జూబ్లీ ఉపపోరు: ఏ రౌండ్ ఏ డివిజన్ కింద వస్తుందంటే?
పోటాపోటీగా సాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ ఉదయం మొదలు కావటం.. ఉదయం పదిన్నర గంటలకు నాలుగు రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి;
పోటాపోటీగా సాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ ఉదయం మొదలు కావటం.. ఉదయం పదిన్నర గంటలకు నాలుగు రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. అధికారికంగా రెండు రౌండ్ల ఫలితాన్ని మాత్రమే ప్రకటించినప్పటికి అనధికారికంగా వస్తున్న సమచారం ప్రకారం నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 8500 ఓట్ల మెజార్టీతో ఉన్నారు.
పోస్టల్ బ్యాలెట్.. మొదటి రౌండ్ ఫలితాల్ని చూసినప్పుడు కాంగ్రెస్.. బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ఓట్ల అంతరం చాలా తక్కువగా ఉంది. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు మొత్తం షేక్ పేట డివిజన్ కు సంబంధించి ఉండగా.. రెండో రౌండ్ లో షేక్ పేట డివిజన్ లోకి కొన్ని పోలింగ్ కేంద్రాలు.. ఎర్రగడ్డలోని కొన్ని పోలింగ్ బూత్ లు ఉన్నాయి. రాజకీయ పార్టీల లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటే షేక్ పేట బీఆర్ఎస్ కు అధిక్యతను ఇవ్వాల్సిన డివిజన్. అక్కడ కాంగ్రెస్ కు స్వల్ప మెజార్టీ లభించింది. అదే సమయంలో రెండో రౌండ్ విషయానికి వస్తే.. షేక్ పేట.. ఎర్రగడ్డ డివిజన్ల పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కింపు సాగింది.
ఇందులో ఎర్రగడ్డ కాంగ్రెస్ కు పట్టున్న ప్రాంతం. అంతేకాదు.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు వ్యక్తితంగా బలమున్న ప్రాంతం. దీంతో.. ఇక్కడ కూడా అధిక్యత లభించింది. ఇదే విధంగా ఏ రౌండ్ లో ఏయే డివిజన్ల పరిధిలోకి వస్తాయన్న ఆసక్తి పలువురిలో వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా రౌండ్ల వారీగా ఉన్న డివిజన్లు తెలిస్తే.. అధిక్యతలకు సంబంధించిన సమాచారం ఇట్టే అర్థమవుతుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరున్నర డివిజన్లు (ఇందులో సోమాజీగూడ డివిజన్ పరిధిలో కొంత ప్రాంతం ఉంటుంది. అందుకే ఆరున్నర అని చెప్పాల్సి వచ్చింది) ఉంటాయి.
నియోజకవర్గంలోని మిగిలిన ఆరు డివిజన్ల విషయానికి వస్తే..
1. షేక్ పేట
2. రహమత్ నగర్
3. ఎర్రగడ్డ
4. బోరబండ
5. యూసఫ్ గూడ
6. వెంగళరావు నగర్
మొత్తం రౌండ్లు: 10
ప్రతి రౌండ్ కు లెక్కించే పోలింగ్ స్టేషన్స్: 42
--------------------------------
మొదటి రౌండ్:
1-42 : షేక్ పేట
రెండవ రౌండ్:
43-70: షేక్ పేట (28)
71-74: ఎర్రగడ్డ(4)
75-79: వెంగళరావు నగర్(5)
80-84: ఎర్రగడ్డ(5)
మూడవ రౌండ్:
85-90: షేక్ పేట (6)
91: వెంగళరావు నగర్(1)
92-119: రహ్మత్ నగర్(28)
120-126: వెంగళరావు నగర్(7)
నాలుగవ రౌండ్:
127-149: వెంగళరావు నగర్(23)
150-168: రహ్మత్ నగర్(19)
ఐదవ రౌండ్:
168-196: రహ్మత్ నగర్(28)
197-210: వెంగళరావునగర్(14)
అరవ రౌండ్:
211-216: వెంగళరావు నగర్(6)
217-252: యూసఫ్ గూడ(36)
ఏడవ రౌండ్:
253-274: యూసఫ్ గూడ(22)
275-294: సోమాజిగూడ(20)
ఎనిమిదవ రౌండ్:
295-310: సోమాజిగూడ(16)
311-313: ఎర్రగడ్డ(3)
314-316: Borabanda(3)
317-321: ఎర్రగడ్డ(5)
322-336: బోరబండ(15)
తొమ్మిదవ రౌండ్:
337-361: బోరబండ(25)
362-364: ఎర్రగడ్డ(3)
365-370: బోరబండ(6)
371-375: ఎర్రగడ్డ(5)
376-378: బోరబండ(3)
పదవ రౌండ్:
339-407: ఎర్రగడ్డ(29)