అవును.. ఆ మేక ఖరీదు రూ.కోటికి దగ్గర

కోటి రూపాయిలు. ఇప్పటికి చాలా పెద్ద మొత్తమే. అలాంటి కోటి రూపాయిలకు దగ్గరగా పలికే మేక ఒకటి ఇప్పుడు సంచలనంగా మారింది.;

Update: 2025-07-01 07:33 GMT

కోటి రూపాయిలు. ఇప్పటికి చాలా పెద్ద మొత్తమే. అలాంటి కోటి రూపాయిలకు దగ్గరగా పలికే మేక ఒకటి ఇప్పుడు సంచలనంగా మారింది. ఇస్పెషల్ మేక సెనగల్ దేశానికి చెందింది. నోరూరించే వంటకాలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పే ఈ దేశంలో కోటి రూపాయిల మేక ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది. దీని ఎత్తు నాలుగు అడుగుల వరకు ఉంటుంది.

చక్కటి కొమ్ములు.. కండరాల బలిమి ఉన్న ఈ మేకల్ని ఆ దేశంలో తమకు హోదాకు చిహ్నంగా భావిస్తారు. ఆర్థికంగా బలంగా ఉన్న వారు.. ఈ లాదూమ్ అనే మేలు జాతి మేకల్ని పెంచుకోవటానికి ఆసక్తి చూపుతుంటారు. అక్కడి సమాజంలో ఈ జాతి మేకల్ని సంపదకు.. హోదాకు చిహ్నంగా భావిస్తారు.

ఒక సంవత్సరం ఏడు నెలల వయసు ఉన్న ఒక మేక ధర ఏకంగా లక్ష డాలర్ల వరకు పలికి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.85 లక్షల వరకు ఉంటుంది. గతంలో ఇదే జాతికి చెందిన మేకపోతుకు రూ.59 లక్షలు పలకగా.. అదో రికార్డుగా ఉండేది. ఇప్పుడు దానికి మించి దగ్గర దగ్గరగా కోటి రూపాయిల వరకు పలకటంతో ఈ మేకపోతు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. ఇంత భారీ ధర పలకటంతో లాదూమ్ మేకపోతు జాతి మేకల్ని కొనుగోలు చేసేందుకు సెనగల్ కు ప్రత్యేకంగా వెళుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మేక.. మజాకానా అన్నట్లు ఉంది కదూ.

Tags:    

Similar News