• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రాంబాబు వర్సెస్...

రాంబాబు వర్సెస్ శ్యాంబాబు...అక్కడ సింక్ అయింది బ్రో !

| సత్తెనపల్లి సీటు మీద మోజు పడినట్లుగా పృధ్వీ మాట్లాడడం ద్వారా అక్కడ సింక్ అయ్యేలానే సెటైర్లు పేల్చారని అంటున్నారు.

By - Tupaki Desk
Update: 2023-07-29 12:31 GMT

సినిమా రాజకీయం మిక్స్ అయిన నేపధ్యంలో ఇపుడు ఏపీ రాజకీయాల్లో కొత్త రచ్చ స్టార్ట్ అయింది. లేటెస్ట్ గా విడుదల అయిన బ్రో మూవీ లో ఒక పాత్ర ఏపీ మంత్రి అంబటి రాంబాబు ని పోలి ఉందని ఆ పాత్ర డ్యాన్స్ కూడా రాంబాబు ఈ ఏడాది సంక్రాంతికి వేసిన డ్యాన్స్ నే ఇమిటేట్ చేసి ఉందని అతి పెద్ద సమరమే సోషల్ మీడియా లో జరుగుతోంది.

ఈ మూవీ లో ఒక పబ్ లో శ్యాంబాబు పాత్రధారి అయిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ అంబటి రాంబాబు మాదిరిగా డ్రెస్ వేసుకుని డ్యాన్స్ చేస్తూంటారు. ఆ పాత్రను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఆ డ్యాన్స్ ఏంటి, ఆ నడక ఏంటి అని ర్యాంగింగ్ చేస్తారు.

ఇపుడు అదే ఏపీ లో పెద్ద వైరల్ గా మారింది. ఈ డైలాగ్ మంత్రిని ఉద్దేశించినదే అని ఆయన అనుచరులు ఒక వైపు సోషల్ మీడియా లో జనసేన మీద విరుచుకుని పడుతూంటే మరో వైపు సినిమా ను సినిమాగా చూడాలని జనసేన నుంచి కామెంట్స్ వచ్చిపడుతున్నాయి.

ఈ నేపధ్యంలో మీడియాతో మాట్లాడిన శ్యాంబాబు పాత్రధారి పృధ్వీ అయితే అంబటి ని ఇమిటేట్ చేయాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. అయినా ఆయన ఏమైనా ఆస్కార్ స్థాయి నటుడా అని సెటైర్లు వేశారు. రాజకీయాల విషయానికి వస్తే వచ్చే ఎన్నికల్లో అంబటి ని సత్తెనపల్లిలో ఢీ కొంటామని ఓడిస్తామని పృధ్వీ సీరియస్ కామెంట్స్ చేశారు.

అంటే సత్తెనపల్లిలో జనసేన టికెట్ మీద పృధ్వీ పోటీ చేసేందుకు రెడీగా ఉన్నట్లుగా చెప్పారని అంటున్నారు. అయితే ఆ సీటు మీద కర్చీఫ్ వేసేసి టీడీపీ ఉంది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అక్కడ నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారు.

ఇదిలా ఉంటే అంబటి రాంబాబు తన మీద తన డ్యాన్సుల మీద బ్రో సినిమా లో ఇమిటేట్ చేస్తూ డైలాగ్స్ పేల్చడాన్ని తప్పు పట్టారు. నేను ఏమైనా డ్యాన్స్ మాస్టార్ నా నా డ్యాన్స్ సాంగ్ కి సింక్ కావడానికి అని ఆయన ఫైర్ అయ్యారు. అదే టైం లో పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ కి ఎప్పటికీ సింక్ కార ని ఘాటైన కామెంట్స్ చేశారు.

అయితే బ్రో సినిమా లో ఇలాగే కొన్ని డైలాగ్స్ ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారు, మండిపడుతున్నారు. అయితే సినిమాల్లో కధను బట్టి డైలాగ్స్ ఉంటాయని వాటికి ఎక్కడికో ముడిపెట్టి రచ్చ చేయడం తగదని జనసేన వర్గాలు అంటున్నాయి. ఏది ఎక్కడ సింక్ కాకపోయినా అంబటి సత్తెనపల్లి సీటు మీద మోజు పడినట్లుగా పృధ్వీ మాట్లాడడం ద్వారా అక్కడ సింక్ అయ్యేలానే సెటైర్లు పేల్చారని అంటున్నారు. మరి జనసేన సత్తెనపల్లిలో పోటీకి రెడీనా అన్నదే చూడాలి.

Tags:    
  • Andhrapradesh 
  • Ambatirambabu 
  • Shyambabu 
  • Bromovie 
  • Pawankalyan 
  • Dance 
  • Prthvi 
  • Janasena 
  • Ycp 

Similar News

తేడా స్వల్పం.. ఫలితాల్లో చాలా వ్యత్యాసం - విజయనగరం జిల్లా ఓట్ల లెక్కలు ఆసక్తికరం

2026-11-09 17:30 GMT

విదేశాల్లో భారతీయుల ప్రవర్తనపై విమర్శలు.. అసలు సమస్య ఎక్కడుంది?

2026-11-09 16:30 GMT

యుద్ధంలో గెలుపు ఎవరిది? రష్యాకు మిగిలేది శవాల లెక్కేనా?

2026-11-09 15:30 GMT

70 కోట్ల విలువైన‌ న‌కిలీ రూ.20 కాయిన్‌లు త‌యారు చేసిన కేటుగాళ్లు!

2026-11-09 14:30 GMT

జెన్‌జీల కొత్త ట్రెండ్ ‘మాగింగ్’.. అసలేంటిది? ఏం చేస్తున్నారు?

2026-11-09 13:30 GMT

జెన్సన్ హువాంగ్‌కు మస్క్, బిల్ అక్‌మన్ మద్దతు.. వివాదంపై ఎన్విడియా బోర్డు దర్యాప్తు!

2026-11-09 12:35 GMT

ఒక్క రాత్రిలో 50 కోట్లు మటాష్ !

2026-11-09 12:30 GMT

యూపీఏ సర్కార్ రికార్డును బ్రేక్ చేసిన మోదీ ప్రభుత్వం.. ఎందులో అంటే..?

2026-11-09 11:02 GMT

కూటమికి వైసీపీ మధ్య బిగ్ గ్యాప్ ...బాబు చెప్పిన లెక్క !

2026-11-09 10:58 GMT

కార్తీక మాసం అంటే కేవలం భక్తి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఓ ఛాలెంజ్.. తెలుగు యువత కొత్త ట్రెండ్..

2026-11-09 10:56 GMT

100 శాతం స్ట్ర‌యిక్ రేట్.. కోటంరెడ్డి ఆశ‌లు నెర‌వేరుతాయా?!

2026-11-09 10:38 GMT

`ప‌రిష‌త్` లెక్క తేలింది.. ఫైన‌ల్ ఫ‌లితం ఇదే!

2026-11-09 10:33 GMT

Copyright @2026

Powered by Blink CMS