• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వైరల్ విజువల్స్......

వైరల్ విజువల్స్... బ్రెజిల్ లో కూలిన విమానం.. 61 మంది మృతి!

| ఈ ఘటనపై బ్రెజిల్ ప్రెసిడేంట్ లూయిజ్ ఇనాసెయో లులాడా సిల్వా స్పందించారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబాలకు, స్నేహితులకు సంఘీభావం ప్రకటించారు.

By - Tupaki Desk
Update: 2024-08-10 05:21 GMT

బ్రెజిల్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ భారీ విమాన ప్రమాదం జరిగింది. 57 మంది ప్రయాణికులు నలుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్నట్లు చెబుతున్న విమానం గాల్లో చెక్కర్లు కొడుతూ సావో పువాలోలోని రెసిడెన్షియల్ ఏరియాలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆ విమానంలో ఉన్న 61 మందీ మృతి చెందారని తెలుస్తోంది.

 

అవును... ఏటీఆర్ 72 ట్విన్ ఇంజిన్ టర్బోప్రాప్ అనే విమానం 57 మంది ప్రయాణులు, నలుగురు సిబ్బందితో సావో పాలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వెళ్తుందగా అది విన్ హెడోలో కూలిపోయిందని వోపాస్ ఎయిర్ లైన్స్ తెలిపింది. ఈ ప్రమాదానికి సంబంధించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫుటేజ్ వైరల్ గా మారింది.

 

ఫ్లైట్ రాడార్ 24 డేటా ప్రకారం... ఈ విమానం బ్రెజిలియన్ రాష్ట్రంలోని పరానాలోని కాస్కావెల్ నుంచి బయలుదేరి.. సావో పాలో రాష్ట్రంలోని గ్వార్ల్ హౌస్ కు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:21 గంటల వరకూ 17,000 అడుగుల ఎత్తులో ప్రయాణించిన ఆ విమానం అనంతరం ఒక్క నిమిషంలోనే అంతెత్తు నుంచి కిందపడిపోయిందని చెబుతున్నారు.

 

ఈ ఘటనపై బ్రెజిల్ ప్రెసిడేంట్ లూయిజ్ ఇనాసెయో లులాడా సిల్వా స్పందించారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబాలకు, స్నేహితులకు సంఘీభావం ప్రకటించారు. ఇదే క్రమంలో.. సావో పాలో రాష్ట్ర గవర్నర్ టార్సియో గోంస్ డి ప్రిటాస్ స్పందిస్తూ... మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

మరోవైపు ఈ ఘటనపై స్పందించిన అధికారులు... విమానం నివాస ప్రాంతంలో ల్యాండ్ అయినప్పటికీ ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు. స్థానికంగా ఉన్న కాండోమినియం కాంప్లెక్స్ లోని ఓ ఇల్లు మాత్రమే దెబ్బతిన్నదని అన్నారు. ఇదే సమయంలో... ఫ్లైట్ రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.. విచారణ జరుగుతుందని వెల్లడించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలంలోనే ఉన్నట్లు తెలిపారు.

BREAKING: Voepass Flight 2283, a large passenger plane, crashes in Vinhedo, Brazil pic.twitter.com/wmpJLVYbB3

— BNO News (@BNONews) August 9, 2024

Video footage shows the aftermath of the plane crash that allegedly resulted in the deaths of 68 passengers.#Brazil #planecrash pic.twitter.com/nCtzeFxLxV

— War Correspondent (@War_monitor1) August 9, 2024

A plane has crashed in São Paulo, Brazil, claiming the lives of 70 people. #planecrash https://t.co/76QfygYpGu

— Satya Prakash (@_SatyaPrakash08) August 9, 2024
Tags:    
  • Brazil 
  • ATR72 
  • Vopassairlines 
  • Brazilianpresident 
  • LuizinacioLuladaSilva 
  • GuarlHouse 
  • Saopaulo 
  • Politicalnews 

Similar News

ఎఫైర్స్ కోసం ప్రత్యేక యాప్.. ఎంతకు తెగించారురా? ఎటు పోతోంది సమాజం?

2026-11-09 19:30 GMT

రెబెల్స్ ని కూటమి తలుపులు క్లోజ్... బాబు కఠిన నిర్ణయం

2026-11-09 19:19 GMT

జనసేనకే డిప్యూటీ మేయర్ పదవి ?

2026-11-09 19:18 GMT

2027 లో భీకర యుద్ధం...ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమి !

2026-11-09 19:18 GMT

ఇందిరమ్మ ఒడిలో రాహుల్ గాంధీ.. కాలం వెనక్కి వెళ్లిన వేళ ఓ అరుదైన వీడియో..

2026-11-09 19:16 GMT

ఎన్ని నిబంధనలు పెట్టినా ఈ ఢిల్లీని కాపాడలేరు

2026-11-09 19:14 GMT

ష‌ర్మిల‌కు ఆల్ట‌ర్నేట్‌.. కాంగ్రెస్‌లో హాట్ టాపిక్.. ?

2026-11-09 19:14 GMT

ఆమెను త‌ట్టుకోలేమ‌బ్బా.. చెవిరెడ్డికి సుధ సంక‌టం.. !

2026-11-09 19:13 GMT

27 జిల్లాలు ఒక ఎత్తు.. అల్లూరి జిల్లా ఇంకొక ఎత్తు! ఓటమిపై చంద్రబాబు హాట్ కామెంట్స్

2026-11-09 19:10 GMT

ఏపీకి మళ్లీ వర్షాల ముప్పు.. రాయలసీమ, తెలంగాణకు మాత్రం ఉపశమనం

2026-11-09 19:08 GMT

జనసేన ఎమ్మెల్యేలకు షాక్.. పవన్ నిర్ణయంపై ఉత్కంఠ

2026-11-09 19:04 GMT

మరణశిక్ష విధించినా బంగ్లాకు హసీనా? భారత్ కు పరీక్ష.. ఏం జరుగనుంది?

2026-11-09 19:02 GMT

Copyright @2026

Powered by Blink CMS