చెల్లికి మేలు చేస్తున్న జగన్ ?

ఏపీలో అధికార పక్షంలో మూడు పార్టీలు ఉన్నాయి. అవి అన్నీ కలసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి.;

Update: 2025-05-07 04:56 GMT

ఏపీలో అధికార పక్షంలో మూడు పార్టీలు ఉన్నాయి. అవి అన్నీ కలసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. 2029లో కూడా టీడీపీ జనసేన బీజేపీ కలసి పోటీ చేస్తాయి. ఆ రాజకీయ పొత్తు ఇప్పట్లో విచ్చిన్నం అయ్యేది కాదు. ఇక చూస్తే విపక్షంలో వైసీపీ బలంగానే ఉంది ఎందుకంటే నిన్నటిదాకా ఆ పార్టీ అధికారంలో ఉంది. వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ లో ఎంపీ దాకా అంతా వైసీపీ వారే ఉన్నారు. గ్రాస్ రూట్ లెవెల్ దాకా పార్టీ ఉంది.

ఇక 2024 ఎన్నికల్లో 40 శాతం ఓటు షేర్ కూడా వైసీపీకి దక్కింది. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 30 దాకా ఎమ్మెల్సీలు ఉన్నారు. దాంతో ఎవరు కాదన్నా ఔనన్నా వైసీపీయే ఏపీలో ప్రధాన ప్రతిపక్షం. కానీ ఆ పార్టీ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తోందా అంటే అక్కడే డౌట్ కొడుతోంది.

ఉన్న 11 మంది ఎమ్మెల్యేలతో జగన్ అసెంబ్లీలోకి వెళ్ళి అధికార కూటమిని నిలదీయవచ్చు. కానీ ఆ పని చేయడం లేదు. ఇక జనంలోకి అధినాయకుడూ వెళ్ళడం లేదు, వైసీపీ నేతలూ పోవడం లేదు. ఆ పార్టీలో కొందరు మీడియా ముఖంగా నాలుగు విమర్శలు చేస్తే అదే విపక్ష పాత్ర అని భావిస్తున్నారు.

దాంతో ఏపీలో అధికార పక్షం వైపు ఖాళీ లేకపోయినా విపక్షం సైడ్ మాత్రం అతి పెద్ద రాజకీయ శూన్యత ఉంది అని అంటున్నారు. సరిగ్గా ఈ పాయింట్ నే ఏపీసీసీ చీఫ్ షర్మిల పట్టుకుందా అన్న చర్చ సాగుతోంది. ఆమె ఇటీవల గుజరాత్ లో జరిగిన ఏఐసీసీ సమావేశాలకు హాజరయ్యారు.

అక్కడ ఏపీ వ్యవహారాల ఇంచార్జితో కీలక సమావేశం జరిగింది అన్నది ప్రచారంలో ఉంది. మరి ఏ రకమైన దిశా నిర్దేశం పార్టీ పెద్దలు చేశారో ఏమో తెలియదు కానీ ఏపీకి తిరిగి వచ్చిన తరువాత షర్మిల స్ట్రాటజీ మార్చేశారు. ఆమె జగన్ ఊసే ఎత్తడం మానుకున్నారు

నేరుగా ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఆమె విమర్శిస్తున్నారు. అమరావతి రాజధానికి నిధులు ఇవ్వని ప్రధాని మోడీ మీద విమర్శలు చేశారు. ఇపుడు చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య మీద ఆమె స్పందించారు. కార్మికులతో కలసి ఆమె దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. ఉక్కు కార్మికులను అనవసరంగా రెండు వేల మంది దాకా తీసేశారు అని వారిని తిరిగి విధులలో చేర్చుకోకపోతే తాను అమరణ దీక్ష చేస్తాను అని షర్మిల ప్రకటించారు.

ఒక విధంగా ఇది పవర్ ఫుల్ స్టేట్మెంట్ గానే చూడాలి. షర్మిల కనుక ఆ రకంగా దీక్ష చేస్తే ఆమె హైలెట్ అవడం ఖాయం. ఉత్తరాంధ్ర అంతటా స్టీల్ ప్లాంట్ ప్రభావం ఉంది. దాంతో ఆమె ఆందోళనకు మంచి రియాక్షన్ వస్తుంది. ఇక పోతే ప్రజా సమస్యల మీద కాంగ్రెస్ బాగానే స్పందిస్తోంది అన్న మేసేజ్ కూడా జనంలోకి వెళ్తుంది.

ఒక్కసారి కనుక అలా జరిగితే జనం కాంగ్రెస్ ని సీరియస్ గా చూడడం మొదలుపెడితే అపుడు ఏపీలో ఇబ్బంది పడేది కచ్చితంగా వైసీపీయే అని అంటున్నారు ఏపీలో విపక్ష పాత్రను పోషించడానికి వైసీపీని రీప్లేస్ చేయడానికి షర్మిల ఒక వ్యూహం ప్రకారం ముందుకు సాగుతున్నారు అని అంటున్నారు. ఆమె జిల్లా టూర్ల వెనక ఉన్న ఆలోచనలు ఇవే అంటున్నారు ఇప్పటికైనా వైసీపీ మేలుకోకపోతే నవ్విన నాపచేనే పండుతుంది అన్న చందంగా కాంగ్రెస్ మళ్ళీ ఏపీలో బలంగా నిలదొక్కుకునే అవకాశాలనూ ఎవరొ కొట్టి పారేయలేరు అని అంటున్నారు.

Tags:    

Similar News