అమెరికాకు ప్రపంచ ఉసురు తగిలిందా? దారుణ స్థితిలో ఉందా?

అగ్రరాజ్యమన్న అహంకారం తలనిండా పట్టించుకున్న అమెరికాకు.. ట్రంప్ లాంటి ఒంటెద్దుపోకడలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ట్రంప్ అధినేతగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన క్షణం నుంచి పరిస్థితుల్లో ఎంతటి మార్పు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.;

Update: 2025-09-09 05:30 GMT

అగ్రరాజ్యమన్న అహంకారం తలనిండా పట్టించుకున్న అమెరికాకు.. ట్రంప్ లాంటి ఒంటెద్దుపోకడలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ట్రంప్ అధినేతగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన క్షణం నుంచి పరిస్థితుల్లో ఎంతటి మార్పు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎడాపెడా నిర్ణయాలు తీసుకోవటం.. మనసుకు ఏది తోచితే దాన్నిచెప్పేయటం లాంటివెన్నో వికారాల్ని ఇప్పటివరకు ప్రదర్శించారు. ప్రపంచ దేశాల మీద సుంకాల పేరుతో షాకులు ఇచ్చిన ట్రంప్ కారణంగా అమెరికా ఆర్థిక పరిస్థితి అంతకంతకూ దిగజారుతోందన్న మాట బలంగా వినిపిస్తోంది.

తాజాగా అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జారుకోనుందా? అన్న ప్రశ్న తలెత్తేలా పలువురు విశ్లేషకుల వ్యాఖ్యలు ఉంటున్నాయి. ఆ కోవలోకే చెందింది అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ప్రధాన ఆర్థికవేత్త మార్క్ జాండీ అమెరికాను హెచ్చరిస్తున్నారు. అమెరికా జీడీపీలో మూడో వంతు ఇప్పటికే తిరోగమనంలోకి జారుకుందన్న ఆయన.. ‘ఇప్పటికే లేకున్నా.. జారుుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అమెరికాను మూడు ముక్కలుగా చేస్తే.. ఒక ముక్క ఆర్థికంగా దారుణ పరిస్థితుల్లో ఉంటే.. రెండో ముక్కనిలకడగా ఉంది. మూడో ముక్క మాత్రం పురోగమిస్తోంది. రాష్ట్రాల వారీగా చూస్తే.. వ్యోమింగ్.. మెంటానా.. మిన్నోసోటా.. మిస్సిస్సిప్పీ.. కాన్సాస్.. మసాచుసెట్స్ కు మాంద్యం ముప్పు పొంచి ఉంది’’ అని వ్యాఖ్యానించారు.

ట్రంప్ రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకు భారీగా కోత పెట్టటంతో వాషింగ్టన్ డీసీ కూడా ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటోందన్నారు. మార్క్ జాండీ మాటల్ని సీరియస్ గా తీసుకోవాలా? ఆయన విశ్లేషణను నమ్మేసి అగ్రరాజ్యం మీదకు ఒక అభిప్రాయానికి వచ్చేయటం మంచిదేనా? అన్న సందేహం కలగొచ్చు. దానికి ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

అదేమంటే..2008లో అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని ముందుగా అంచనా వేసిన వారిలో ఈ పెద్ద మనిషి (జాండీ) ఒకరన్న విషయాన్ని మర్చిపోకూడదు. అప్పట్లో అమెరికా ఆర్థిక మాంద్యం ప్రపంచ దేశాల్ని ఎంతలా ప్రభావితం చేసిందో తెలిసిందే. అమెరికాలో నిత్యవసర ధరలు మరింత పెరుగుతున్నాయని.. త్వరలోనే మర్చిపోలేనంత స్థాయికి చేరుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.

పెరిగిన ధరల కారణంగా అమెరికన్ల కొనుగోలు శక్తి తగ్గినట్లుగా చెప్పిన ఆయన.. ‘‘వినియోగదారుల వ్యయ వృద్ధి 2008-09 ఆర్థిక సంక్షోభ కాలం నాటి కనిష్ఠ స్థాయికి జారుకుంది. ఈ జులైలో అమెరికాలో వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మరో 0.2 శాతం పెరిగి.. 2.7 శాతానికి చేరుకుంది. వచ్చే ఏడాదికి ఇది కాస్తా 4 శాతానికి పెరిగే ఛాన్సుఉంది. దీని కారణంగా అమెరికన్ల కొనుగోలు శక్తి మరింత తగ్గే వీలుంది’ అంటూ ఆయన విశ్లేషిస్తున్నారు. మొత్తంగా అమెరికా మీద జాండీ లాంటి పెద్ద ఆర్థిక వేత్త చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక గా మారాయి. పెద్దన్న అహంకారంతో వ్యవహరిస్తే.. ఇలాంటి కొంప మునిగే కార్యక్రమాలు ఎదురవుతాయన్న విషయాన్ని ట్రంప్ ఇప్పటికైనా గుర్తిస్తారో లేదో?

Tags:    

Similar News