రూ.18వేల విలువైన చీమల అక్రమ రవాణా: నలుగురు అరెస్ట్!

ఈ జీవులను దాదాపు 2 నెలల వరకు జీవించి ఉండేలా ప్రత్యేక పద్ధతిలో ప్యాక్ చేసినట్లు అధికారులు తెలిపారు.;

Update: 2025-04-15 19:30 GMT

భారతదేశంలో గోడలపైనా, నేలపైనా చీమలు కనిపించడం సాధారణం. తరచుగా ఇళ్లలో కనిపించే చీమలను భారతీయులు తొక్కి చంపేస్తుంటారు. కానీ, కొన్ని ప్రాంతాల్లో చీమలు, ఇతర కీటకాలను రక్షించడానికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయనీ, ఒక్కో చీమను 18 వేల రూపాయలకు అమ్ముతారు. ఆశ్చర్యంగా ఉంది కదా.. నిజం. ఆఫ్రికాలోని కెన్యాలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. అక్కడ నలుగురు వ్యక్తులు అధిక డిమాండ్ ఉన్న వందలాది చీమలను దేశం నుండి అక్రమంగా తరలించడానికి ప్రయత్నించగా వారిని అరెస్టు చేశారు. కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ (KWS) దీనిని ఒక చారిత్రాత్మక కేసుగా పేర్కొంది. సింహాలు, ఏనుగులు వంటి పెద్ద జంతువులను రక్షించడానికి ఎక్కువ కృషి చేస్తుంది. కానీ, అధిక డిమాండ్ ఉన్న చీమలను కూడా రక్షించడానికి చొరవ తీసుకుంది.

ఒక్కో చీమ ధర 18 వేలు

అక్రమ రవాణాలో భారీ ఆఫ్రికన్ హార్వెస్టర్ చీమలు కూడా ఉన్నాయి. వీటి ధర ఒక్కో చీమకు 170 పౌండ్లు (18 వేల రూపాయలు) వరకు ఉంటుందని కొంతమంది బ్రిటిష్ డీలర్లు చెబుతున్నారు. ఈ కేసులో అక్రమ రవాణా పద్ధతుల్లో ఆందోళనకరమైన మార్పులు కనిపించాయని KWS తెలిపింది. ఈ అక్రమ రవాణాలో ప్రసిద్ధ క్షీరదాల నుండి తక్కువ తెలిసిన జాతుల వరకు, పర్యావరణ సమతుల్యతకు ముఖ్యమైనవి ఉన్నాయి.

ప్రత్యేక పద్ధతిలో అక్రమ రవాణా

ఈ జీవులను దాదాపు 2 నెలల వరకు జీవించి ఉండేలా ప్రత్యేక పద్ధతిలో ప్యాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమ రవాణాకు గురైన కీటకాల సంఖ్యను ఇంకా అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో 'బయో-దొంగతనం' దేశంలో ఇదే మొదటిసారని కేడబ్ల్యూఎస్ ప్రతినిధి పాల్ ఉడోటో బీబీసీకి తెలిపారు.

ముగ్గురు దేశాల వ్యక్తులు

ఈ కీటకాలను అక్రమంగా రవాణా చేస్తూ నలుగురు అనుమానితులను పట్టుకున్నారు. వారిలో ఇద్దరు బెల్జియంకు చెందినవారు. ఒకరు వియత్నాంకు చెందినవారు, మరొకరు కెన్యాకు చెందినవారు. ఒక గూఢచార ఆపరేషన్ సమయంలో వారిని అరెస్టు చేశారు. ఈ కీటకాలను ఐరోపా, ఆసియాలోని విదేశీ పెంపుడు జంతువుల మార్కెట్‌లో విక్రయించడమే వారి లక్ష్యమని భావిస్తున్నారు.

కీటకాల వ్యాపారం

అరుదైన కీటకాల జాతులకు డిమాండ్ పెరుగుతోందని కేడబ్ల్యూఎస్ తెలిపింది. వాటిని పెంచేవారు వాటిని ప్రత్యేక ఆవాసాలలో ఉంచుతారు. వీటిని ఫార్మికేరియం అంటారు. ఆఫ్రికన్ హార్వెస్టర్ చీమ - లేదా మెస్సార్ సెఫలోట్స్ దాని జాతిలో అతిపెద్ద చీమ, ఇది దాదాపు 20 మిమీ వరకు పెరుగుతుంది. రాణి 25 మిమీ వరకు పెరుగుతుంది. పెంపుడు జంతువులుగా ఉంచాలనుకునే వారికి వాటి 'పెద్ద మరియు అందమైన పరిమాణం' ఆకర్షణీయంగా ఉంటుందని కీటకాల వ్యాపార వెబ్‌సైట్ బెస్ట్ యాంట్స్ యూకే జనరల్ మేనేజర్ ప్యాట్ స్టాన్‌చెవ్ అన్నారు.

Tags:    

Similar News