ముగిసిన అధ్యాయాన్ని తెరిచిన ప్రొఫెసర్...ఏం జరగనుంది ?

జనసేన మీద రాజకీయ విశ్లేషణ చేసి తరువాత తనకు తానుగా ఉప సంహరించుకున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పి మరీ ఇపుడు ప్రెస్ క్లబ్ లో కొత్తగా తెరవడమేంటి అన్న చర్చ సాగుతోంది.

Update: 2026-05-28 04:11 GMT

జనసేన మీద రాజకీయ విశ్లేషణ చేసి తరువాత తనకు తానుగా ఉప సంహరించుకున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పి మరీ ఇపుడు ప్రెస్ క్లబ్ లో కొత్తగా తెరవడమేంటి అన్న చర్చ సాగుతోంది. అక్కడ అయితే ఏకంగా పవన్ ని విమర్శిస్తూ చాలా మంది మాట్లాడారు. మరి ఇది ఏ వైపునకు తీసుకుని పోతున్నారు అన్నదే చర్చ. ఇక పవన్ కళ్యాణ్ అయితే ప్రొఫెసర్ అరెస్టు ఎందుకు అని చెప్పిన తరువాత కూడా ఈ రకంగా రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెట్టి ఏపీ తెలంగాణా అంటూ చర్చ చేయడమేంటి అన్నది ఇపుడు కొత్తగా డిబేట్ అవుతోంది.

ప్రొఫెసర్ ఎందుకలా :

నిజానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే అందరికీ రెస్పెక్ట్ ఉంది. చాలా మంది మాదిరిగా ఆయన వన్ సైడెడ్ గా ఉండరని న్యూట్రల్ గానే మాట్లాడుతారని, అయితే ఆయన జనసేన విషయంలో చేసిన విశ్లేషణ అయితే ఆ పార్టీకి కొంత డ్యామేజింగ్ గానే ఉంది. దాంతోనే జనసేన రెస్పాండ్ అయింది. ఇక దాని మీద రచ్చ స్టార్ట్ అయ్యాక ప్రొఫెసర్ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటున్నాను అని చెప్పారు. ఆ మీదట జనసేన వైపు నుంచి కూడా వివాదం ఎందుకు అన్న వైఖరి కనిపించింది. పవన్ సైతం ప్రొఫెసర్ అంటే ఇష్టమే అని ఆయన అరెస్టు ఎందుకన్నారు. ఇలా అంతా సాఫీగా సాగిపోతోంది అనుకున్న నేపధ్యంలో రౌండ్ టేబిల్ సమావేశంలో మాట్లాడిన మేధావులు జర్నలిస్టులు అంతా కలసి పవన్ మీద విమర్శల దాడి చేయడంతో పాటు ఆయనను వ్యక్తిగతంగానూ నిందించారు. దాంతో ఇపుడు జనసేన అయితే రగిలిపోతోంది.

లాగడం వెనక :

నిజానికి ప్రొఫెసర్ ఇది ఇక్కడితో వదిలేద్దాం అని చెప్పిన వారే మళ్ళీ రౌండ్ టేబుల్ మీటింగ్ అంటూ ముందుకు రావడం తనను అరెస్టు చెయ్యాలని అనుకుంటే చేసుకోండి అని సవాల్ చేయడం బట్టి చూస్తే ఈ వివాదాన్ని గట్టిగా లాగడం వెనక ఎవరు ఉన్నారు అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అంతే కాదు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన వారి మాటలు కూడా కొత్త చిచ్చుకు కారణంగా మారుతున్నాయా అన్నది కూడా చర్చకు వస్తోంది. పవన్ బాబు లోకేష్ వీరంతా తెలంగాణా ఎందుకు వస్తున్నారు అని రౌండ్ టేబిల్ సమావేశంలో కొందరు ప్రశ్నించడం ఏ రకమైన రాజ్యాంగ నీతి అని ప్రశ్నిస్తున్న వారూ ఉన్నారు. ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశం వల్ల ప్రొఫెసర్ కి మద్దతు లభించి ఉండొచ్చు కానీ ఆయన న్యూట్రల్ స్టాండ్ కానీ ఆయన గౌరవనీయ స్థానం కానీ ఎక్కడో ఇబ్బంది పడుతున్నట్లుగా అనిపించడం లేదా అన్న చర్చ కూడా వస్తోంది.

ఎవరో ఉండి చేయిస్తున్నారా :

అసలు ఈ వ్యవహారం వెనక ఎవరు ఉన్నారన్న చర్చ కూడా సాగుతోంది. గోటితో పోయే దానికి గొడ్డలి దాకా అన్నట్లుగా వివాదాన్ని తెగే దాకా లాగడం అన్నది కూడా సబబు కాదు అన్న మాటా వినిపిస్తోంది. ప్రొఫెసర్ అంటే అందరికీ గౌరవం ఉంది. ఆయన కూడా ఎమ్మెల్సీగా పనిచేసి ఉన్న వారు, విద్యావంతులు మేధావి. అదే సమయంలో ఏపీలో ప్రభుత్వంలో ఉన్న వారు కూడా సహనంతోనే వ్యవహరించామని అంటున్నారు. అందుకే అరెస్టులు అయితే లేవు అని గుర్తు చేస్తున్నారు మరి సాఫీగా పరిష్కారం కావాల్సిన చోట మళ్ళీ ఈ సవాళ్లు ఘాటు విమర్శలు ఏమిటి ఎందుకు అన్న చర్చ వస్తోంది. ఇక ఈ మీటింగ్ లో మాట్లాడిన వారిలో కొందరు తమిళనాడులో విజయ్ విజయం పవన్ లో ఫ్రస్ట్రేషన్ వచ్చేలా చేసింది అని కామెంట్స్ చేయడం కూడా జనసైనికులకు ఆగ్రహం తెప్పిస్తోంది అని అంటున్నారు. చిలికి చిలికి గాలి వానగా మారే విధంగా కాకుండా ఎక్కడో ఎండ్ కార్డ్ వేయాల్సిన అవసరం ఉంది కదా అని అంటున్నారు.

Tags:    

Similar News