మీ పంచాయితీ మాపై రుద్దొద్దు: మీడియాకు రేవంత్ మాస్ వార్నింగ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తరచుగా మీడియాపై అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తరచుగా మీడియాపై అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. జర్నలిస్టులపై ఆయ న గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తన పేరు కూడా సరిగా రాసుకోవడం రాని వాళ్లంతా జర్నలిస్టులుగా చలామణి అవుతు న్నారని.. వ్యాఖ్యానించారు. మీడియా పుట్టగొడుగులా విస్తరించిందని.. దీనికి అర్థం పరమార్థం ఏంటో వారికే తెలియాలని ఒక సందర్భంలో చెప్పారు. ఏమైనా అంటే.. మీడియా స్వేచ్ఛ అంటూ రాగాలు తీస్తారని ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఇక, తాజాగా మరోసారి రేవంత్ రెడ్డి మీడియాను ఉద్దేశించి మాస్ వార్నింగ్ ఇచ్చారు.
తెలంగాణలో ఎన్‌టీవీ ప్రసారం చేసిన ఓ కథనం వివాదానికిదారితీసిన విషయం తెలిసిందే. ఓ మహిళా ఐఏఎస్ అధికారికి, మంత్రి కి లింకు పెడుతూ సాగిన కథనంపై ఐఏఎస్‌ల సంఘం ఫిర్యాదుచేయడం.. పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిందే. అంతే కాదు .. హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో కమిటీ కూడా ఏర్పాటైంది. ఈ క్రమంలోనే సదరు ఛానెల్ జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఇది ఒకవైపు నడుస్తుండగా.. తాజాగా ఆదివారం ఓ పత్రికలో మరో కథనం వచ్చింది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క-బొగ్గుగనుల లీజుకు లింకు పెట్టి సాగిన ఈ కథనం కూడావివాదానికి దారితీసింది.
దీనిపై భట్టి ఆదివారంఉదయమే స్పందించారు. తాను ఇలాంటి పిట్ట కథలకు లొంగే వ్యక్తిని కాదన్నారు. బొగ్గుగనుల లీజు వ్యవ హారం కేంద్ర మార్గదర్శకాలు, నిబంధనల మేరకే జరుగుతుందన్నారు. మీడియాకు స్వేచ్ఛ ఉన్నా.. హద్దులు కూడా ఉండాలని హితవు పలికారు. ఇక, ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలో మాట్లాడుతూ.. మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. ``మీకు మీకు పంచాయితీ ఉంటే.. తలుపులు మూసుకుని కొట్టుకోవాలి. కానీ, మాపై పడొద్దు`` అని ఘాటుగా వ్యాఖ్యానిం చారు. ఒక మంత్రిని బద్నాం చేస్తూ.. రాయడం అంటే తనను బద్నాం చేయడమేనని చెప్పారు.
బొగ్గు వ్యవహారంలో ఎక్కడా అవినీతి, ఆశ్రిత పక్షపాతంవంటివి లేవన్నారు. నిబంధనల ప్రకారమే అన్నీ జరుగుతున్నాయన్నా రు. మంత్రుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వార్తలు రాయవద్దని హితవు పలికారు. ఒకవేళ ఏదైనా సంచలనం గురించి రాయాలని అనుకుంటే.. ముందుగా తనను వివరణ కోరాలని సూచించారు. మంత్రులను బద్నాం చేయొద్దన్నారు. మంత్రులపై రాసే రాతలు తన గౌరవానికి కూడా భంగం కలిగిస్తాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్నది రెండు మీడియా సంస్థల మధ్య వివాదంగా ఆయన చెప్పుకొచ్చారు. దీనిని తమపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సింగరేణి గనులను అనుభవం ప్రాతిపదికన నిబంధనల మేరకు కేటాయిస్తామని చెప్పారు.