ట్రైన్ జర్నీలో లోయర్ బెర్తు కోసం ఇలా చేస్తే సరి

రైలు ప్రయాణ వేళ లోయర్ బెర్తుల కోసం పెద్ద వయస్కులు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ.. చాలాసార్లు వారికి లోయర్ బెర్తులు దక్కవు.;

Update: 2025-11-12 04:36 GMT

రైలు ప్రయాణ వేళ లోయర్ బెర్తుల కోసం పెద్ద వయస్కులు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ.. చాలాసార్లు వారికి లోయర్ బెర్తులు దక్కవు. మీరు రైలు ప్రయాణం చేసేటప్పుడు మీతో పెద్ద వయస్కులు ఉంటే.. వారికి అవసరమైన లోయర్ బెర్తుల కోసం ఎలాంటి తప్పులు చేయకూడదన్నది తెలిస్తే.. వారికి లోయర్ బెర్తులు దక్కని తిప్పలు ఉండవు. రైలు నిబంధనల ప్రకారం సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్తులు దక్కకపోవటానికి చాలామంది చేసే తప్పులే కారణమంటూ ఒక టీటీఈ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకూ సదరు వీడియోలో ఆ టీటీఈ ఏం చెబుతున్నారన్నది చూస్తే.. అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది.

45 ఏళ్ల పైబడిన మహిళలు.. 60 ఏళ్లు దాటిన పెద్ద వయస్కులు రిజర్వేషన్ బోగీల్లో బెర్తుల కోసం సీనియర్ సిటిజన్ల కోటా అంటూ ప్రత్యేకంగా ఉంటుంది. అంతేకాదు.. గర్భిణులు కూడా ఈ కోటాను ఉపయోగించుకోవచ్చు. మహిళల కోసం ప్రత్యేకంగా కోటా కూడా ఉంటుంది. చాలామందికి ఈ విషయం తెలీక జనరల్ కోటాలో టికెట్లను బుక్ చేస్తుంటారు. ఇటీవల ఒక టీటీఈ డిబ్రుగఢ్ రాజధాని ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో నలుగురు పెద్ద వయస్కులు ఎదురుపడ్డారు. వారిలో ఎవరికి లోయర్ బెర్తులు రాకపోవటాన్ని గుర్తించిన టీటీఈ.. దానికి కారణాన్ని వివరిస్తూ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

ఒకే పీఎన్ఆర్ పై ఒకరు లేదా ఇద్దరు సీనియర్ సిటిజన్లు జర్నీ చేస్తున్న వేళలో.. సీనియర్ సిటిజన్ కోటా వర్తిస్తుందని పేర్కొంటూ.. ‘‘రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసే వేళలో.. మీతో పాటు సీనియర్ సిటిజన్ ప్రయాణికులు ఉంటే దానిని జనరల్ కోటాగా సిస్టమ్ గుర్తిస్తుంది. అందుకే లోయర్ బెర్తులు లభించవు. అందుకు భిన్నంగా సీనియర్ సిటిజన్ ప్రయాణికులు ప్రయాణిస్తున్నప్పుడు కింది బెర్తులు దొరకటం కష్టమవుతుంది. అందుకే సీనియర్ సిటిజన్లు ఉంటే.. వారికి వేరుగా టికెట్ బుక్ చేసి వేరే పీఎన్ఆర్ తో ఇంకో టికెట్ బుక్ చేసుకోవటం మేలు’’ అంటూ పేర్కొన్నారు.

స్లీపర్ క్లాస్లో అయితే ప్రతి కోచ్ లో ఆరు నుంచి ఏడు లోయర్ బెర్తులను సీనియర్ సిటిజన్ బెర్తుల కోటా కింద కేటాయిస్తారని.. అదే ఏసీ త్రీ టైర్ లో అయితే నాలుగు నుంచి ఐదు.. ఏసీ 2టైర్ లో మూడు నుంచి నాలుగు బెర్తులు ఈ కోటా కింద కేటాయిస్తారు. బుకింగ్ వేళలో వయసు ధ్రువీకరణ అవసరం లేకున్నా.. ప్రయాణ సమయంలో మాత్రం అది తప్పనిసరి అవుతుంది. సో.. మీతో పాటు సీనియర్ సిటిజన్లు ప్రయాణిస్తుంటే.. ఈ చిట్కాను ఫాలో అయితే.. లోయర్ బెర్తులు లభిస్తాయన్నది మర్చిపోవద్దు.



Tags:    

Similar News