సింధు ప్రావిన్స్ భారత్ లో విలీనం ...రాజ్ నాథ్ సింగ్ సంచలనం

దేశ విభజన జరిగిన తరువాత సింధు ప్రావిన్స్ అన్నది పాకిస్థాన్ లోకి వెళ్ళిపోయింది. భూభాగాల విభజన వల్ల ఇలా జరిగింది.;

Update: 2025-11-24 03:49 GMT

దేశ విభజన జరిగిన తరువాత సింధు ప్రావిన్స్ అన్నది పాకిస్థాన్ లోకి వెళ్ళిపోయింది. భూభాగాల విభజన వల్ల ఇలా జరిగింది. అయితే సింధులో అత్యధిక ప్రజలు మాత్రం విభజన తరువాత తిరిగి భారత్ లోకి వచ్చేశారు. అలా వచ్చిన వారిలో ఈ దేశ ఉప ప్రధానిగా బీజేపీకి సారధిగా పనిచేసిన లాల్ క్రిష్ణ అద్వానీ ఒకరు. ఆయన కుటుంబం అప్పట్లో భారత్ కి వచ్చి గుజరాత్ లో స్థిరపడింది. అదే విధంగా అనేక మంది భారత్ తిరిగి వచ్చారు. ఇక ఈ రోజుకీ చూస్తే పాక్ లో సింధు ప్రావిన్స్ ఉన్న వారు అంతా భారతీయ సంప్రదాయాన్ని పాటిస్తారు. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.

సింధు భారత్ లో విలీనం :

పాక్ లో ఉన్న సింధు ప్రావిన్స్ ఏదో రోజున భారత్ లో విలీనం అయినా ఆశ్చర్యం లేదని ఆయన అన్నారు ఏమో ఎవరు ఊహించగలరు ఇదంతా అని ఆయన ఈ కామెంట్స్ చేశారు. దివారం న్యూఢిల్లీలో విశ్వ సింధీ హిందూ ఫౌండేషన్ ఆఫ్ అసోసియేషన్స్ నిర్వహించిన సశక్త సమాజ్ సమృద్ధ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్ సింధీ సమాజం భారతదేశ సాంస్కృతిక గుర్తింపు ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉన్నారు అని అభివర్ణించారు. సింధీ సమాజం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతిభకు ప్రసిద్ధి చెందిందని ఆయన కితాబు ఇచ్చారు.

వారి హక్కులకు అభయం :

భారత దేశం సింధీ సమాజాన్ని ఎపుడూ వేరుగా చూడలేదని ఆయన అన్నారు. వారి హక్కులను బీజేపీ ఏనాటి నుంచో కాపాడుతూ వస్తోందని ఆయన గుర్తు చేశారు. పొరుగు దేశాలలో మతపరమైన హింస నుండి పారిపోతున్న మైనారిటీ వర్గాలను ప్రభుత్వం పాస్‌పోర్ట్ లేకుండా భారతదేశంలో ఉండటానికి అనుమతించింది కేంద్ర ప్రభుత్వం అని ఆయన అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం ఇలా హింసించబడిన శరణార్థులకు సురక్షితమైన గౌరవప్రదమైన సాధికారత కలిగిన జీవితానికి అందించిందని ఆయన చెప్పారు. రాజ్ నాధ్ చేసిన ఈ వ్యాఖ్యతో పాక్ లో ఉన్న సింధూ భూభాగం భారత్ లో కలుస్తుందా అన్న కొత్త చర్చ అయితే మొదలైంది. ఇప్పటికే పీఓకేని వెనక్కి తెస్తామని రక్షణ మంత్రి పలు మార్లు ప్రకటించారు ఇపుడు సింధూ ప్రావిన్స్ కూడా విలీనం అవుతుందేమో అంటూ చేసిన వ్యాఖ్యలతో దాయాది పాక్ కు మంట పుట్టడం ఖాయమని అంటున్నారు.

దేశంలో సింధీలు :

ఇదిలా ఉండగా భారతదేశంలో సింధీ సమాజం వివిధ రంగాలలో రాణిస్తున్నారు అని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పుకొచ్చారు. సింధీ సమాజం యొక్క సమిష్టి బలంతో బలమైన భారతదేశ నిర్మాణం సాగుతోందని అన్నారు. వ్యాపారం, పరిశ్రమ, బ్యాంకింగ్, సేవలు మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలలో సింధీ సమాజం స్థిరంగా రాణించిందని ఆయన చెప్పారు. తద్వారా లక్షలాది మందికి జీవనోపాధిని కల్పిస్తుందని పేర్కొన్నారు. సింధీ సమాజం విజయం కేవలం ఆర్థిక చతురతలోనే కాకుండా, విశ్వాసం, సహకారం, నైతిక ప్రవర్తన మీద ఆధారపడిందని వివరించారు.

Tags:    

Similar News