సంచలనం : పెళ్లి రద్దు చేస్తున్నట్టు స్మృతి మంధాన సంచలన ప్రకటన
తాజాగా నాడు ఏం జరిగిందో కానీ.. వీరి పెళ్లి పెటాకులైంది. పలాష్ ముచ్చల్ తో జరగాల్సిన పెళ్లిని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు స్మృతి మంధాన తాజాగా ప్రకటించింది.;
టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి పెటాకులైంది.. ముందు తండ్రికి గుండెపోటు.. ప్రియుడికి అనారోగ్యం అంటూ ఏదేదో కారణాలు చెప్పిన స్మృతి మంధాన కుటుంబం చివరకు సంచలన ప్రకటనతో అందరికీ షాకిచ్చింది. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ తో జరగాల్సిన వివాహం నిరవధికంగా వాయిదా పడిన నేపథ్యంలో క్రికెటర్ స్మృతి మంధాన కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మెహందీ, హల్దీ ఫంక్షన్, పెళ్లి ఫొటోలన్నింటిని ఇదివరకే డిలీట్ చేసింది స్మృతి మంధాన. ఇప్పుడు సంచలన షాకిస్తూ పెళ్లి రద్దు అంటూ ప్రకటన చసింది.
నిజానికి పెళ్లి పీటలు ఎక్కడానికి రెండు గంటల ముందు స్మృతి మంధాన తండ్రికి గుండెపోటు వచ్చింది.. వెంటనే ఆయన్ను ఆస్పత్రిలో చేర్చారు. ఈ టైంలో పెళ్లి చేసుకోనంటూ స్మృతి మంధాన రద్దు చేసింది. తర్వాత ప్రియుడు పలాష్ కు అనారోగ్యంతో ఆస్పత్రి పాలుకావడంతో పెళ్లి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా నాడు ఏం జరిగిందో కానీ.. వీరి పెళ్లి పెటాకులైంది. పలాష్ ముచ్చల్ తో జరగాల్సిన పెళ్లిని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు స్మృతి మంధాన తాజాగా ప్రకటించింది. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీనిపై ఓ సుధీర్ఘ ప్రకటన కూడా విడుదల చేసింది. తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చలకు ముగింపు పలకాలని కోరింది. అయితే పెళ్లి రద్దు చేసుకోవడానికి గల కారణాలను మాత్రం స్మృతి వివరించలేదు. తనకు ప్రైవసీ కావాలని మాత్రమే అందులో పేర్కొంది.
స్మృతి మంధాన -పలాష్ ముచ్చల్ జంట 2019 నుండి ప్రేమలో ఉన్నారు. పెళ్లి పీటలు ఎక్కాలనుకున్నారు. పెళ్లికి రెడీ అయ్యాక ఏమైందో కానీ సడెన్ గా ఆగిపోయింది. కొన్నిరోజులుగా ఈ పెళ్లి ఆగిపోవడంపై చాలా ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా చేసిన ప్రకటనతో ప్రైవసీని కోరుకునే మహిళను అని.. గౌరవించాలంటూ ప్రకటన విడుదల చేసింది.
మొత్తానికి తన పెళ్లి రద్దు అయ్యిందనే విషయాన్ని స్మృతి మంధాన అధికారికంగా ప్రకటించినట్టైంది. పెళ్లిపై జరిగిన చర్చలు మానికస వేదినను కలిగించాయని స్మృతి మంధాన స్పష్టం చేశారు. ఇప్పటికైనా తమకుటుంబాల ప్రైవసీకి గౌరవం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నానని పేర్కొన్నారు. మీరందరూ అలాచేయాలని కోరారు. స్మృతి మంధాన ప్రకటనతో మరోసారి సంచలనమైంది. మీడియా ఈ పెళ్లి ఆగిపోవడానికి అసలు కారణాలపై ఆరాతీస్తోంది.