చందనోత్సవం...ఈసారి భక్త జన ప్రవాహమే
ఉత్తరాంధ్రా ప్రజల ఇలవేలుపు విశాఖ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ నరసింహ పుణ్య క్షేత్రం శ్రీ సింహాచలం అప్పన్న స్వామి వారి చందనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి.;
ఉత్తరాంధ్రా ప్రజల ఇలవేలుపు విశాఖ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ నరసింహ పుణ్య క్షేత్రం శ్రీ సింహాచలం అప్పన్న స్వామి వారి చందనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. ఈ నెల 20న స్వామి వారి చందనోత్సవం జరగనుంది. స్వామి నిజ రూప దర్శనం చూసేందుకు భక్తులు ఏపీ నుంచి మాత్రమే కాదు ఒడిశా చత్తీస్ ఘడ్, జార్ఖండ్, తెలంగాణా నుంచి పెద్ద సంఖ్యలో వస్తారు. ఈ నెల 20న కేవలం నాలుగు గంటలు తప్పించి 20 గంటలకు పీగా స్వామి నిజరూప దర్శనాన్ని భక్తులు చూసేందుకు ఆలయ తలుపులు తెరచే ఉంచుతారు. ఎంత మంది వస్తే అంత మందికి దర్శనం చేయించేందుకు అన్ని రకాలైన చర్యలు తీసుకున్నారు.
రెండు లక్షలకు పైగా :
ఇక గతసారి స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య లక్షా ఇరవై వేల పై దాటింది. అయితే ఈసారి ఆ సంఖ్య మరింత పెరగనుంది అని అధికారులు అంచనా వేస్తున్నారు ఏకంగా రెండు లక్షలకు పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు తరలి వస్తారని పక్కా లెక్కలతో అంచనాలతో తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇన్ని లక్షల మంది వచ్చినా ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూసేందుకు పూర్తిగా అధికార యంత్రాంగం నిమగ్నం అవుతోంది. ఇక మంత్రుల బృందం ఇప్పటికే చందనోత్సవం గురించి సమీక్ష నిర్వహించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రులు ఆదేశించారు.
సామాన్యుడే వీఐపీ :
ఈసారి చందనోత్సవానికి రెండు లక్షల మంది భక్తులు వస్తారు అని అంచనా ఉంది. ఇరవై గంటలకు పైగా దర్శనాలు కొనసాగుతాయి. అంటే గంటకు పదివేల మంది స్వామిని దర్శించుకుంటేనే ఈ రద్దీ అంతా ఆగుతుంది అందరినీ దర్శనం లభిస్తుంది. మరి ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తే మధ్యలోనే వారిని ఆపేసి వీఐపీలకు పెద్ద పీట వేస్తే సామాన్యులు ఇబ్బందులు పడడమే కాదు ఆగ్రహిస్తారు కూడా. అందుకే కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది సామాన్యులకే అగ్ర తాంబూలం ఇస్తామని వారే తమకు వీఐపీ అని చెబుతోంది. వీఐపీలకు ఒక నిర్ణీత సమయం కేటాయించి మిగిలిన మొత్తం సమయం అంతా సామాన్య భక్తులకే కేటాయించాలని చూస్తోంది అని అంటున్నారు.
అపురూపమైన ఘట్టం :
నిజానికి సింహాచలంలో స్వామి వెలసాడు అని భక్తుల నమ్మకం. హిరణ్య కశిపుడుని వధించిన తరువాత స్వామి ఇక్కడ కొలువు తీరాడు అనంది పురాణేతిహాసాల సారం. దాంతో పాటు స్వామి నిజరూప దర్శనం అన్నది కూడా ఒక గొప్ప అనుభూతిగా భావిస్తారు. అందుకే ప్రతీ ఏడాది వైశాఖ శుద్ధ తదియ వేళ చందనోత్సవం నాడు స్వామి తన నిజ రూపం తో భక్తులను అలరిస్తారు. అది ఒక అపురూపమైన ఘట్టమని భక్తులు అంతా చెబుతారు. ఇక భక్తుల దర్శనాలు అన్నీ ఈ నెల 20వ తేదీ తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రారంభమవుతాయని అంతరాలయ దర్శనం ఉదయం 5 గంటల వరకు మాత్రమే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.