బిగ్ బ్రేకింగ్... ఘోర బస్సు ప్రమాదం.. 42 మంది సజీవ దహనం!
ఇటీవల జరుగుతున్న బస్సు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తోన్న నేపథ్యంలో తాజాగా సౌదీ అరేబియాలోనూ ఓ ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది.;
ఇటీవల జరుగుతున్న బస్సు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తోన్న నేపథ్యంలో తాజాగా సౌదీ అరేబియాలోనూ ఓ ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... భారతీయ యాత్రికులతో ఉన్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో 42 మంది సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువమంది హైదరాబాదీ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది!
అవును... సౌదీ అరేబియాలో ఘోరం చోటుచేసుకుంది. ఇందులో భాగంగా... భారతీయ కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 01:30 గంటల ప్రాంతంలో ఓ ప్యాసింజర్ బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో 42 మంది ఉమ్రా యాత్రికులు మరణించారు! మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఉమ్రా యాత్ర ముగించుకుని మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో చాలా మంది ప్రయాణికులు నిద్రిస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మీడియాలో వస్తోన్న సమాచారం ప్రకారం 42 మంది మరణించినట్లు నివేదించినప్పటికీ.. అధికారికంగా ఇంకా మృతులు, క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రమాదం జరిగిన వెంటనే సౌదీ సివిల్ డిఫెన్స్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మదీనా నుంచి సుమారు 160 కి.మీ దూరంలో ఉన్న మ్ముఫ్రిహాత్ సమీపంలో ఈ ఘటన జరిగింది.