80వేల మంది మధ్య హంతకుడిని చంపిన 13 ఏళ్ల బాలుడు.. ఎక్కడంటే?
అసలు విషయంలోకి వెళ్తే.. తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లోని ఒక స్టేడియంలో ఈ బహిరంగ మరణశిక్షను 13 ఏళ్ల బాలుడు చేత అమలు చేయించారు. వివరాలలోకి వెళ్తే..;
బహిరంగ హత్య.. అందులోనూ 80,000 మంది ప్రత్యక్షంగా చూస్తుండగా కేవలం 13 ఏళ్ల బాలుడు చేత హంతకుడిని అత్యంత కిరాతకంగా చంపించిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారుతోంది. ఇకపోతే ఆ హంతకుడు ఎవరు ? ఇది ఎక్కడ జరిగింది? 13 ఏళ్ల బాలుడిచేత ఆ హంతకుడిని చంపించడానికి గల కారణం ఏమిటి? ఈ కాలంలో కూడా బహిరంగ మరణశిక్షా ? ఇలా పలు విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లోని ఒక స్టేడియంలో ఈ బహిరంగ మరణశిక్షను 13 ఏళ్ల బాలుడు చేత అమలు చేయించారు. వివరాలలోకి వెళ్తే.. మంగల్ అనే వ్యక్తి తూర్పు ఆఫ్గనిస్తాన్ లోని ఖోస్ట్ లో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 13 మందిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అందులో 9 మంది చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు అతడికి మరణశిక్ష విధించగా.. బాధిత కుటుంబానికి చెందిన 13 ఏళ్ల బాలుడు నిందితుడైన మంగళ్ ను తుపాకీతో కాల్చి మరణశిక్షను అమలుపరిచాడు. ఈ ఘటనను చూడడానికి దాదాపు వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. ఇకపోతే ఈ మరణశిక్షను కోర్టు ప్రతీకార శిక్షగా అభివర్ణించగా.. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల అధికారులు మాత్రం అమానవీయం అంటూ కామెంట్లు చేశారు.
ఇకపోతే ఈ మరణశిక్ష పై సుప్రీంకోర్టు మాట్లాడుతూ.. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. బాధితుల కుటుంబాలకు క్షమాభిక్ష , శాంతి ప్రతిపాదనలు చేశామని, కానీ వారు అంగీకరించకపోవడం వల్లే మరణశిక్ష విధించినట్లు తెలిపారు. ఇకపోతే ఈ ఘటనను చూడడానికి ప్రజలు కూడా హాజరు కావాలని అధికారికంగా ప్రకటనలు కూడా జారీ చేశారని, ఈ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి మీడియాతో వెల్లడించారు.
ఇకపోతే తాలిబన్ల పాలనలో బహిరంగ మరణశిక్షలు అనేవి అత్యంత సర్వసాధారణం అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే గతంలో కూడా 1996 - 2001 వరకు కొనసాగిన తాలిబన్ల పాలనలో తరచుగా ఇలా బహిరంగ మరణశిక్షలు విధించేవారు. ముఖ్యంగా క్రీడా మైదానాలలో అప్పట్లో ఈ శిక్షలను అమలు చేసేవారు. అయితే 2021లో తాలిబన్లు తిరిగి అధికారం చేపట్టిన తర్వాత ఇది 12వ బహిరంగ మరణశిక్ష కావడం గమనార్హం. అటు బాధిస్ లో అక్టోబర్లో 11వ కేసు నమోదైంది. ఈ కేసు కంటే ముందు ఏప్రిల్ లో మూడు వేరువేరు ప్రావిన్స్ లలో నలుగురు వ్యక్తులకు ఒకేసారి మరణశిక్ష కూడా విధించారు.
ముఖ్యంగా తాలిబన్లు ఇప్పటికీ ఈ పద్ధతిని అమలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇకపోతే దొంగతనం, వ్యభిచారం , మద్యం సేవించడం వంటి నేరాలకు కొరడాలతో కొట్టడం వంటి శారీరక శిక్షలను కూడా అమలు చేస్తున్నారు. ఏది ఏమైనా తాలిబన్లు తీసుకునే కఠిన నిర్ణయాలు ఇంకొక నేరం చేయాలి అంటేనే ఇతరుల గుండెల్లో రైలు పరిగెట్టెలా చేస్తాయని అక్కడి ప్రజలు చెబుతూ ఉండడం గమనార్హం.