గుజరాత్ సీన్..కేరళలో రిపీట్.. సాధ్యమేనా మోడీ సర్!
గుజరాత్‌లో గత 25 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. అయితే.. 35 ఏళ్ల కిందట అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో తొలిసారి బీజేపీ పాగా వేసింది.;
``గుజరాత్ సీన్...కేరళలో రిపీట్ అవుతుంది. ఇది పక్కా. ఇక్కడి ప్రజలు ఈ సీన్ కోసం ఎదురు చూస్తున్నారు. మీరు(ప్రత్యర్థి పార్టీలు) కూడా ఎదురు చూడండి.`` - అని ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. శుక్రవారం ప్రధాని మోడీ.. కేరళలో సుడిగాలి పర్యటనలు చేశారు. వచ్చే ఏప్రిల్-మే మాసాల మధ్య ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌లు మాత్రమే అధికారం పంచుకుంటున్నాయి.
కానీ, ఈ దఫా బీజేపీ బలమైన పోటీ ఇచ్చేందుకు విజయం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఎన్నిక లకు రెండు మాసాల ముందు ప్రధాని శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అమృత్ భారత్ రైళ్లతోపాటు.. పీఎం స్వనిధి క్రెడిట్ కార్డులను(వీధి వ్యాపారులు, మహిళలకు రుణాలు ఇచ్చేందుకు) ఆవిష్కరించారు. అనంతరం.. బీజేపీ రాష్ట్ర ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా చేసిన రాజకీయ ఉపన్యాసంలో కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లో సీన్.. కేరళలోనూ రిపీట్ అవుతుందని .. ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.
ఏంటా సీన్?
గుజరాత్‌లో గత 25 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. అయితే.. 35 ఏళ్ల కిందట అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో తొలిసారి బీజేపీ పాగా వేసింది. అనంతరం.. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ పుంజుకుని.. గత పాతికేళ్లుగా అధికారంలో ఉంది. తాజాగా కేరళలో గత నెలలో జరిగిన మునిసిపల్,కార్పొరేషన్ ఎన్నికల్లో రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని కార్పొరేషన్‌ను బీజేపీ దక్కించుకుంది. ఇక్కడ 100 వార్డుల్లో 51 వార్డులను బీజేపీ నేతృత్వంలోని చిన్న చితకపార్టీలతో కూడిన ఎన్డీయే దక్కించుకుంది. దీనిని ప్రస్తావించిన ప్రధాని.. గతంలో గుజరాత్‌లో బీజేపీ ప్రస్తానం.. ఒక కార్పొరేషన్‌తో ప్రారంభమైందని.. ఇప్పుడు తిరువనంతపురంతో తమ ప్రస్థానం మొదలవుతుందని, రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెప్పుకొచ్చారు.
సాధ్యమేనా?
గుజరాత్‌కు-కేరళకు మధ్య సారూపత్యల విషయానికి వస్తే.. భౌగోళికంగా.. అక్కడా ఇక్కడా తీర ప్రాంతం ఎక్కువగాఉంది. మత్స్యకార గ్రామాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక, పరిశ్రమల పరంగా కేరళ కంటే గుజరాత్‌లోనే ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు.. మతాలు, కులాల వారీగా చూస్తే.. గుజరాత్‌లో హిందువులు, ఆర్ ఎస్ ఎస్‌వాదులు.. బలమైన సెంటిమెంటు ఉంది. ఇది అప్పట్లోను.. ఇప్పుడు కూడా బీజేపీకి కలిసి వస్తున్న పరిణామం. కానీ, కేరళ విషయంలో అందరూ చదువుకున్న వారు.. పైగా కులం ఏదైనా క్రిస్టియానిటీ 72 శాతం ఉంది. ఇది బీజేపీకి మింగుడు పడని వ్యవహారం. పైగా.. చర్చిలకు బీజేపీ వ్యతిరేకం. మరోవైపు.. ఎస్సీలు కూడా అధికంగా ఉన్న రాష్ట్రం కేరళ. వీరంతా.. క్రిస్టియానిటీనే అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ వంటి హిందూత్వ పార్టీలు.. ఏమేరకు పుంజుకుంటాయన్నది ప్రశ్న.