• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  టీడీపీపై పవన్...

టీడీపీపై పవన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్.. ఎందుకంటే..

| ఓ రాజకీయ పార్టీ అధినేతగా మరో పార్టీ అవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని పవన్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

By - Tupaki Desk
Update: 2025-03-29 06:03 GMT

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ లో టీడీపీపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. 43వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న టీడీపీ భవిష్యత్తులో మరింత నిబద్ధతతో ప్రజల పక్షాన నిలబడాలని ఆకాంక్షించారు. 42 ఏళ్ల ప్రస్థానంలో టీడీపీ ఎన్నో విప్లవాత్మక మార్పులను తెచ్చిందని కొనియాడారు. ఓ రాజకీయ పార్టీ అధినేతగా మరో పార్టీ అవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని పవన్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎక్స్ లో ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు తెలిపారు. ‘‘ 1982 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా, ప్రజల గొంతుకగా తెలుగుదేశం వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 42 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఆనందంగా ఉంది. నాటి నుండి నేటి వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి, ప్రజల పక్షాన నిలిచింది.భవిష్యత్తులో మరింత నిబద్ధతతో ప్రజల పక్షాన నిలబడాలని ఆకాంక్షిస్తున్నాను’’. అంటూ పవన్ ట్వీట్ చేశారు.

2014లో ఆవిర్భవించిన జనసేన తొలి నుంచి టీడీపీపై సానుకూల ధోరణి అనుసరిస్తూనే ఉంది. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన జనసేన అధినేత.. 2024 ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పరిచి టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు గట్టి మద్దతుదారుగా నిలుస్తున్న పవన్ ఎప్పటికప్పుడు టీడీపీతో మెరుగైన సంబంధాలకు ప్రాధాన్యమిస్తున్నారు. చంద్రబాబు మరో పదిహేనేళ్లు సీఎంగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెబుతున్న పవన్ టీడీపీ ఆవిర్భావం సందర్భంగా చేసిన ట్వీట్ ఆ పార్టీతో సానుకూల సంబంధాలు కోరుకుంటున్నట్లు స్పష్టం చేస్తోంది. జనసేనాని ట్వీట్ టీడీపీలోనూ ఆనందం పంచుతోందని చెబుతున్నారు.

1982 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా, ప్రజల గొంతుకగా తెలుగుదేశం వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి కీ. శే శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 42 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఆనందంగా ఉంది. నాటి…

— Pawan Kalyan (@PawanKalyan) March 29, 2025
Tags:    
  • PawanKalyan 
  • TDP43rdAnniversary 
  • PoliticalSupport 
  • TeluguPolitics 
  • Chandrababu 
  • Apdeputycm 
  • Appolitics 
  • Apgovernment 
  • Janasena 

Similar News

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

Copyright @2026

Powered by Blink CMS