రూపాయి 'ICU' లో ఉందా ?

రూపాయి విలువ భారీగా పతనం అయింది. డాలర్ తో పోలిస్తే తొంబై ఎనిమిది పైసలు క్షీణించింది. ఆల్ టైం రికార్డ్ గా ఈ పతనం ఉంది.;

Update: 2025-11-23 11:58 GMT

రూపాయి విలువ భారీగా పతనం అయింది. డాలర్ తో పోలిస్తే తొంబై ఎనిమిది పైసలు క్షీణించింది. ఆల్ టైం రికార్డ్ గా ఈ పతనం ఉంది. ఇది మరింతగా పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఒక వైపు డాలర్ కూడా పతనంలో ఉంది అన్నది ఆర్థిక విశ్లేషకుల మాట. డాలర్ ఇండెక్స్ చూస్తే పది శాతం పడిపోయింది అని అంటున్నారు. ఆ డాలర్ పడిపోతూంటే ఆ డాలర్ తో పోలిస్తే రూపాయి కూడా పడిపోవడం అంటే ఆర్థిక దారుణమేనా అన్న చర్చ సాగుతోంది. డాలర్ బలంగా ఉంది అన్ని దేశాల కరెన్సీలు పడిపోతునాయి ఆ క్రమంలో మన రూపాయి కూడా పడిపోతోంది అని అనుకున్నా ఒక అర్థం ఉంది. కానీ డాలర్ పతనం అవుతున్నా మన రూపాయి ఇంకా దానితో గ్యాప్ పెంచుకోవడం అంటే దానిని ఏ విధంగా చూడాలి అన్నదే చర్చగా ఉంది.

గతంలోనూ ఒక లెక్క :

ఇక 2024 అంతకు ముందు చూసినా డాలర్ తో పోలిస్తే ఇతర దేశాల కరెన్సీ కంటే కూడా భారత్ లో రూపాయి బలంగానే ఉండేది అని గుర్తు చేస్తున్నారు. అయితే ఇపుడు అంతా రివర్స్ అయింది అని ఆర్థిక నిపుణుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇతర దేశాల కరెన్సీలు ప్రస్తుతం బాగా పెర్ఫార్మ్ చేస్తూంటే భారత్ లో రూపాయి మాత్రమే వీక్ పెర్ఫార్మ్ చేస్తోంది అని ఆయన విశ్లేషించారు. ఇపుడు డాలరే వీక్ గా ఉంటే భారత రూపాయి ఇంకా వీక్ అవడం విచిత్ర పరిణామంగానే చెబుతున్నారు. దాని వల్ల ఇతర దేశాల కరెన్సీతో పోల్చినా కూడా భారత కరెన్సీ ఇంకా ఎక్కువ పడిపోతోంది అని తేల్చారు.

నివేదికలు చూస్తే :

భారత రూపాయి విలువ విషయంలో బ్లూం బెర్గ్ నివేదికలు చూస్తే ఆందోళనకరంగానే ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 27తో పోలిస్తే ఇండియన్ రుపీ 3.5 శాతం పడిపోయింది. ఇపుడు ఇంకా పడిపోయింది అని చెబుతున్నారు. బ్రిటిష్ పౌండ్స్ తో పోలిస్తే 9 శాతం భారత రూపాయి పడిపోయింది. జపనీస్ కరెన్సీతో పోలితే ఆరు శాతం పడిపోయింది ఇంత భారీగా ఎందుకు రూపాయి పతనం అవుతోంది అన్నది కూడా చర్చగా ఉంది. ఇక గతంలో రూపాయి పతనం అయిన ప్రతీ సారి రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి దిగి ఫారిన్ ఎక్సేంజ్ ని మార్కెట్ లో రిలీజ్ చేసి రూపాయి విలువ పతనం కాకుండా కాపాడేది అని ప్రొఫెసర్ నాగేశ్వర్ వెల్లడించారు. అయితే ఈ ఏడాది ఆగస్టు నాటికి ఆర్బీఐ మార్కెట్ లో ఫారిన్ ఎక్సేంజ్ గా విడుదల చేసే మొత్తాలు 11 బిలియన్ డాలర్లకు పడిపోయింది అని చెప్పారు

ఆర్బీఐ కాపాడడంలేదా :

ఆర్బీఐ చేతులు ఎత్తేసింది అని ఆయన చెప్పారు. అది పరోక్షంగా ప్రభుత్వ విధానంగా చెప్పుకోవాల్సి ఉందని అంటున్నారు. ఇతర దేశాలలో అమెరికా ఒప్పందాలు కుదుర్చుంటోంది. భారత్ పట్ల ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ అధిక సుంకాల ప్రభావం రూపాయి పతనం మీద ఆధారపడి ఉందని ఆయన విశ్లేషించారు. ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ సమీప భవిష్యత్తులో సామరస్యంగా కుదిరే అవకాశాలు లేకపోవడం వల్ల ఎగుమతి పడిపోతోంది. డాలర్లు రావడం లేదు అందుకే రూపాయి పతనం అని అన్నారు ఈ అసమతుల్యత వల్ల కూడా రూపాయి పతనం అని ఆయన చెప్పారు.

విదేశీ పెట్టుబడులలో తగ్గుదల :

మరో వైపు చూస్తే విదేశీ పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. అది కూడా మరో కారణంగా ఉందని నాగేశ్వర్ చెప్పారు. 44 బిలియన్ డాలర్ల వరకూ విదేశీ పెట్టుబడులు ఇపుడు దారుణంగా పడిపోయాయని చెప్పారు. ఆ డాలర్ల ఫ్లో కూడా తగ్గిపోయింది అని ఆయన చెప్పారు. దేశీయ ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నాయని ప్రభుత్వం అంటోంది. కానీ అంతర్జాతీయ పరిణామాల వల్లనే రూపాయి విలువ పడిపోతోంది అని అంటోంది. కానీ ఇతర దేశాల కరెన్సీ ఎలా పెరుగుతోంది అన్నది ఆలోచించాల్సి ఉందని అంటున్నారు. భారత్ 40 దేశాలతో వాణిజ్యం ఉంది, ఆ నలభై దేశాలతో పోల్చినా భారత్ రూపాయి ఇబ్బందిగా ఉంది అని ఆయన చెప్పారు. డాలర్ వీక్ అవుతున్నా కూడా ఇండియన్ కరెన్సీ ఇంకా వీక్ గా ఉండడానికి కారణాలు ఆలోచించాల్సిన అవసరం ఉందని నాగేశ్వర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న వాదనలు సమంజసంగా లేవని వీటికి సరైన కారణాలు ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.


Tags:    

Similar News