జగన్‌కు ప్రధాని మోడీ భారీ కౌంటర్!
వైసీపీ అధినేత జగన్‌కు ఇప్పటి వరకు జరిగిన రాజకీయాలు ఒక ఎత్తు అయితే.. ఇక నుంచి మరో ఎత్తు అన్నట్టుగా రాజకీయాలు ముందుకు సాగనున్నాయి.;
వైసీపీ అధినేత జగన్‌కు ఇప్పటి వరకు జరిగిన రాజకీయాలు ఒక ఎత్తు అయితే.. ఇక నుంచి మరో ఎత్తు అన్నట్టుగా రాజకీయాలు ముందుకు సాగనున్నాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న అభివృద్ధిపై ఇప్పటి వరకు జగన్ చేస్తున్న విమర్శలు, వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్లపై టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మాత్రమే కౌంటర్లు ఇస్తున్నారు.
నిజానికి కూటమిగా ఉన్న ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు కూటమిలోని అన్ని పార్టీలు సమానంగా బాధ్య త వహించాలి. కానీ.. కూటమిలోని మరో పార్టీ బీజేపీ నాయకులు మాత్రం మాకెందుకులే! అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. బీజేపీ ఎంపీలకు ఇచ్చిన బ్రేక్ ఫాస్ట్ విందులో ఏపీకి సంబంధించిన రాజకీయాలను ప్రధాని ప్రస్తావించారు.
చంద్రబాబు సర్కారు బాగా పనిచేస్తోందని... మెజారిటీ పెట్టుబడులు ఏపీకే వెళ్తున్నాయని ప్రధాని చెప్పా రు. రాబోయే స్వల్ప సమయంలోనే ఏపీ పుంజుకుంటుందని కూడా అన్నారు. ఇదేసమయంలో వైసీపీ చేస్తున్న విమర్శలు, చేస్తున్న నిరసనలపైనా మోడీ స్పందించారు. జగన్‌కు బ్రేకులు వేయాలంటే.. బీజేపీ ఎంపీలు కూడా మీడియా ముందుకు రావాలని సూచించారు. ఆయన విమర్శలను దీటుగా ఎదుర్కొనాలని చెప్పారు.
అంతేకాదు.. ప్రభుత్వానికి సహకరించాలని కూడా ప్రధాని మోడీ బీజేపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ చేస్తున్న విమర్శలను ఎదుర్కొనడంతోపాటు ప్రజల మధ్యకు కూడా వెళ్లాలని ప్రధాని తేల్చి చెప్పారు. ఈ భేటీలో ఏపీకి చెందిన బీజేపీ, టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. టీడీపీ ఎంపీల పనితీరు బాగుందని ప్రధాని కితాబునిచ్చారు. ఇలాంటి సమయంలో మిత్రపక్షంగా బీజేపీకి బాధ్యత ఉందని.. వైసీపీ విమర్శలపై దీటుగా జవాబివ్వాలని పేర్కొన్నారు.