E30 ఇథనాల్ పెట్రోల్.. కార్లు, బైకుల మైలేజీ గోవిందా?
చెరకు ప్రాసెసింగ్ లో ఇథనాల్ ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు. దీనిని శిలాజ ఇంధన వినియోగంగా ఉపయోగిస్తారని అంటున్నారు.
పెట్రోల్ లో 30 శాతం ఇథనాల్ కలిపేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చమురు సంక్షోభం నేపథ్యంలో ముడిచమురు దిగుమతుల భారం తగ్గించుకోవడంతోపాటు దేశీయ జీవన ఇంధన రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యారో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెల్లడించింది. ప్రస్తుతం పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ చేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలతో 30 శాతం బ్లెండింగ్ చేసేందుకు కేంద్రం అనుమతించినట్లు చెబుతున్నారు. దీనివల్ల ప్రస్తుతం ఉన్న పాత వాహనాల ఇంజిన్లపై తీవ్ర ప్రభావం పడుతుందని, మైలేజీ సమస్యలతోపాటు ఇంజిన్ లైఫ్ దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
పెట్రోల్ లో 30 శాతం ఇథనాల్ బ్లెండింగ్ వల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవ్వడమే కాకుండా, కాలుష్యం తగ్గుతుందని, చెరకు, మొక్కజొన్న రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని చెబుతున్నారు. కానీ, పాత వాహనాల విషయంలో మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని అంటున్నారు. 2025 తర్వాత తయారైన వాహనాల ఇంజిన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, పాత వాహనాలు మాత్రం కొత్త పెట్రోల్ మిశ్రమానికి తగ్గట్టుగా మార్పులు చేసుకోవాల్సివుంటుందని అంటున్నారు.
ఇథనాల్ ఉత్పత్తి ఎలా?
చెరకు ప్రాసెసింగ్ లో ఇథనాల్ ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు. దీనిని శిలాజ ఇంధన వినియోగంగా ఉపయోగిస్తారని అంటున్నారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించే లక్షణం ఉండటంతో 2022 నుంచి పెట్రోల్ లో ఇథనాల్ మిశ్రమం కలుపుతున్నట్లు చెబుతున్నారు. తొలుత పది శాతం ఇథనాల్ కలిపేవారని, దీనివల్ల ప్రయోజనాలు అధికంగా ఉండటం వల్ల క్రమంగా పెంచుకుంటూ వెళుతున్నారని నిపుణులు వివరిస్తున్నారు. 2001లో పైలెట్ ప్రాజెక్టుగా ఇథనాల్ కలపడాన్ని కేంద్రం పరిశీలించింది. 2022 జూన్ నెలలో తొలుత పదిశాతం కలిపింది. 2030 నాటికి 20 శాతం మిశ్రమాన్ని కలపాలని లక్ష్యంగా పెట్టుకున్నా, అంతర్జాతీయ పరిణామాలతో 2025లోనే 20 శాతం బ్లెండింగ్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
దీంతో మనదేశంలో చాలా మంది ఒరిజనల్ ఎక్విప్మెంట్ తయారీదారులు (ఓఈఎం) ఇప్పటికే ఈ20 ఫ్యూయెల్ కంప్లైంట్ ఇంజిన్ లతో వాహనాలను అప్డేట్ చేశారు. పెట్రోల్ తో పోలిస్తే ఈ20 పెట్రోల్ తో నడిచే వాహనాల మైలేజీ కొంచెం తగ్గుతుందని అధికారిక వర్గాలే చెబుతున్నాయి. మరోవైపు ఇథనాల్ కూడా తినివేయు స్వభావం కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఇది వాతావరణంలోని తేమను గ్రహించడం వల్ల కొన్ని పదార్థాలతో ప్రతిచర్య జరిగి తుప్పు పడుతుందని అంటున్నారు. వాహనాల్లో ఇథనాల్ ఎక్కువసేపు విడుదలైతే ప్యూయెల్ ట్యాంకులు, సీల్స్, గాస్కెట్లు, ఇంధన లైన్లు వంటి రబ్బరు, ప్లాస్టిక్ భాగాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ30కి వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పెట్రోల్ లో ఇథనాల్ మిశ్రమం కలపాలనే నిర్ణయం వల్ల రైతులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని అంటున్నారు.