నొప్పి తెలియకుండా ఉరిశిక్ష.. సుప్రీంకోర్టు ఏమందంటే!
తీవ్ర నేరాలకు పాల్పడిన వారికి విధించే ఉరిశిక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
తీవ్ర నేరాలకు పాల్పడిన వారికి విధించే ఉరిశిక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరణశిక్ష విధించినప్పటికీ దానిని అత్యంత కఠినమైన ఉరిశిక్షగా కాకుండా.. ఎలాంటి నొప్పీ లేకుండా బాధ కలగకుండా మరణించేలా ఉరిశిక్షను మార్పు చేయాలని పిటిషనర్ అభ్యర్థించారు. అంతే కాదు.. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 354(5)ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని సీనియర్ న్యాయవాది రిషి మల్హోత్రా ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం.. నొప్పి తెలియకుండా మరణ శిక్ష విధించే విధానంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది. అదే విధంగా బలమైన వైద్య లేదా శాస్త్రీయ ఆధారాలు లభిస్తే, భవిష్యత్తులో రాజ్యాంగ సమీక్ష జరపవచ్చని స్పష్టం చేసింది. ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి మరణశిక్ష అమలు చేసే పద్ధతిపై సమగ్ర సమీక్ష చేపట్టేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
మరణ శిక్ష ను అమలు చేసే పద్ధతిగా ఉరిశిక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అదే సమయంలో, ఈ అంశాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని చూపే బలమైన వైద్య లేదా శాస్త్రీయ ఆధారాలు లభిస్తే, భవిష్యత్తులో రాజ్యాంగ సమీక్ష జరపడానికి ఈ రిట్ పిటిషన్‌ను కొట్టివేయడం అడ్డుకాదని కోర్టు స్పష్టం చేసింది. శిక్ష పడిన వ్యక్తుల గౌరవాన్ని కాపాడుతూనే, నొప్పి , బాధలను తగ్గించడమనే రాజ్యాంగ లక్ష్యాన్ని ప్రత్యామ్నాయ పద్ధతి మరింత మెరుగ్గా నెరవేరుస్తుందేమో పరిశీలించడానికి, ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయొచ్చని పేర్కొంది.
త ద్వారా మరణశిక్ష అమలు చేసే పద్ధతిపై సమగ్ర సమీక్ష చేపట్టేందుకు కూడా తాజా తీర్పు కేంద్ర ప్రభుత్వాన్ని నిరోధించదని కోర్టు స్పష్టం చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 354(5)ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. సీనియర్ న్యాయవాది రిషి మల్హోత్రా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్), "దీర్ఘకాలిక నొప్పి, వేదన"తో కూడిన ఉరిశిక్ష ద్వారా మరణశిక్షని అమలు చేసే ప్రస్తుత పద్ధతిని రద్దు చేయాలని కోరింది. ఈ మరణశిక్షా విధానానికి బదులుగా, ఖైదీ కేవలం కొన్ని నిమిషాల్లోనే మరణించగల ప్రాణాంతక ఇంజెక్షన్, కాల్చివేత, విద్యుదాఘాతం లేదా గ్యాస్ ఛాంబర్ వంటి పద్ధతులను ప్రవేశపెట్టాలని పిటిషనర్ అభ్యర్థించారు.