పంచాయితీ సిత్రం: ఒకే కుటుంబానికి మూడు పదవులు

ఎన్నికలు ఏమైనా కావొచ్చు.. అవెంత ఖరీదన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.;

Update: 2025-11-27 05:30 GMT

ఎన్నికలు ఏమైనా కావొచ్చు.. అవెంత ఖరీదన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పంచాయితీ ఎన్నికలే కదా అని సింఫుల్ గా తీసుకోవటానికి లేదు. ఎందుకుంటే.. కొన్ని సందర్భాల్లో అదే పంచాయితీ ఎన్నికల కోసం కోట్లు ఖర్చు పెట్టే వారు ఉంటారు. అయితే.. తాజా ఉదంతం మాత్రం అందుకు భిన్నం. పైసా ఖర్చు చేయకుండానే తాజాగా తెలంగాణలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి మూడు పదవులు లభించటం విశేషంగా చెప్పాలి. అదెలా సాధ్యమైందంటే..

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్ లో ఒకే ఫ్యామిలీకి మూడు పదవులు దక్కనున్నాయి. ఆ గ్రామంలో ఎనిమిది వార్డులు.. 494 మంది ఓటర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే పదహారేళ్ల క్్రితం మైల్వాన్ నుంచి భీమమ్మ.. వెంకటమ్మ దంపతులు మంతన్ గౌడ్ తండాకు వచ్చి స్థిరపడ్డారు.

వారింట్లో ఆరు ఓట్లు ఉన్నాయి. వారి ఇద్దరు కుమారులు హైదరాబాద్ లో ఉంటున్నారు. భీమప్ప ఉన్న ఇల్లు మంతన్ గౌడ్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడి సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ జనరల్ కు కేటాయించారు. దీంతో పాటు నాలుగో వార్డు ఎస్టీ జనరల్.. ఆరో వార్డు ఎస్టీ మహిళకు రిజర్వు అయ్యాయి. ఇదిలా ఉండగా ఊళ్లో.. వీరు తప్పించి మరెవరూ ఎస్టీ ఫ్యామిలీలు లేకపోవటంతో.. సర్పంచ్ స్థానంతో పాటు.. ఇద్దరు వార్డు మెంబర్ల పోస్టులు వీరి కుటుంబానికే దక్కనున్నాయి. ఈ ఉదంతం స్థానికంగా అందరినోటా హాట్ టాపిక్ గా మారింది. ఎలాంటి శ్రమ లేకుండా సర్పంచ్.. ఇద్దరు వార్డు మెంబర్లుగా ఎంపికయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా లక్ అంటే భీమప్ప ఫ్యామిలీదేనని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News