కర్ణాటకంలో అవిశ్వాసం...బ్రేక్ ఫాస్ట్ ట్విస్ట్

ఇదిలా ఉంటే పార్టీ అగ్ర నేతల ఆదేశాలలో ఇద్దరు నాయకులూ శనివారం బ్రేక్ ఫాస్ట్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ కీలక నేత కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఇద్దరూ కలసి ఆనందంగా మాట్లాడుకుంటూ బ్రేక్ ఫాస్ట్ చేశారు.;

Update: 2025-11-29 18:30 GMT

కర్ణాటక రాజకీయం రోజుకో రకంగా మారుతోంది. గత నెల రోజుల నుంచి కర్ణాటకలో సీఎం మార్పు అన్న అంశం మీద విపరీతమైన చర్చ అయితే సాగుతోంది. ఇది ఎంత దాకా వెళ్ళింది అంటే తెగే దాకా లాగుతున్నారు అన్నంతగా. ఒక వైపు చూస్తే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇద్దరూ ఒకే మాట ఒకే బాటగా ఉన్నట్లుగా కనిపిస్తున్నారు ఇద్దరూ కాంగ్రెస్ హైకమాండ్ మీదనే భారాలు వేశారు. ఇద్దరూ కూడా తాము కాంగ్రెస్ ని నమ్మకమైన నాయకులుగా చెబుతున్నారు. కానీ మరో వైపు చూస్తే కాంగ్రెస్ లో నాయకత్వ సంక్షోభం అన్న వార్తలు మాత్రం అదే పనిగా వస్తున్నాయి.

పార్టీ ఆదేశాలతో :

ఇదిలా ఉంటే పార్టీ అగ్ర నేతల ఆదేశాలలో ఇద్దరు నాయకులూ శనివారం బ్రేక్ ఫాస్ట్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ కీలక నేత కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఇద్దరూ కలసి ఆనందంగా మాట్లాడుకుంటూ బ్రేక్ ఫాస్ట్ చేశారు ఆ మీదట మీడియా ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో బలంగా ఉంది అని స్పష్టం చేశారు. తాము ఇద్దరూ పార్టీకి రెండు కళ్ళు అని చెప్పుకున్నారు. తాము కలసికట్టుగానే 2023లో పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చామని తిరిగి 2028లో కూడా పార్టీని తీసుకుని వస్తామని కచ్చితంగా ఈ ఇద్దరు నేతలూ చెప్పడం విశేషం.

తేల్చేసిన సిద్ధూ :

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెడతామని విపక్షాలు చేస్తున్న ప్రచారం మీద ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ అత్యంత పటిష్టంగా ఉందని అలాంటివి ఏమీ జరగవని కాంగ్రెస్ కూడా ధీటుగానే ఉందని చెప్పారు. అవిశ్వాసం పెట్టడం కూడా ఎవరికైనా అసాధ్యమని ఆయన నొక్కి చెప్పారు. ఇక డీకే శివకుమార్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. పార్టీ హైకమాండ్ ఆలోచనలకు అనుగుణంగా ఇద్దరమూ పనిచేస్తామని కూడా ఆయన చెప్పారు. తమ ఇద్దరి నాయకత్వంలో లోకల్ బాడీ ఎన్నికల్లోనే కాదు 2028 ఎన్నికల్లోనూ గెలిచి తీరుతామని చెప్పారు.

హైకమాండ్ డెసిషన్ ఫైనల్ :

ప్రస్తుతం కాగ్న్రెస్ పార్టీ దేశంలోనే కొంత కష్టకాలంతో గడుపుతోందని డీకే శివకుమార్ అన్నారు. ఈ నేపథ్యంలో తాము కాంగ్రెస్ వాదులుగా పార్టీ లైన్ దాటకుండా పనిచేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం అయినా హైకమాండ్ తీసుకుంటుందని అదే ఫైనల్ అని ఆయన స్పష్ట చేశారు. ఎవరైనా కాంగ్రెస్ అధిష్టానానికి తలొగ్గి తీరాల్సిందే అని చెప్పారు. ఇందులో రెండవ మాట లేనే లేదని అన్నారు. నాయకత్వం మార్పు ఉంటుందా లేదా అన్నది పార్టీ పెద్దలు చూసుకుంటారని డీకే చెప్పడం విశేషం. తాము పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడమే కాకుండా తిరిగి అధికారంలోకి తేవడం మీదనే ఫోకస్ పెడతామని అన్నారు. మొత్తానికి ఇద్దరు నాయకులు హైకమాండ్ దే ఫైనల్ అంటున్నారు. పార్టీలో తాము ఒక్కటే అని చెబుతున్నారు. అయితే విపక్షం మాత్రం అలా చెప్పడం లేదు. కాంగ్రెస్ లో రెండు వర్గాలు ఉన్నాయని పార్టీలో నాయకత్వ సంక్షోభం ఉందని అంటోంది. దాంతో అవిశ్వాస తీర్మానం దిశగా విపక్షం అడుగులు వేస్తుందా అన్నది చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News