భారత్ హిందూ దేశం...ఆర్ఎస్ఎస్ సంచలన వ్యాఖ్యలు

ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా రాజధాని లక్నోలో జరిగిన దివ్య గీతా ప్రేరణ ఉత్సవ్ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు.;

Update: 2025-11-24 03:44 GMT

భారత్ ని లౌకిక వాద దేశం అని బీజేపీయేతర పార్టీలు అంటాయి. అయితే హిందూ దేశంగా ఉండాలని కోరుకునే వారు ఉన్నరు ఆర్ఎస్ఎస్ అయితే భారత్ ని హిందూ దేశమే అని చెబుతోంది ఎందుకంటే భారత్ లో ఉన్నది అంతా హిందూ సమాజమే అని కూడా పేర్కొంటోంది. అలాంటపుడు హిందూ దేశంగానే భారత్ ఉంటుదని నిర్వచిస్తుంది. మరి దీని మీద వేరే విధంగా చర్చ జరుగుతుందా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ లేవనెత్తే ప్రతీ అంశం మీద డిబేట్ చేసేందుకు యాంటీ సెక్షన్ ఉంటారని అంటారు.

నైతికత పెద్ద ప్రశ్న :

ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా రాజధాని లక్నోలో జరిగిన దివ్య గీతా ప్రేరణ ఉత్సవ్ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అనేక అంశాల మీద మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజం ధనవంతమైనదని సంపద బాగా పెరిగిందని మోహన్ భగవత్ అన్నారు. అదే సమయంలో భౌతిక సంపద మీద వ్యామోహం అందరిలో పెరిగిపోయింది అన్నారు. అలా నైతికత అంతటా లోపిస్తోంది అని ఆయన చెప్పారు. అలాగే డబ్బు ఉంటోంది కానీ శాంతి ఎక్కడా లేదని ఆయన చెప్పుకొచ్చారు.

బోధనల ద్వారానే :

శాంతి కావాలని అంటే అది భగవద్గీత బోధనల ద్వారానే దొరుకుతుందని అన్నారు. అలాగే నైతికత కూడా అంతా అలవరచు కోవలసిన అవసరం ఉందని అన్నారు. భారతీయ సనాతన ధర్మంలో అన్ని సమస్యలకు పరిష్కారం ఉందని ఆయన చెప్పారు. గీతాకారుడు శ్రీకృష్ణుడు మనిషి సమస్యల నుంచి పారిపోకుండా ఎలా గట్టిగా నిలబడాలో భగవద్గీత ద్వారా జ్ఞాన బోధ చేశారు అని మోహన్ భగవత్ చెప్పారు. మనిషికి శాంతి సంతృప్తి అన్నవి సనాతన జీవన ధర్మంలోనే దొరుకుతాయని ఆయన అన్నారు.

భారత్ నష్టపోయింది :

ఒకనాడు ప్రపంచానికే తలమానికంగా ఉన్న భారత్ ఇతర దేశాలు చేసే అనేక రకాలైన దాడుల వల్ల తీవ్రంగా నష్టపోయింది అని మోహన్ భగవత్ చెప్పారు. అయితే ఆ తరహా యుద్ధాలు కుట్రలు దండయాత్రలకు రోజులు పూర్తిగా చెల్లి పోయాయని అయన అన్నారు. ఈ రోజున భారత్ ఒక గట్టి హిందూ దేశమని ఆయన స్పష్టం చేశారు. దానికి సాక్షిగా అయోధ్యలో రామాలయంపై జెండా గర్వంగా ఎగురుతోందని ఆయన అన్నారు. చరిత్రలో వెనక్కి వెళ్ళి చూస్తే భారత్ ని ఎంతో ఇబ్బంది పెట్టాలని అంతా చూసారని అయితే వారు దోపిడీ అయితే చేయగలిగారు, సంపాను తీసుకుని వెళ్ళారు కానీ దేశ నాగరికత సంస్కృతిని మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంచగలిగారు అంటే అది జాతి గొప్పదనం ఈ దేశం గొప్పతనం అని భగవత్ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News