కొండచరియలు విరిగిపడి 1000 మందికి పైగా మృతి..అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే?
అసలు విషయంలోకి వెళ్తే.. సూడాన్ లోని మర్రా పర్వతాలలో ఎడ తెరపని వర్షాల కారణంగా భారీ కొండ చరియలు విరిగిపడ్డాయి.;
ప్రస్తుతం ఎక్కడ చూసిన అకాల వర్షాలు.. ఎడ తెరపని వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడుతూ.. తద్వారా మనుషుల ప్రాణాలు కోల్పోతున్నారు.. కనీవినీ ఎరుగని రీతిలో ఊహించని విధంగా జరిగే ఈ ప్రకృతి పరిణామాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఇదిలా ఉండగా ఈ అకాల వర్షాల కారణంగా.. ఇక్కడ ఒక ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడి ఏకంగా 1000 మందికి పైగా ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అనే విషయం యావత్ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.. మరి ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే.. సూడాన్ లోని మర్రా పర్వతాలలో ఎడ తెరపని వర్షాల కారణంగా భారీ కొండ చరియలు విరిగిపడ్డాయి. దీనివల్ల ఒక గ్రామం మొత్తం తుడుచుపెట్టుకుపోయింది. ఇందులో 1000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సూడాన్ లిబరేషన్ మూవ్ మెంట్/ఆర్మీ (SLM/A) ప్రకారం.. ఆగస్టు 31న.. రోజంతా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం వల్ల కొండ చరియలు విరిగిపడ్డాయని.. ఇలా సంభవించిన విపత్తు నుండి కేవలం ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. అబ్దేల్ వాహిద్ మొహమ్మద్ నూర్ నేతృత్వంలో.. SLM/A గ్రామం పూర్తిగా నేలమట్టం అయిందని, పిల్లలను మొదలుకొని పురుషులు, మహిళలు శిథిలాల కింద సమాధి అయ్యారని స్పష్టం చేశారు. ఇక మృతదేహాలను వెలికి తీయడానికి తక్షణ సహాయం కోసం ఐక్యరాజ్యసమితి, ప్రపంచ స్థాయి సంస్థలకు ఆ బృందం విజ్ఞప్తి చేసింది.
నిజానికి సూడాన్ సైన్యం, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య జరుగుతున్న భీకర అంతర్యుద్ధం కారణంగా ఇప్పటికే ఎంతోమంది బాధితులు నిరాశ్రయులయ్యారు. ఉత్తర డార్ఫర్ లో జరుగుతున్న యుద్ధం కారణంగా.. ఏర్పడిన హింసను తట్టుకోలేక చాలా కుటుంబాలు పారిపోయి మర్రా పర్వతాలలో ఆశ్రయం పొందాయి. అక్కడ ఆహారంతో పాటు మందుల కొరత కూడా చాలా ఉంది. ముఖ్యంగా ఈ ఘటన ఇళ్లను వదిలి వెళ్ళేలా చేయడమే కాకుండా సుడాన్ జనాభాలో సగానికి పైగా ప్రజలను తీవ్ర ఆకలిలోకి నెట్టింది. ఈ యుద్ధానికి దూరంగా వెళ్లి.. ఇప్పుడైనా జీవితాన్ని కొనసాగించాలి అనుకున్న వారికి ప్రకృతి కూడా సహకరించలేదు. అలా వీరంతా కూడా ప్రాణాలు కోల్పోయారు.
మొత్తానికైతే పర్వతాల సమీపంలో నివసిస్తున్న ప్రజలు దాదాపు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరొకవైపు ఉత్తర డార్ఫర్ రాజధాని అలీ షఫీర్ చుట్టూ పోరాటం కొనసాగుతోంది.. ఏది ఏమైనా ఒక విపత్తు నుండి బయటపడేలోపే మరో విపత్తు అక్కడి ప్రజలను ,వారి జీవితాలను అతలాకుతలం చేసిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈ కొండ చరియలు కారణంగా యుద్ధం నుంచి తప్పించుకొని తలదాచుకున్న ప్రజల ప్రాణాలను కూడా తీసేయడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు.