టీటీడీ కీలక నిర్ణయం: 'అంగప్రదక్షిణ' అందరికీ!
శ్రీవారి ఆర్జిత సేవల్లో భక్తులు ఎంతో పవిత్రంగా భావించేది అంగప్రదక్షిణ. ఇది తెల్లవారుజామున 2-3.30 మధ్యలో చేస్తారు.;
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కోసం తపించే భక్తులు కోట్లలో ఉన్నట్టే.. ఆయనకు ఆర్జిత సేవలు చేసుకునేందుకు.. ఇంతే సంఖ్యలో భక్తులు నిత్యం తపిస్తుంటారు. తాజాగా ఇలాంటి భక్తుల కోసం.. టీటీడీ స్వామి వారి ఆర్జిత సేవలను మరింత చేరువ చేసింది. వీటిలో కీలకమైన అంగప్రదక్షణను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు లక్కీడిప్‌పై ఆధారపడిన ఈ సేవ.. ఇక నుంచి శ్రీవారి భక్తులకు చేరవ కానుంది.
శ్రీవారి ఆర్జిత సేవల్లో భక్తులు ఎంతో పవిత్రంగా భావించేది అంగప్రదక్షిణ. ఇది తెల్లవారుజామున 2-3.30 మధ్యలో చేస్తారు. పుష్కరిణిలో స్నానం చేసిన భక్తులు..అలానే ఆలయానికి చేరుకుని అంగ ప్రదక్షిణ చేస్తారు. దీనివల్ల తమ ఈతి బాధలు తొలుగుతాయని భావిస్తారు. అయితే.. ఇప్పటి వరకు ఈ అంగ ప్రదక్షిణకు ఇచ్చే టోకెన్ల కోసం.. వేచి చూడాల్సి వస్తోంది. పైగా.. లక్కీడిప్ కావడంతో కోట్ల మంది భక్తులు.. ఈ సేవకు మిస్సవుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలులో ఉన్న లక్కీ డిప్ విధానా న్ని రద్దు చేసి FIFO(ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్డర్) పద్ధతిలో టోకెన్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. కోటా విడుదలయ్యాక... ముందుగా నమోదు చేసుకున్న వారికి స్పాట్ బుకింగ్ కింద టోకెన్లు జారీ చేస్తారు. అంతేకాదు.. 3 నెలల ముందుగానే టోకన్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. రోజుకు 750 టోకెన్లు విడుదల చేయాలని నిర్ణయించడం గమనార్హం. సో.. ఇది సాకారం అయితే..నిర్విఘ్నంగా కొనసాగితే.. ఇక, అంగప్రదక్షిణ భాగ్యం అందరికీ చేరువ కావడం ఖాయం అంటున్నారు శ్రీవారి భక్తులు.