పేర్ని నాని ఆడియో కాల్ లీక్ రచ్చ... మొదలైపోయిన యాక్షన్!

తాజాగా గుడివాడలో జరిగిన ఘటనలో వైసీపీ కుట్ర బట్టబయలయ్యిందనే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే;

Update: 2025-07-13 09:16 GMT

తాజాగా గుడివాడలో జరిగిన ఘటనలో వైసీపీ కుట్ర బట్టబయలయ్యిందనే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... కూటమి, వైసీపీ నేతల మధ్య గొడవకు కాస్తా కులం రంగు పులమాలని, దానిపై రాష్ట్ర వ్యాప్తంగా గోడవలు సృష్టించాలనే మాజీ మంత్రి పేర్ని నాని ఫోన్ సంభాషణ ఇప్పుడు వైరల్ అవ్వగా.. సర్కార్ యాక్షన్ స్టార్ట్ అయ్యింది!

అవును... బీసీ మహిళపై దాడి జరిగిందంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని.. పై నుంచి లోకేష్ చెప్పటంతో గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే, అతని అనుచరులు దాడి చేశారని ప్రచారం చేద్దాం అంటూ పేర్ని నాని ఆడియో కాల్ విత్ వీడియో షూట్ బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. టీడీపీ ఫిర్యాదుతో మాజీ మంత్రిపై కేసు నమోదైంది.

అసలేం జరిగిందంటే... నాగవరప్పాడు కె కన్వెన్షన్‌ లో మాజీ మంత్రి కొడాలి నాని 'బాబు ష్యూరిటీ - మోసం గ్యారంటీ' పేరుతో పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్మన్ హారిక కారును టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆమెను వెనక్కి తిరిగి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణలు వాహనాన్ని ధ్వంసం చేశారు! ఈ సమయంలో... కె కన్వెన్షన్ వైపు కారు వెళ్లకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుగా నిలిచారు. దీంతో పోలీసులు రంగం ప్రవేశం చేసి అతి కష్టంమీద హారిక కారును వెనక్కి పంపించారు. ఈ విషయం వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం రేకెత్తించింది. వారంతా కె కన్వెన్షన్‌ నుంచి బయటకొచ్చేందుకు ప్రయత్నించారు.

దీంతో.. అక్కడే ఉన్న డీఎస్పీ నేతృత్వంలోని పోలీసులు వారు బయటకు రాకుండా నిలువరించారు. మరోవైపు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నాగవరప్పాడు సెంటర్‌ లో భారీగా పోలీసులను మోహరించారు. ఇదే సమయంలో... పేర్ని నాని వస్తారనే సమాచారంతో టీడీపీ కార్యకర్తలు కె కన్వెన్షన్‌ కు వెళ్లే మార్గంలో ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో పేర్ని నాని తన పర్యటనను విరమించుకున్నారు.

అనంతరం... మచిలీపట్నంలోని తన నివాసంలోనే ఆయన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే బీసీ మహిళపై దాడి జరిగిందంటూ రాష్ట్రవ్యాప్తంగా అందరితో కలిసి ఆందోళన చేయాలని సలహా ఇచ్చారు! పైనుంచి లోకేష్ డైరెక్షన్ లో గుడివాడ ఎమ్మెల్యే రాము.. బీసీ మహిళపై దాడి చేయించాడనే విషయాన్ని ఆందోళన చేస్తే బాగుంటుందని అన్నారు! దీంతో.. పేర్ని నానిపై కేసు నమోదైంది!

Tags:    

Similar News