పని చేస్తే ఈ సంస్థల్లోనే చేయాలట.. ప్రపంచ టాప్ పాతికలో 16 భారత్ లో!

అంతిమంగా టాప్ 25 అత్యత్తుమ కంపెనీల జాబితాను విడుదల చేశారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ పాతిక కంపెనీల్లో పదహారు కంపెనీలు భారత్ లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండటం.;

Update: 2025-11-16 04:08 GMT

జాబ్ చేస్తే ఇలాంటి కంపెనీల్లోనే చేయాలనిపించే కంపెనీలు ప్రపంచంలోనే అత్యుత్తమైనవి ఏవి? అదే సమయంలో తాము పని చేసే కంపెనీ మీద గౌరవం.. విశ్వాసం.. ఉద్యోగుల పనికి తగ్గట్లుగా గుర్తింపును ఇచ్చే సంస్థల జాబితాను తయారు చేశాయి రెండు సంస్థలు. 2024-25 మధ్యన చేపట్టిన ఈ సర్వేలో భాగంగా మొత్తం 90 లక్షల మందిని సర్వేలో పాలు పంచుకునేలా చేశారు. అంతిమంగా టాప్ 25 అత్యత్తుమ కంపెనీల జాబితాను విడుదల చేశారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ పాతిక కంపెనీల్లో పదహారు కంపెనీలు భారత్ లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండటం.

ఈ సర్వేలో భాగంగా కొన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకున్నారు. కనీసం ఐదు వేల మంది ఉద్యోగులు పని చేస్తూ ఉండే కంపెనీలను ఈ జాబితాలో తీసుకున్నారు. ఇంతకూ ఈ జాబితాను ఎవరు రూపొందించారన్న సందేహం కలుగుతుంది. అక్కడికే వస్తున్నాం. ఫార్య్చూన్ మీడియా.. గ్రేట్ ప్లేస్ టు వర్కు సంస్థలు కలిసి ఈ జాబితాను సిద్ధం చేశాయి. ఈ జాబితాలో చోటు దక్కించుకునే సంస్థలు వివిధ దేశాల్లో శాఖలు ఉండటాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు.

ఆయా సంస్థలు ప్రాంతీయంగా మెరుగైన పని వాతావరణం కలిగి ఉన్న వాటిని వడపోతలో మరో ప్రాధాన్య అంశంగా తీసుకున్నారు. ఇంతకూ ఈ సంస్థ ఫైనల్ చేసిన టాప్ 25 అత్యుత్తమ పని చేసే అవకాశం ఉన్న సంస్థల జాబితాలో వివిధ సేవల్ని అందించే సంస్థలు.. టెక్నాలజీ.. హెల్త్ కేర్.. ఫైనాన్షియల్ సర్వీసెస్.. ఉత్పత్తి రంగాలకు చెందిన పాతిక కంపెనీలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. టాప్ 25 సంస్థల్లో భారత్ లోనూ తమ కార్యకలాపాల్ని నిర్వహించే సంస్థల జాబితాను కూడా వేరుగా ప్రస్తావిస్తాం. ఇప్పుడు ఆ జాబితాలోకి వెళితే..

- హిల్టన్

- డీహెచ్ఎల్ ఎక్స్ ప్రెస్

- సిస్కో

- యాక్సెంచర్

- మారియెట్ ఇంటర్నేషనల్

- అబ్ వీ

- టీపీ

- స్ట్రైకర్

- సేల్స్ ఫోర్స్

- మెట్ లెఫ్

- సర్వీస్ నౌ

- స్పెక్ సేవర్స్

- సీమెన్స్ హెల్త్ నీర్స్

- ఎక్స్ పీరియన్

- ఎన్విడియా

- కేడన్స్

- అలియాంజ్

- డౌ

- వైయాట్రిస్

- అడోబ్

- క్రౌడ్ స్ట్రైక్

- ఎస్ సీ జాన్సన్

- ట్రెక్ బైస్కిల్

- హిల్టి

- ఆడ్మిరల్ గ్రూప్

భారత్ లో సేవల్ని అందించని సంస్థలు ఇవే

- టీపీ

- స్పెక్ సేవర్స్

- సీమెన్స్ హెల్త్ నీర్స్

- ఎక్స్ పీరియన్

- అలియాంజ్

- డౌ

- వయాట్రిస్

- క్రౌడ్ స్ట్రైక్

- ట్రెక్ బైస్కిల్

- ఆడ్మిరల్ గ్రూప్

Tags:    

Similar News