రప్పా రప్పా రాజకీయం...వారి కోసమేనా ?

ఏపీలో రప్పా రప్పా రాజకీయం సాగుతోంది. నిజానికి ఈ రప్పా రప్పా అన్న పదం పుష్ప టూ సినిమా డైలాగ్ గా పుట్టుకొచ్చింది.;

Update: 2025-06-20 17:30 GMT
రప్పా రప్పా రాజకీయం...వారి కోసమేనా ?

ఏపీలో రప్పా రప్పా రాజకీయం సాగుతోంది. నిజానికి ఈ రప్పా రప్పా అన్న పదం పుష్ప టూ సినిమా డైలాగ్ గా పుట్టుకొచ్చింది. దానిని ఇపుడు రాజకీయ నేతలు అంతా అంటున్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ రప్పా రప్పా అని తన మీడియా సమావేశంలో ఈ డైలాగ్ ని వల్లె వేస్తే ఆ తరువాత ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఒక వైపు యోగా వేడుకలు విశాఖలో పెద్ద ఎత్తున జరుగుతూంటే కొందరు రప్పా రప్పా అంటున్నారుని అదే డైలాగ్ తిరిగి తాను చెబుతూ మండిపడ్డారు.

ఇక లేటెస్ట్ గా సీన్ లోకి ఎంటరైన జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రప్పా రప్పా మీద తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. రప్పా రప్పా డైలాగులు సినిమా హాలు వరకూ బాగుంటాయి. వాటిని ఆచరణలో పెడతాము, ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తాము అంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదుని అని స్పష్టం చేశారు. ఎవరైనా చట్టం, నియమ నిబంధనలను పాటించాల్సిందే అని అన్నారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసిందని ఆయన గుర్తు చేశారు.

కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించదు. కచ్చితంగా అలాంటివారిపై రౌడీ షీట్లు తెరిచి అసాంఘిక శక్తులను అదుపు చేస్తామని పవన్ హెచ్చరించారు.

అశాంతిని, అభద్రతను కలిగించేవారికి మద్దతుగా అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడుతున్నవారి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఇలా పవన్ కూడా రప్పా రప్పా రాజకీయంలోకి ఎంటర్ అయ్యారు. అయితే ఎందుకు ఈ డైలాగులు ఏమిటి ఈ రాజకీయం అంటే కొత్త ట్రెండ్ కోసమేనా అన్న సందేహాలు వస్తున్నాయి. యూత్ ని ఎట్రాక్ట్ చేయడానికే ఈ తరహా మేనరిజంతో కూడిన డైలాగులు వాడుతున్నారా అన్న చర్చ వస్తోంది.

నిజానికి సినిమా పాపులర్ అయి సూపర్ హిట్ అయినపుడు ఆ డైలాగులు కూడా కొన్నాళ్ళ పాటు జనబాహుళ్యంలో నానుతాయి. అయితే ఒకప్పటి సినిమాలు వేరు, ఆ డైలాగులు వేరు, ఇపుడు అంతా వేరే విధంగా ఉంది. పైగా యాక్షన్ ఎక్కువ డైలాగులలో కూడా ఆ అది కనిపిస్తోంది అని అంటున్నారు. అలాంటపుడు వాటి పట్ల యూత్ ఆకర్షితులు అయినా కూడా బాధ్యత కలిగిన రాజకీయ పక్షాలు వారిని ప్రోత్సహించరాదని అంటున్నారు.

రప్పా రప్పా అన్నది డైలాగ్ గా క్యాచీగా ఉన్నా దాని వెనక ఉన్న హింసా వదాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని అంటున్నారు. అయితే ఇక్కడ కంటెంట్ అది కాదని తాము వెనక్కి తగ్గేది లేదని చెప్పడమే అసలైన విషయం అంటున్నారు. కూటమి పార్టీలు అధికారంలో ఉన్నాయి. విపక్షంలో వైసీపీ ఉంది. అయినా తాము దూకుడు రాజకీయం చేస్తామని చెప్పేందుకేనా ఈ తరహా డైలాగులను వల్లె వేస్తున్నారు అని అంతా అంటున్నారు.

నిజానికి రాజకీయాల్లో ఎపుడూ రొటీన్ డైలాగులు కొడితే కిక్ ఇవ్వదు. పైగా సోషల్ మీడియా కాలమిది. పదే పదే చర్చకు రావాలన్నా వైరల్ కావాలన్నా కొత్త ట్రెండ్ ని ఫాలో అవాల్సిందే. అదే ఇపుడు వైసీపీ చేస్తోందా అన్న చర్చ సాగుతోంది. నిజానికి వైసీపీ అధినేత జగన్ ఈ డైలాగ్ ఎవరో విలేకరి చెబితే కొట్టారు కానీ ఆయనకు ఆయనగా చేయలేదు అని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ప్రజాస్వామ్యంలో సినిమా డైలాగులు కొడితే తప్పా అని ఆయన అనడమే కొంత వివాదంగా ఉంది.

ఆ సినీ డైలాగుల వెనక హింస విధానం ఉందని ఆలోచించకపోవడమే రప్పా రప్పా రాజకీయానికి తెర తీసినట్లు అయింది అని అంటున్నారు. ఏది ఏమైనా బాధ్యతా యుతమైన స్థానాలలో ఉన్న వారు ఈ విధంగా వ్యవహరించడం తప్పే అన్న మాట ఉంది. ఇక స్వతహాగా సినీ నటుడు స్టార్ హీరో అయిన పవన్ మాత్రం సినిమా డైలాగులు కేవలం హాల్ వరకే అని తనదైన శైలిలో తలంటారు.

సినిమా జీవితం ఒకటి కాదని బయట అలాంటివి చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు పవన్ హెచ్చరికలను పక్కన పెడితే ఇదేదో క్యాచీగా ఉందనే డైలాగులను వాడుతున్నారు తప్ప మరేమీ కాదని అంతా యూత్ కోసమే కొత్త దనం కోసమే అన్న మాట కూడా వినిపిస్తోంది. చూడాలి మరి రప్పా రప్పా అంటూ ఈ రాజకీయం ఏ వైపునకు సాగుతుందో.

Tags:    

Similar News