తెలంగాణాలో పొత్తుల్లేవు...ఎత్తులు తప్ప !

ఇక్కడ కేటీఆర్ మరో విషయం చెప్పారు. బీజేపీతోనే తమకు తెలంగాణాలో పోటీ ఉంటుందని అన్నారు.

Update: 2026-06-12 18:00 GMT

తెలంగాణా రాజకీయాల్లో ఒక రకమైన స్పష్టత రెండున్నరేళ్ళలో జరగబోయే ఎన్నికల కంటే ముందే వస్తోంది. షెడ్యూల్ ప్రకారం చూస్తే తెలంగాణాలో ఎన్నికలు 2028 డిసెంబర్ లో జరుగుతాయి. అంటే మరో ముప్పయి నెలలు గడువు ఉంది అన్న మాట. అయితే రాజకీయాల్లో ఉన్న వారికి ప్రతీ క్షణం విలువైనదే. అందుకే ఓడిన వెంటనే మరో ఎన్నికలు వారు రెడీ అవుతారు. తెలంగాణాలో వరసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సీఎం కావాలని తపన పడిన కేసీఆర్ ని 2023 నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఓడించారు. దాంతో బీఆర్ఎస్ డీలా పడింది. అయితే ఆ మీదట బీఆర్ఎస్ పుంజుకుంది. మెల్లగా బిగ్ సౌండ్ చేస్తూ వస్తోంది. ఇక కేసీఆర్ ఫాం హౌజ్ కే పరిమితం అయినా హరీష్ రావు కేటీఆర్ అయితే జనంలో ఉంటున్నారు. పార్టీ సమావేశాలను కూడా నిర్వహిస్తూ క్యాడర్ లో ఉత్సాహం నింపుతున్నారు. అసెంబ్లీలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగానే ఎదుర్కొంటున్నారు.

బీఆర్ఎస్ కీలక నిర్ణయం :

ఇక బీఆర్ఎస్ అయితే తాజాగా ఒక కీలకమైన ప్రకటన చేసింది. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నామని పేర్కొంది. ఈ విషయంలో రెండవ మాట లేదని కూడా పేర్కొంది. తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించాక ఒంటరిగానే బీఆర్ఎస్ పోటీ చేస్తూ వచ్చిందని కూడా కేటీఆర్ గుర్తు చేశారు. 2028 ఎన్నికల్లో కూడా బీఆర్ ఎస్ మొత్తం సీట్లకు పోటీ చేస్తుందని కేటీఆర్ అయితే ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు తమ ప్రత్యర్ధి ఎవరో కూడా చెప్పేశారు. బీజేపీతోనే తమకు పోటీ అని కాంగ్రెస్ మూడవ ప్లేస్ లో ఉంటుందని కూడా చెప్పేశారు.

బీజేపీ ముందే చెప్పింది :

ఇక చూస్తే తెలంగాణా పంజాబ్ లలో పొత్తులు లేవని ఒంటరిగా పోటీ చేస్తామని బీజేపీ ఇంతకు ముందే ప్రకటించింది. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కేంద్ర హోంమంత్రి బీజేపీ ముఖ్య నేత అమిత్ షా ఈ విషయం చెప్పారని అంటున్నారు. దాంతో ఒక క్లారిటీ అయితే వచ్చేసినట్లే అంటున్నారు. ఇంతకాలం బీఆర్ఎస్ బీజేపీ కలసి పోటీ చేస్తాయని ఊహాగానాలు వినిపించేవి. దానికి తగినట్లుగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బీజేపీ బీఆర్ ఎస్ కలసి వస్తున్నాయని పలు మార్లు చెప్పారు. అలా వచ్చినా కూడా తమదే విజయం అని కూడా చెప్పుకున్నారు. కానీ ఇపుడు ఆ విషయంలో అయితే ఒంటరి పోరుకే బీఆర్ఎస్ బీజేపీ సిద్ధపడుతున్నాయని అంటున్నారు.

బీజేపీతోనే పోటీ :

ఇక్కడ కేటీఆర్ మరో విషయం చెప్పారు. బీజేపీతోనే తమకు తెలంగాణాలో పోటీ ఉంటుందని అన్నారు. బీజేపీ తమకు ప్రధాన ప్రత్యర్థి అని కాంగ్రెస్ మూడవ ప్లేస్ లో ఉండబోతోంది అని జోస్యం చెప్పారు. మరి కేటీఆర్ లెక్క ఏమిటి అన్నది తెలియదు కానీ బాహుబలి గా బీజేపీ దూసుకుని వస్తుందని అంచనా వేసి గులాబీ పార్టీ ఈ విధంగా ప్రకటించిందా అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే కాంగ్రెస్ కూడా తెలంగాణాలో బీజేపీనే ప్రధాన ప్రత్యర్ధిగా భావిస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి బేజేపీని గట్టిగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు మరి బీఆర్ఎస్ కూడా బీజేపీయే అని చెప్పడం ద్వారా తెలంగాణాలో బీజేపీని ముందు వరసలోకి తెస్తున్నారా అన్న కొత్త చర్చ అయితే సాగుతోంది. అయితే కాంగ్రెస్ కి బీఆర్ ఎస్ కి క్షేత్ర స్థాయిలో బలాలు గట్టిగా ఉన్నాయి. కానీ వ్యూహాత్మకంగానే బీజేపీని ముందు పెట్టి అవతల పక్షాన్ని తగ్గిస్తున్నారు అని అంటున్నారు. మరి ఈ రకమైన ఎత్తుల వల్ల బీజేపీ అనూహ్యంగా పెరిగిపోతుందా జనాలలో కూడా కాషాయానికి ఆదరణ దక్కుతుందా అంటే చూడాల్సిందే మరి.

Tags:    

Similar News