వైసీపీపై అంత మాటా.. పవన్ వ్యూహమేంటి?
వైసీపీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎలా అధికారంలోకి వస్తుం దో చూస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.;
వైసీపీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎలా అధికారంలోకి వస్తుందో చూస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో కూడా.. వైసీపీ అధికారంలో వస్తామని చెబుతోందని అన్న వ్యాఖ్యలపై పవన్ విరగబడి నవ్విన విషయం తెలిసిందే. తాజాగా నేరుగా కామెంట్లు చేశారు. ప్రకాశం జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్ .. ఇక్కడి కొన్ని గ్రామాలకు నీరు అందించే జలజీవన్ మిషన్ పథ కానికి శ్రీకారం చుట్టారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ''మాట్లాడితే.. మళ్లీ మేం అధికారంలోకి వస్తాం.. మీ అంతు చూస్తాం. అని వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపు రాజకీయాలే వారిని ఈ స్థాయికి తీసుకువచ్చాయి. అయినా.. వారికి కన్ను మిన్ను కానకుండా వ్యవహరిస్తున్నారు. అసలు వైసీపీ అధికారంలోకి ఎలా వస్తుందో చూస్తాం. ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తాం. అసలు మీరు అధికారంలోకి రావాలని కదా!'' అని వ్యాఖ్యానించారు.
అయితే.. తనకు ఎవరిపైనా వ్యక్తిగత కక్షలు లేవన్న పవన్ కల్యాణ్.. రౌడీయిజం, గూండాయిజం చేసేవా రికి మాత్రమే తాను వ్యతిరేకమన్నారు. వైసీపీ నాయకులు అవి చేస్తున్నారని.. అందుకే ప్రజలు చిత్తుగా ఓడించారని చెప్పారు. గత ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్లిపోయిందన్నారు. అయినా .. వాటిని తట్టుకుని తాము ప్రజల కోసం కష్టపడుతున్నామని చెప్పారు. ఎట్టి పరిస్థితిలోనూ వైసీపీ అధికారంలోకి రాదని తేల్చి చెప్పారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
వ్యూహమేంటి?
వైసీపీపై ఇంత గట్టిగా పవన్ చేస్తున్న వ్యాఖ్యల వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అనేది ప్రశ్న. గతంలోనూ ఇలానే వైసీపీ అధికారంలోకి వస్తుందా? అనే ప్రశ్నకు గట్టిగా నవ్వి ఊరుకున్నారు. ఇక, ఇప్పుడు మరోసారి గట్టిగా తేల్చి చెప్పారు. అంటే.. వైసీపీని అధికారంలోకి రాకుండా చేసే ప్రచార వ్యూహమో.. లేక ప్రజలను తనవైపు తిప్పుకొనే వ్యూహమో ఏదైనా కొత్తగా ఉండి ఉంటుందా? అనేది ప్రశ్న. ప్రస్తుతం అయితే.. ఉప ముఖ్యమంత్రిగా పవన్‌కు మంచి మార్కులే ఉన్నాయి. కానీ, నాలుగేళ్ల తర్వాత.. ఎలా ఉంటుందో చూడాలి.