పహల్గాం ఎపిసోడ్ లో ఉగ్రవాదులకు సాయం.. ఇప్పుడేమో చనిపోయాడు

అన్యాయంగా అమాయకుల ప్రాణాలు తీసిన ఘటనలో ఉగ్రభూతాలకు సాయం చేసినోడు తాజాగా చచ్చిపోయాడు.;

Update: 2025-05-05 08:30 GMT

అన్యాయంగా అమాయకుల ప్రాణాలు తీసిన ఘటనలో ఉగ్రభూతాలకు సాయం చేసినోడు తాజాగా చచ్చిపోయాడు. పోలీసుల విచారణ కోసం తీసుకెళ్లి భద్రతా దళాలు చంపేశాయంటూ కశ్మీర్ కు చెందిన కొందరు నేతలు గగ్గోలు పెడుతున్న వేళ.. అసలు నిజం ఇదంటూ ఒక వీడియో వెలుగు చూసింది. ఇందులో ఇతగాడి ఘనకార్యం కళ్లకు కట్టినట్లుగా కనిపించటంతో ఇప్పటివరకు గగ్గోలు పెట్టిన వారంతా గప్ చుప్ అన్నట్లుగా మారిపోయారు.

పహల్గాం ఉగ్రఘటనలో ఉగ్రవాదులకు సాయం చేశాడు 23 ఏళ్ల ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే. ఇతన్ని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో తాను పహల్గాంలో ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు తాను ఆహారం.. ఆశ్రయంతో పాటు ఇతర సాయం చేసినట్లుగా అంగీకరించాడు. ఈ క్రమంలో ఉగ్రవాదులను బయటకు తీసుకొస్తానని పోలీసులకు నమ్మబలికాడు అహ్మద్.

దీంతో ఆదివారం ఉదయం పోలీసులు.. భద్రతాబలగాలు అతను చెప్పిన వైపు వెళ్లారు. వారికి దారి చూపించేందుకు సాయం చేస్తున్నట్లుగా నటించిన ఇంతియాజ్ అహ్మద్.. తప్పించుకునేందుకు వీలుగా దారిలో ఉన్న వేషా నదిలో దూకేశాడు. అయితే.. ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయాడు. ఈ మరణంపై తొలుత తప్పుడు ప్రచారం జరిగింది.

విచారణ కోసం తీసుకెళ్లిన ఇంతియాజ్ ను పోలీసులు చంపేశారంటూ మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మెహబూబా విమర్శించారు. మరికొందరు ఆమె విమర్శలకు బలం చేకూరేలా నోరు పారేసుకున్నారు. ఇలాంటి వేళలోనే అసలు వీడియో బయటకు వచ్చింది. అందులో ఎవరి ప్రమేయం లేకుండానే ఇంతియాజ్ నదిలోకి దూకుతున్న వైనం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. తొలుత ఈత కొట్టేందుకు ప్రయత్నిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు కాకుంటే.. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయాడు. ఈ వీడియో తాజాగా బయటకు వచ్చి వైరల్ గా మారింది. విమర్శకుల నోళ్లకు తాళం పడింది.

Tags:    

Similar News