రోజా చుట్టూ కేసుల ముళ్ళు అల్లుకుంటున్నాయా ?
వైసీపీకి చెందిన ఫైర్ బ్రాండ్ లేడీ, మాజీ మంత్రి ఆర్కే రోజా చుట్టూ కేసుల ముళ్ళు అల్లుకుంటున్నాయా అన్న చర్చ సాగుతోంది.;

వైసీపీకి చెందిన ఫైర్ బ్రాండ్ లేడీ, మాజీ మంత్రి ఆర్కే రోజా చుట్టూ కేసుల ముళ్ళు అల్లుకుంటున్నాయా అన్న చర్చ సాగుతోంది. రోజా వైసీపీలో మాటకారి కలిగిన మహిళా నాయకురాలు. ఇపుడు వైసీపీ వైపు నుంచి సౌండ్ తక్కువగా ఉన్న వేళ ఆమె బిగ్ సౌండ్ చేస్తున్నారు. గత కొంతకాలంగా ఆమె దూకుడు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ లోకేష్ లను ఆమె గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు.
ఇక చూస్తే కనుక వైసీపీ ఓటమి పాలైన తరువాత రోజా కొన్నాళ్ళు డల్ గా ఉన్నారు. ఆ సమయంలో ఆమె ప్రాతినిధ్యం వహించిన నగరి నియోజకవర్గంలో కొత్త వారికి ఇంచార్జి బాధ్యతలు అప్పగించాలని వైసీపీ అధినాయకత్వం చూసింది. అలా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సోదరుడిని పార్టీలోకి ఆహ్వానించి పగ్గాలు అందిస్తారు అని అనుకున్నారు. అయితే ఏమి జరిగిందో అది కాస్తా ఆగింది.
మరో వైపు చూస్తే రోజా కూడా తనకు నగరి బాధ్యతలు అప్పగిస్తే యాక్టివ్ అవుతాను అని చెప్పారని అంటున్నారు. దాంతో హై కమాండ్ కూడా ఓకే చెప్పిందని అంటున్నారు. పార్టీ వాయిస్ గా ఎవరూ పెద్దగా లేని వేళ రోజా ప్రతీ రోజూ మీడియా ముఖంగా టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నారు.
అలాగే ఆమె పార్టీ తరఫున ఆందోళనలో పాల్గొంటున్నారు. పూర్వం మాదిరిగానే ఫైర్ బ్రాండ్ గా మారిపోయారు. ఇది కూటమికి ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు. దాంతో రోజా మీద కేసులను బయటకు తీయాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తొలి రెండేళ్ళూ రోజా ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా వ్యవహరించారు.
అలాగే మరో రెండేళ్ళ పాటు పర్యాటక, క్రీడల శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆమె ఏపీఐఐసీ చైర్మన్ గా తీసుకున్న నిర్ణయాలతో పాటు, మంత్రిగా ఆడుదాం ఆంధ్రా వంటి వాటి విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల మీద వివాదాలు ఉన్నాయని అంటున్నారు. ఇపుడు వాటిని తిరగతోడడం ద్వారా రోజా చుట్టూ కేసుల ఉచ్చు బిగించాలని చూస్తున్నారు అని అంటున్నారు.
ఆడుదాం ఆంధ్రా పేరిట నిర్వహించిన కార్యక్రమాలలో నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగం అయ్యాయని అంటున్నారు. దాంతో చట్ట ప్రకారమే ఆమె అవినీతిని రుజువు చేసి కేసులను పెట్టాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఇక ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చాక పాత్యా సంఘం, కబడ్డీ అసోసియేషన్ వంటివి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై ప్రత్యేకంగా సీఐడీకి ఫిర్యాదు చేశారు అని అంటున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా వందల కోట్ల అవినీతి జరిగింది అని టీడీపీ నేతలు కూడా సీఐడీకి ఫిర్యాదు చేశారు అని గుర్తు చేస్తున్నారు. దీంతో రోజా మీద కేసులు పడబోతున్నాయని ప్రచారం ఊపందుకుంది. ఆమె మీద కేసులు పెడితే ఆమె అరెస్టు ఉంటుందా అన్న చర్చ కూడా సాగుతోంది. అదే జరిగితే మహిళా నేత మీద ఈ తరహా చర్యలు ఎంతవరకూ రాజకీయంగా కూటమికి లాభిస్తాయన్న చర్చ కూడా సాగుతోంది. చూడాలి మరి రోజా మీద కేసులు ఏ విధంగా ముందుకు వస్తాయో ఏమిటో అన్నది.