మూడు నెలలు చాలు..రేవంత్‌ సవాల్‌కు హరీశ్‌ సై.!

కాళేశ్వరమే తెలంగాణకు జీవనాడి అనేది బీఆర్ఎస్ లైన్. అందుకోసం కన్నెపల్లి పంప్‌హౌజ్‌ లిఫ్టులు ఆన్ చేయాలని డిమాండ్ చేస్తోంది.

Update: 2026-07-08 08:03 GMT

తగ్గేదేలే. బీఆర్ఎస్‌ సవాల్‌కు రేవంత్‌ రివర్స్ ఛాలెంజ్. రేవంత్‌ కౌంటర్‌కు హరీశ్‌ స్ట్రాంగ్‌ రిప్లై. మూడు నెలలు ఇరిగేషన్ మంత్రి పదవి ఇవ్వు..అంతా సెట్ చేసి చూపిస్తానంటూ హరీశ్ సవాల్. కాళేశ్వరం. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పటి నుంచి రచ్చే. గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ఓటమికి కారణమైన అంశాల్లో ఇదొకటన్న చర్చ ఉంది. అలాంటి కాళేశ్వరమే మళ్లీ కారు స్పీడ్‌ను పెంచబోతోందా.? కేటీఆర్ టూర్‌ వెనుక స్ట్రాటజీ అదేనా.? మాజీ సీఎం కేసీఆర్ కూడా కాళేశ్వరం విజిట్‌కు వెళ్లే అవకాశం ఉందా.? అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. కాళేశ్వరం కూళేశ్వరం..రూ.లక్ష కోట్లు గంగపాలు అంటూ కాంగ్రెస్ పదేపదే చేస్తున్న కామెంట్స్‌ గులాబీ పార్టీకి గట్టిగా కుచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అదును చూసి..అధికార పార్టీకి స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చేందుకు ఎదురుచూస్తున్న బీఆర్ఎస్‌కు ఇప్పుడో బెటర్ ఛాన్స్‌ దక్కిందంటున్నారు. అదే కరవు పరిస్థితులు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు పెద్దగా వర్షాలు పడలేదు.

ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, డ్యామ్‌లు ఖాళీ అవుతున్నాయంటోంది బీఆర్ఎస్. ఒకప్పుడు నిండుకుండలా ఉన్న నీటి ప్రాజెక్టులన్నీ ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయని హైలెట్ చేస్తోంది. 2023 డిసెంబర్‌కు ముందు..ఇప్పుడు అంటూ పాత వీడియోలు..కొత్త వీడియోలు పెట్టి రిజర్వాయర్లు, డ్యామ్‌లు ఖాళీగా ఉన్నట్లు ప్రచారం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవసరమేంటో కరవు పరిస్థితులు ఉన్నప్పుడే తెలుస్తుందని చెబుతున్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఇప్పుడు వర్షాలు లేవు.. రైతులు సాగుకు ముందడుగు వేయలేకపోతున్నారని..అన్నదాతల మద్దతుతో ఆందోళనలు చేపట్టేందుకు రెడీ అయింది. ఇప్పటికే కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను పరిశీలించిన కేటీఆర్..పంప్‌లు ఆన్ చేయకపోతే 50వేల మందితో ముట్టడి కార్యక్రమం చేపడుతామని బిగ్‌ వార్నింగ్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు వరకు పాదయాత్ర చేపట్టేందుకు కూడా రెడీ అవుతోంది బీఆర్ఎస్.

ఛాలెంజ్‌ వార్‌తో నెక్స్ట్ లెవల్‌కు వాటర్‌ హీట్‌..

కాళేశ్వరమే తెలంగాణకు జీవనాడి అనేది బీఆర్ఎస్ లైన్. అందుకోసం కన్నెపల్లి పంప్‌హౌజ్‌ లిఫ్టులు ఆన్ చేయాలని డిమాండ్ చేస్తోంది. వాటర్ లిఫ్టింగ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కేసీఆర్, కేటీఆర్ బాధ్యత వహిస్తారని మాజీమంత్రి జగదీష్‌రెడ్డి ఔట్‌రైట్ స్టేట్‌మెంట్ ఇచ్చి పబ్లిక్‌ అటెన్షన్ గ్రాబ్ చేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి చేతనైతే పంపులను మోటార్లను ఆన్ చేసి నీటిని విడుదల చేయాలని జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు. ఒకవేళ ఆన్ చేసినప్పుడు ఏదైనా జరిగితే..తాము ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని కూడా రద్దు చేయడానికి వెనకాడబోమంటూ ఆయన చేసిన సవాల్‌ ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

సీఎం రేవంత్‌ కూడా అదేస్థాయిలో కౌంటర్ ఇస్తూ కాళేశ్వరం కేసీఆర్‌కు అప్పగించేందుకు రెడీ అన్నారు. మూడు వారాలు కాదు మూడేళ్లు మీ చేతుల్లోనే పెడుతాను ఏం చేస్తారో చూస్తానన్నారు రేవంత్. కానీ కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు అప్పగించాలో అసెంబ్లీకి వచ్చి చెప్పాలంటూ తిరకాసు పెట్టారు. ఇక మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీశ్‌రావు తెల్లారే రేవంత్‌ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు కౌంటర్‌గా..పీపీపీ ఇచ్చి నీళ్ల లెక్కలు అన్ని వివరించారు. మూడు నెలల పాటు తనకు నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు ఇస్తే..అంతా సెట్‌ చూసి కన్నెపల్లి పంప్‌హౌజ్‌ లిఫ్టులు ఓపెన్ చేసి నీళ్లు తెచ్చి చూపిస్తానన్నారు హరీశ్‌రావు. లేకపోతే పాలిటిక్స్ నుంచి తప్పుకుంటానని బిగ్ ఛాలెంజ్ చేశారు హరీశ్.

కాళేశ్వరమే కారు స్పీడును పెంచేనా.?

కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలే కేసీఆర్‌ గ్రాఫ్‌ను అంతో ఇంతో తగ్గించాయనేది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడదే కాళేశ్వరం అస్త్రంతో రివర్స్ స్ట్రాటజీ ప్లే చేయాలని డిసైడ్ అయ్యారట కేసీఆర్. ఇప్పుడున్న సాగునీటి కష్టాలను ఎక్స్‌పోజ్ చేస్తూ..కాళేశ్వరమే తెలంగాణకు వరప్రదాయిని అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట. గతంలో ప్రాజెక్టులు ఎలా ఉండే..ఇప్పుడెలా ఉన్నాయనేది వివరిస్తూనే..కాంగ్రెస్ సర్కార్ కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టును నడిపించడం లేదనే విషయాన్ని ప్రజలకు తెలిసేలా మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారట. ఈ క్రమంలోనే కేసీఆర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించే ప్రోగ్రామ్‌ పెట్టుకుంటున్నారని అంటున్నారు.

ఇన్నాళ్లు ఫాంహౌస్‌కే పరిమితం అయిన కేటీఆర్..కమ్‌బ్యాక్ గట్టిగానే ఉండేలా వ్యూహరచన చేస్తున్నారట. ఆయన బయటికి వస్తే గ్రామీణ తెలంగాణపైనే ఎక్కువ ఫోకస్ పెడుతారని.. రైతుల్లో ఎక్కువ ఇంపాక్ట్ చూపించే కాళేశ్వరం అంశాన్ని ఎజెండాగా ఎత్తుకొని ముందుకెళ్లేలా రూట్‌మ్యాప్‌ రెడీ చేస్తున్నారట. ఒకటి కాళేశ్వరంలో ఏ అవినీతి జరగలేదని చెప్పడం..రెండూ కాళేశ్వరం ఎందుకోసం కట్టమో ఇప్పుడున్న పరిస్థితులు ఏంటో ప్రజలకు వివరించడం..మూడు కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్‌ ఎందుకు నడిపించడం లేదో చర్చకు పెట్టడం ప్రధాన ఎజెండాగా తీసుకోబోతున్నారట. అలా అప్పుడు పార్టీకి నష్టపరిచిన కాళేశ్వరాన్నే..తిరిగి కారుకు ఇంధనంగా మార్చుకోవాలనేది కేసీఆర్ స్ట్రాటజీగా చెబుతున్నారు గులాబీ లీడర్లు .

Tags:    

Similar News