బొద్దింకను చంపాలనుకుంది.. మంటల్లో కాలిపోయింది!
ఒసాన్ నగరంలో 20 ఏళ్ల యువతి బొద్దింకను చంపే క్రమంలో ఒక అపార్ట్ మెంట్ ను తగలబెట్టింది. అందులో ఒక తల్లి మరణించింది.;
‘చిన్న పామును అయినా.. పెద్ద కర్రతో కొట్టాలన్న’ సామెతను సదరు యువతి నిజం చేసినట్లుంది. కానీ అక్కడ ఉన్నది పాము కాదు.. కానీ కర్ర మాత్రం ఒక జీవితాన్ని నాశనం చేసింది. పాము ప్లేస్ లో బొద్దింకను ఊహించుకోండి.. కర్రను ఫైర్ గా అనుకోండి.. రెండు కలిపితే.. ఒక జీవితం ముగిసింది.. బిడ్డకు తల్లి, భర్తకు భార్య దూరమైంది. ఈ ఘటన దక్షిణ కొరియాను ఆశ్చర్యంలోకి నెట్టింది.
బొద్దింకలంటే ఎక్కువ భయం పుట్టేది వారికే..
కొన్ని కొన్ని జీవులంటే కొందరికి భయం.. వ్యగ్రత పుట్టిస్తాయి. కొందరికి బల్లులు, కొందరికి పాములు, ఇంకా ఇలా ఒక్కొక్కరికి ఒక్కో జీవి భయం వ్యగ్రత పుట్టిస్తుంది. కానీ బొద్దింక మాత్రం చాలా మంది యువతులకు అత్యంత వ్యగ్రత పుట్టించే జీవి. ఇంది ఇంట్లో కనిపిస్తే చాలు.. ఆడవారు ఉగ్రులైపోతారు. వెంటపడి మరీ చంపుతారు. దక్షిణ కొరియాలో కూడా ఒక యువతి ఇంట్లోకి బొద్దింక వచ్చింది. దీంతో ఆమె దాన్ని ఎలాగైనా చంపాలనుకుంది. కానీ దానికి ఆమె ఎంచుకున్న మాత్రం భయంకరమైంది. ఒసాన్ నగరంలో 20 ఏళ్ల యువతి బొద్దింకను చంపే క్రమంలో ఒక అపార్ట్ మెంట్ ను తగలబెట్టింది. అందులో ఒక తల్లి మరణించింది.
బొద్దింకను చంపబోయి..
ఆమె ఉద్దేశం బొద్దింకను చంపడమే.. కానీ దానికి ఎంచుకున్న మార్గం మాత్రం సరైంది కాదు.. బొద్దింకను చంపేందుకు లైటర్, స్ప్రే కేన్ ఉపయోగించింది. బొద్దింక వెంట తిరుగుతూ స్ర్పే చేస్తూ లైటర్ తో మంటలను సృష్టించింది. ఈ మంటలతో సామాన్లు కాలిపోయాయి. అలా మెల్లి మెల్లిగా మంటలు పెరుగుతూ అపార్ట్ మెంట్ మొత్తం వ్యాపించాయి. ఆ క్షణంలో సదరు యువతికి బొద్దింక మాత్రమే కనపడింది. మంటలు, పొగ కనిపించలేదు. ఆ మంటల్లో చిక్కుకున్న మనుషులు కూడా కనిపించలేదు.
అగ్నికి ఆహుతైన యువతి..
అదే అపార్ట్ మెంట్ లో పై అంతస్తులో 30 ఏళ్ల యువతి తన భర్త రెండు నెలల పసిబిడ్డతో ఉంది. మంటలు వ్యాపించినప్పుడు ఏం చేయాలో వారికి తోచలేదు. దీంతో వీరి కిటికీ నుంచి పక్కింటి కిటికీలోకి బిడ్డను అప్పగించి ఆ తర్వాత భర్త వెళ్లాడు.. ఈమె కూడా వెళ్తున్న క్రమంలో కిటికీ నుంచి వెళ్తున్న క్రమంలో జారి కిందపడి మరణించింది. ఆమె భర్త బతికాడు, బిడ్డ బతికింది కానీ ఆమె ప్రాణం మంటల్లో కాలిపోయింది. బొద్దింకను చూసి కంగారుపడడం సహజం. కానీ ఆ క్షణిక భయం, ఆలోచనలపై ఆధిపత్యం చెలాయించినప్పుడు, అది విపత్తుగా మారుతుంది.
గతంలో కూడా ఇలాంటి ఘటనలే..
గతంలో కూడా ప్రపంచంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2018లో ఆస్ట్రేలియాలో ఒక వ్యక్తి ఇంట్లో ఫైర్ తో బొద్దింకను చంపబోయిన వ్యక్తి తన వంటగదిని తగలబెట్టాడు. 2023లో జపాన్‌లో 54 ఏళ్ల వ్యక్తి బొద్దింకను చంపేందుకు క్రిమిసంహారక స్ప్రేను అధికంగా ఉపయోగించాడు. దీంతో చిన్న నిప్పురవ్వ తగిలి అపార్ట్‌మెంట్‌లో పేలుడు జరిగింది. ఇవన్నీ ఒకే పాఠం చెబుతున్నాయి. చిన్న చిన్న సమస్యకు ప్రమాదకర పరిష్కారాలు ఎంచుకోవడం అజ్ఞానం అవుతుంది.
ఇది మానసిక స్థితికి నిదర్శనం..
ఇది కేవలం బొద్దింకల కథ కాదు.. ఇది మానవ మానసికస్థితికి దర్పణం. ఒక నిమిషం ఆలోచించి ఉండి ఉంటే, ఆ యువతి ఆ లైటర్‌ను ఆపేసి ఉండేది. ఒక సెకండ్ ధైర్యం చూపించి ఉండి ఉంటే, ఆ తల్లి బతికి ఉండేది. ఒక బొద్దింక, ఒక లైటర్, ఒక స్ప్రే ఈ మూడు పదాలు ఇప్పుడు ఒక జీవితాన్ని ముగించాయి. ఈ ఘటన మనందరికీ ఒక హెచ్చరిక. చిన్న విషయాల్లో పెద్ద కోపం, భయంతో చేసిన చర్యలు, అజాగ్రత్తగా తీసుకున్న నిర్ణయాలు.. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మారుస్తాయని.