు చేయాలని ఇప్పటికే వారందరికీ ఈ-మెయిల్స్ అందినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో సుమారు లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ తమ ఉద్యోగాలకు రాజీనామా చేయనున్నారు! దీనివల్ల ఏటా 14 బిలియన్ డాలర్లు, లాంగ్ టర్మ్ లో $28 బిలియన్స్ వరకూ ఆదా అవుతుందని అంటున్నారు.

ఈ క్రమంలో మొత్తం 2,75,000 ఉద్యోగులు వాలంటరీ సెపరేషన్, ఎర్లీ రిటైర్మెంట్, డిఫర్డ్ రెసిగ్నేషన్ లతో సహా ఈ సంవత్సరం చివరికి రాజీనామా చేయబోతున్నారని అంటున్నారు. ఈ చర్చ 2.3 మిలియన్ ఫెడరల్ ఉద్యోగుల సంఖ్యను 2.1 మిలియన్‌ కు తగ్గిస్తుంది. అయితే... మిలిటరీ, ఇమ్మిగ్రేషన్ ఎన్‌ ఫోర్స్‌ మెంట్, నేషనల్ సెక్యూరిటీ స్టాఫ్ వంటి కీలక రంగాల ఉద్యోగుల్ని మాత్రం ట్రంప్ సర్కార్ తప్పించడం లేదు.

అయితే అమెరికాలో ఈ పరిస్థితిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (ఎం.ఏ.జీ.ఏ) సపోర్టర్స్.. దీన్ని "బ్యూరోక్రసీ కట్"గా చూస్తుంటే... మరోవైపు లేబర్ యూనియన్స్ మాత్రం లాసూట్ ఫైల్ చేశాయి. దీంతో... అమెరికాలో ఈ విషయం అత్యంత హాట్ టాపిక్ గా మారింది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా పరిపాలనా రంగంలో తీవ్ర ప్రభావం పడనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News