మంత్రి కోమటిరెడ్డిని టార్గెట్ చేసిన యాంకర్ శ్యామల!

నాన్ స్టాప్ గా మాట్లాడుతూ.. ఇంట్లో అమ్మాయిలా కలిసిపోయే టాలెంట్ యాంకర్ శ్యామల సొంతం.

Update: 2024-05-08 04:29 GMT

నాన్ స్టాప్ గా మాట్లాడుతూ.. ఇంట్లో అమ్మాయిలా కలిసిపోయే టాలెంట్ యాంకర్ శ్యామల సొంతం. యాంకర్ గా.. నటిగా సుపరిచితురాలైన శ్యామల ఇటీవల రాజకీయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయటం తెలిసిందే. ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో ఆమె అధికార వైసీపీకి అండగా నిలుస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. విపక్షానికి చెందిన నేతలపై విరుచుకుపడుతున్న ఆమె వ్యాఖ్యలపై మండిపాటు వ్యక్తమవుతోంది.

హైదరాబాద్ లో ఉంటూ ఏపీ రాజకీయాలు నీకెందుకు? అంటూ మండిపడుతున్న వారికి మరింత కాలేలా వ్యవహరిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఎవరేమైనా చేస్తారు? ఎవరికి నచ్చిన పార్టీకి మద్దతు ఇవ్వటం తప్పేం కాదు కదా? అని ప్రశ్నిస్తున్న ఆమె.. తనను విమర్శించే వారికి కౌంటర్లు ఇస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పటివరకు ఏపీలో అధికార పక్షానికి అండగా ప్రచారం చేస్తున్న ఆమె.. అందుకు భిన్నంగా తెలంగాణలో మాత్రం అధికార కాంగ్రెస్ కు షాకిస్తోంది.

తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడిన వీడియోలను షేర్ చేస్తూ.. సెటైరికల్ ట్వీట్ వదిలారు. ఇది కాస్తా వైరల్ గా మారింది. తాజాగా జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో రెండు వేర్వేరు చోట్ల ఒకే అంశంపై వేర్వేరుగా స్పందించిన కోమటిరెడ్డి మాటల్నే ఆయుధాలుగా ఆయన మీదకు వదిలే ప్రయత్నం చేయటం ఆసక్తికరంగా మారింది.

ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించే సీట్ల మీద మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రెండు చోట్ల రెండు వేర్వేరు కామెంట్లు చేయటాన్ని యాంకర్ శ్యామల ప్రస్తావించారు. నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘవీర్ రెడ్డి నామినేషన్ ర్యాలీ సందర్భంగా మాట్లాడిన ఆయన.. విపక్ష బీఆర్ఎస్ కు రెండు ఎంపీ సీట్లు కూడా రావని.. ఒకవేళ ఆ పార్టీకి రెండు సీట్లు వస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారన్న వ్యాఖ్య చేశారు.

Read more!

కట్ చేస్తే.. ఇటీవల ఆయన మరో వేదిక మీద మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు ఎనిమిది ఎంపీ సీట్లు వస్తే తాను రాజకీయాలు బంద్ చేస్తానని.. సీట్లు రాకపోతే కేసీఆర్ రాజకీయాలు బంద్ చేస్తారా? అంటూ సవాలు విసిరారు. ఈ రెండు వీడియోలను కలిపి ఒకటి చేసిన యాంకర్ శ్యామల.. వారం వ్యవధిలో 2 నుంచి 8కు వచ్చింది. ఇంకో వారం ఉందని.. ఎనిమిది నుంచి ఎక్కడికి పోద్దో? అంటూ తనదైన శైలిలో పంచ్ ఇచ్చింది. ఈ సెటైరికల్ ట్వీట్ వైరల్ గా మారింది. కాంగ్రెస్ అభిమానులు యాంకర్ శ్యామల తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. సినిమా ఆఫర్లు తగ్గటంతో ఇలా చేస్తుందన్న మాటల్ని కాసేపు పక్కన పెడితే.. లాజికల్ గా చూస్తే.. కోమటిరెడ్డి లోని వేరియన్స్ ను ఉన్నది ఉన్నట్లుగా చూపించటంలో యాంకర్ శ్యామల సక్సెస్ అయ్యారని చెప్పాలి. మరి.. దీనిపై మంత్రి కోమటిరెడ్డి ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.

Tags:    

Similar News