50 వేల గదులు...టూరిస్టుల పంట పండింది

ఏపీలో టూరిజానికి బ్రహ్మాండమైన దశ ప్రస్తుతం నడుస్తుంది. పర్యాటకంతోనే ఏపీ ఆదాయం పెరిగే విధంగా వాతావరణం ఉంది.;

Update: 2026-02-19 03:00 GMT

ఏపీలో టూరిజానికి బ్రహ్మాండమైన దశ ప్రస్తుతం నడుస్తుంది. పర్యాటకంతోనే ఏపీ ఆదాయం పెరిగే విధంగా వాతావరణం ఉంది. దేశంలో పర్యాటక రంగం విషయంలో ఏపీ మూడవ స్థానంలో ఉంది. ప్రతీ ఏటా 278 మిలియన్ దేశీయ పర్యాటకులు ఏపీకి వస్తున్నారు. అలాగే. 1.8 లక్షల మంది విదేశీ పర్యాటకులు ఆంధ్రాకు వచ్చి అందాలను ఆస్వాదిస్తున్నారు. దీంతో ఏపీలో పర్యాటకానికి ఉజ్వల దశ ఉందని కూటమి ప్రభుత్వం మరింతగా కార్యక్రమాలను రూపొందిస్తోంది.

అర్ధ శతాబ్దంగా :

ఏపీ టూరిజానికి అర్ధ శతాబ్దం చరిత్ర ఉంది. ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ 50 వసంతాలు తాజాగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం గోల్డెన్ జూబ్లీ వేడుకలను కార్పొరేషన్ ఘనంగా నిర్వహిస్తోంది. ఇక ఒక్కసారిగా చూస్తే ఏపీలో టూరిజం ప్రాధాన్యత అంతకంతకు పెరుగుతోంది అని అంటున్నారు. ఏపీకి జీవనాడిగా పర్యాటకం నిలుస్తోంది అని గుర్తు చేస్తున్నారు.

రెట్టింపు ఆదాయంతో :

ప్రస్తుతం ఏపీ ఆర్ధిక వ్యవస్థలో టూరిజం వాటా 4.6 శాతంగా ఉంది. దీనిని 2029 నాటికి 8 శాతం చేయాలని చూస్తున్నారు. ఏపీలో టూరిజం అంటే విహార స్థలాలలో వీక్షణంతో పాటు ఆధ్యాత్మిక టూరిజానికి సైతం పెద్ద పీట వేస్తోంది. మరో వైపు చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్టుబడులను ఈ రంగంలో పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నారు దాంతో రానున్న కాలంలో మరింత జోరు చేయనుంది అని అంటున్నారు.

ప్రపంచ స్థాయిలోకి :

ఏపీలో టూరిజాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్ళాలని చూస్తున్నారు. అలాగే వరల్ క్లాస్ స్పాట్స్ గా ఏపీలోని కీలక పర్యాటక కేంద్రాలను తీర్చిదిద్దాలని చూస్తున్నారు. అలా పర్యాటక రంగాన్ని నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్య లక్ష్యంగా పనిచేస్తున్నారు. గత ఇరవై నెలలలో పర్యాటక రంగం గణనీయమైన అభివృద్ధి సాధించిందని అధికారులు చెబుతున్నారు. సుమారుగా 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని అలాగే 1.22 లక్షల ఉద్యోగాల కల్పనతో రాష్ట్ర పర్యాటక రంగం ముందంజలో ఉందని అంటున్నారు.

పీపీపీ మోడల్ లో :

ఏపీలో టూరిజం షేర్ ని పెంచేందుకు మరింతగా సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చూస్తోంది. దీంతో పెద్ద ఎత్తున హోటళ్లు, రిసార్టులు అడ్వెంచర్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తోంది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో పెట్టుబడులను తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలో ఏకంగా యాభై వేల దాకా కొత్త గదులను పర్యాటకుల కోసం నిర్మిస్తున్నారు. అలాగే రీసార్ట్స్ హొటొళ్స్ పెద్ద ఎత్తున టూరిస్ట్ ప్రాంతాలలో రాబోతున్నాయి. దీంతో టూరిజం రంగం మరింతగా విస్తరించడానికి ఆస్కారం ఏర్పడుతుందని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా హోటళ్లు, కాటేజీలు, రెస్టారెంట్లు రెడీ చేసేందుకు పీపీపీ మోడల్ ని ఎంచుకున్నారు.

Tags:    

Similar News